E-Paper
Advertisement

GEN Z Investment: జెన్ జడ్ మొదటి పెట్టుబడి ఎందులో.. బీమా, సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్?

GEN Z Investment: జెన్ జడ్ మొదటి పెట్టుబడి ఎందులో.. బీమా, సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్?
Advertisement

GEN Z Investment: మీకు ఉద్యోగం వచ్చిన తొలి రోజుల్లో.. ఎన్నో పెట్టుబడి సలహాలు వింటారు. ముఖ్యంగా సేవింగ్స్, బీమా, మ్యూచువల్ ఫండ్స్ లో ఇలా పెట్టుబడుల గురించి సలహాలు ఇస్తుంటారు. అయితే జనరేషన్ జడ్ తొలినాళ్లలో తమ జీతాన్ని ఎలా పెట్టుబడి పెడితే బెటర్, ఆర్థిక నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. ప్రస్తుతం చాలా మంది యువకులు.. తమ మొదటి పెట్టుబడిని ఇన్సూరెన్స్, సేవింగ్స్ కోసం ఖర్చు చేస్తున్నారు.

హెల్త్ ఫస్ట్

స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడుల కన్నా ముందు ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచించాలని నిపుణులు అంటున్నారు. ఏదైనా ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితుల్లో సేవింగ్స్ మొత్తం ఖాళీ అవుతాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే లక్షల బిల్లులకు ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు వస్తున్నాయి. భారత్ లో వైద్య ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీపై ఆర్థిక ఒత్తిడి తగ్గిస్తుంది. దీంతో పాటు ఒక టర్మ్ ప్లాన్ కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఎమర్జెన్సీ ఫండ్

Advertisement

సేవింగ్స్ పై అంతగా రాబడి ఉండకపోవచ్చు కానీ అత్యవసర సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే 3 నుంచి 6 నెలల ఖర్చులను కవర్ చేసే ఎమర్జెన్సీ ఫండ్ ను పక్కకు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఈ డబ్బును లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లలో కాకుండా.. అప్పటికప్పుడు ఉపయోగపడే ఖాతాల్లో పొదుపు చేసుకోవాలి. ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్ తర్వాత ఇతర పెట్టుబడుల గురించి ఆలోచించాలని చెబుతున్నారు.

Also Read: 2009లో బిట్ కాయిన్ కొనలేదా? ఈ రోజే కాపర్‌లో పెట్టుబడి పెట్టండి.. ఎందుకంటే?

సంపద సృష్టి ఒక మారథాన్

Advertisement

జెన్ జడ్ కు ఉన్న అతి పెద్ద ఫ్లస్.. ఎక్కువ సమయం. ఎంత తొందరగా పెట్టుబడి స్టార్ చేస్తే .. అంత ఎక్కువగా రిటర్న్స్ పొందవచ్చు. మంచి రాబడినిచ్చే SIPలు, ఇండెక్స్ ఫండ్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్, NPSలలో పెట్టుబడులు పెట్టవచ్చు. తొలినాళ్లలో జీతం ఎక్కువగా ఉండకపోవచ్చు.. కానీ తెలివైన ఆర్థిక అలవాట్లు మీ లైఫ్ ను మారుస్తాయని నిపుణులు అంటున్నారు. సంపద సృష్టి అనేది ఒక మారథాన్ లాంటిది, ఆర్థిక క్రమశిక్షణ అవసరమని చెబుతున్నారు.

Related News

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

కొత్త ఉద్యోగంలో చేరారా? మీ PF ఖాతాలో ఈ 5 వివరాలు తప్పనిసరిగా చూడండి

Big Stories

Advertisement
×