E-Paper
Advertisement

దిగొస్తున్న పసిడి-సిల్వర్ ధరలు, సోమవారం మార్కెట్ మాటేంటి?

దిగొస్తున్న పసిడి-సిల్వర్ ధరలు, సోమవారం మార్కెట్ మాటేంటి?
Advertisement

Gold – Silver Price:  బంగారం, వెండి ధరలు ఇంకా పతనం అవుతాయా? అంతర్జాతీయ పరిణామాలు, ఇంకోవైపు వడ్డీ రేట్ల వ్యవహారంలో ఫెడ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. దీంతో సోమవారం బులియన్ మార్కెట్ ఎలా ఉంటుందని సామాన్యులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గడిచిన ఐదు రోజుల్లో వెండి ధరలు దాదాపు రూ.8 వేలు తగ్గినట్టు మార్కె్ట్ దారులు చెబుతున్నారు.

సోమవారం బులియన్ మార్కెట్ మాటేంటి?

అమెరికా ఉపాధి డేటా, గౌరవ్ గార్గ్-నాన్‌ఫార్మ్ పేరోల్స్ నివేదికలు, డాలర్- ట్రెజరీ ఈల్డ్స్ లు విలువైన లోహాలను తీవ్ర ప్రభావం చూపగలదని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శుక్రవారం MCX గోల్డ్ 10గ్రాములకు రూ. 154,300 వద్ద స్థిరపడింది. సోమవారం అంటే సెప్టెంబర్ 7న బంగారం ధర రూ. 153,700 నుండి రూ. 155,433 మధ్యలో ఉండవచ్చని అంచనా వేస్తున్నాయి. భారత మార్కెట్లు శనివారం, ఆదివారం సెలవు కావడంతో మూతపడ్డాయి. సోమవారం ట్రేడింగ్‌లో ఫెడ్ నిర్ణయాలు బట్టి పెరగడం లేకుంటే తగ్గడం జరుగుతుందని చెబుతున్నాయి.

గతవారం దిగొచ్చిన బంగారం-వెండి ధరలు

Advertisement

గత వారం బంగారం-వెండి ధరలు అమాంతంగా తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు సుమారు రూ. 3,500 మేరా తగ్గింది. వారపు ధరల మార్పులను పరిశీలిస్తే అక్టోబర్ 5 గడువులో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,281 వద్ద ముగిసింది. శుక్రవారం ట్రేడింగ్‌లో విలువైన లోహం ధర రూ. 1,52,815కు పడిపోయింది. దీంతో ఈ వారంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 3,466 మేర తగ్గింది. అటు మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్-MCX లో వెండి ధర కిలోకు దాదాపు రూ.5,000 మేర పడిపోయింది.

మార్కెట్ వర్గాలు ఏం చెబుతున్నాయి?

గత వారం వెండి ధరల తగ్గుదల విస్తృతంగా కనిపించింది. చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం MCX వెండి ధర కిలోకు రూ. 2,42,444 వద్ద ముగిసింది. సెప్టెంబర్ 4న రూ. 2,37,500కు పడిపోయింది. దీని ప్రకారం ఒక వారంలో కిలో వెండి ధర రూ. 4,944 మేరా తగ్గింది. గత వారం వెండి ధర పడిపోయిన తర్వాత ఇప్పుడు దాని జీవిత కాలం గరిష్ట స్థాయి కంటే చౌకగా మారింది. జనవరి చివరి వారంలో MCXలో వెండి ఫ్యూచర్స్ ధర మొదటిసారి రూ. 4 లక్షల చారిత్రక స్థాయిని దాటి రూ. 4,20,048 చేరింది. ప్రస్తుత ధరతో పోలిస్తే ఆ గరిష్ట స్థాయి నుండి చౌకగా మారింది.

Advertisement

ALSO READ: PPF vs SIP.. నెలకు రూ.10,000 పెట్టుబడి చేసేందుకు ఏది లాభదాయకం?

ఫ్యూచర్స్ ట్రేడింగ్‌ను అనుసరించి దేశీయ మార్కెట్లో బంగారం-వెండి ధరలను పరిశీలిద్దాం. ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెబ్‌సైట్ ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర ఆగస్టు 28న రూ. 1,59,578 వద్ద ముగిసింది. గత శుక్రవారం రూ. 1,54,884 కు దిగొచ్చింది. అంటే ప్రతి 10 గ్రాములకు ధర రూ. 4,694 మేరా తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. ₹1,51,170 ఉంది. అదే సమయంలో వెండి ధర వారం రోజుల్లో రూ. 2,43,892 నుండి రూ. 2,35,456 కు చేరింది. దాదాపుగా రూ.8,436 మేర తగ్గింది.

Related News

PPF vs SIP.. నెలకు రూ.10,000 పెట్టుబడి చేసేందుకు ఏది లాభదాయకం?

డిగ్రీ లేదు.. పెట్టుబడి లేదు.. రూ.కోట్ల వ్యాపారం చేస్తున్న 65 ఏళ్ల మహిళ

స్వతహాగా ఆదివారాలు, రాత్రిళ్లు కూడా పనిచేస్తున్న ఆ కంపెనీ ఉద్యోగులు.. డబ్బు కోసం కాదు

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

Big Stories

Advertisement
×