E-Paper
Advertisement

High Court: హైకోర్టు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. సొంత రాష్ట్రంలో రూ. 69,150 జీతం, ఇదే మంచి ఛాన్స్ బ్రో

High Court: హైకోర్టు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. సొంత రాష్ట్రంలో రూ. 69,150 జీతం, ఇదే మంచి ఛాన్స్ బ్రో
Advertisement

తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (TGHC) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన హైకోర్టుతో పాటు జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 పోస్టులతో పాటు, జిల్లా కోర్టుల్లో భారీగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోర్టు వర్గాలు వెల్లడించాయి.

పోస్టుల వివరాలివే.. 

Advertisement

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ప్రధానంగా రెండు విభాగాల్లో నియామకాలు జరుగుతున్నాయి. అందులో..

ఆఫీస్ సబార్డినేట్: 34 పోస్టులు

Advertisement

డ్రైవర్: 09 పోస్టులు

మొత్తం 43 పోస్టులతో పాటు.. తెలంగాణలోని వివిధ జిల్లా కోర్టుల్లో అదనంగా 859 ఉద్యోగాల భర్తీకి కూడా ప్రక్రియ ప్రారంభమైంది. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన అభ్యర్థులకు ఒక అద్భుతమైన అవకాశంగా నిలవనుంది.

విద్యార్హత: 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్టును అనుసరించి నిర్ణీత విద్యార్హతలు కలిగి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు 7వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. డ్రైవర్ పోస్టులకు సంబంధిత విద్యార్హతలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి.

వయోపరిమితి: 2026, జూలై 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 46 ఏళ్లు మించకూడదు. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు కల్పించారు. ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC) అభ్యర్థులకు 5 ఏళ్లు, శారీరక వికలాంగులకు (PH) 10 ఏళ్ల వరకు మినహాయింపు ఉంటుంది.

జీతం, ఉద్యోగ ఎంపిక వివరాలు.. 

ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతభత్యాలను హైకోర్టు నిర్ణయించింది.

ఆఫీస్ సబార్డినేట్: నెలకు రూ. 19,000 నుండి రూ. 58,850 వరకు ఉంటుంది.

డ్రైవర్: నెలకు రూ. 22,900 నుండి రూ. 69,150 వరకు.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) ద్వారా ఎంపిక చేస్తారు. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి రాత పరీక్షతో పాటు స్కిల్ టెస్ట్ (డ్రైవింగ్ టెస్ట్) నిర్వహించడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం, ఫీజు వివరాలు.. 

అభ్యర్థులు 2026, ఫిబ్రవరి 7వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫీజు వివరాలు.. 

డ్రైవర్ పోస్టులకు: రూ. 500.

ఆఫీస్ సబార్డినేట్: జనరల్, బీసీ అభ్యర్థులకు రూ. 600. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 400 గా నిర్ణయించారు.

అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెబ్ సైట్ ద్వారా త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అఫీషియల్ వెబ్ సైట్: https://tshc.gov.in/

ALSO READ: Indian Navy: ఇండియన్ నేవీలో జాబ్స్.. వేతనం అక్షరాల రూ.1,25,000.. ఇలాంటి జాబ్ కొడితే లైఫ్ సెట్ బ్రో

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×