PPF vs SIP| నెలకు రూ.10,000 పొదుపు చేసే వారికి PPF, SIP రెండూ ప్రముఖ పెట్టుబడి మార్గాలు. అయితే రిస్క్, రాబడి విషయంలో రెండింటికీ తేడాలున్నాయి. ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు చేసి భవిష్యత్తు కోసం పెద్ద మొత్తాన్ని సిద్ధం చేసుకోవాలని చాలామంది భావిస్తారు. 15 ఏళ్ల టార్గెట్‌తో పెట్టుబడి చేసేవారికి PPF, మ్యూచువల్ ఫండ్ SIPలు ఉపయోగపడవచ్చు. PPFలో ప్రభుత్వం నిర్ణయించే వడ్డీ లభిస్తుంది. అదే SIPలో మార్కెట్ ఆధారంగా రాబడి మారుతుంది. అందుకే పెట్టుబడి ఎంపిక చేసుకునే ముందు రిస్క్, టార్టెట్, పెట్టుబడి కాలం.. ఈ అంశాలన్నీ పరిశీలించాలి.
పిపిఎస్ లేదా ఎస్ఐపి రెండింటో ఏది లాభదాయకం అనేది తెలుసుకునేందుకు రమేష్, సురేష్ అనే ఇద్దరు వ్యక్తు ఉదాహరణగా అర్థం చేసుకుందాం.
రమేష్, సురేష్ అనే ఇద్దరు స్నేహితులు నెలకు రూ.10,000 చొప్పున పెట్టుబడి చేయాలనుకుంటున్నారని అనుకుందాం. ఇద్దరూ 15 ఏళ్ల పాటు తమ పెట్టుబడిని కొనసాగిస్తారు. ఈ కాలంలో ఒక్కొక్కరి మొత్తం పెట్టుబడి రూ.18 లక్షలకు చేరుతుంది.
రమేష్ తక్కువ రిస్క్ కోసం PPFను ఎంచుకున్నాడు. సురేష్ అధిక రాబడి కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ SIPను ఎంచుకున్నాడు. 15 ఏళ్ల తర్వాత ఇద్దరికీ వచ్చే మొత్తం మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మారుతుంది.
PPFలో 7.1 శాతం వడ్డీతో స్థిరమైన వృద్ధి లభించే అవకాశం ఉంది. ఈ ఉదాహరణలో PPF వడ్డీ రేటును ఏడాదికి 7.1 శాతంగా తీసుకున్నారు. PPFలో చక్రవడ్డీ విధానం ద్వారా పెట్టుబడి కాలక్రమంలో పెరుగుతుంది. రమేష్ 15 ఏళ్లలో మొత్తం రూ.18 లక్షలు పెట్టుబడి పెడతాడు. ఇచ్చిన లెక్కల ప్రకారం, మెచ్యూరిటీ సమయంలో సుమారు రూ.32.54 లక్షలు లభిస్తుంది. PPFలో పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తానికి వర్తించే పన్ను ప్రయోజనాలు ఉంటాయి. అయితే ప్రస్తుత పన్ను నిబంధనలను పెట్టుబడికి ముందు తప్పనిసరిగా పరిశీలించాలి.
మ్యూచువల్ ఫండ్ SIPలో రాబడికి ఎలాంటి హామీ ఉండదు. ఈక్విటీ మార్కెట్ పనితీరు ఆధారంగా పెట్టుబడి విలువ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అయితే దీర్ఘకాలంలో ఈక్విటీ పెట్టుబడులు అధిక రాబడి ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఏడాదికి 8 శాతం రాబడి వస్తే, అంచనా కార్పస్ సుమారు రూ.34.83 లక్షలు కావచ్చు. పన్ను లెక్కల మినహాయింపుల తర్వాత సుమారు రూ.32.7 లక్షలు మిగిలిపోతుంది. ఈ మొత్తం PPF అంచనా మొత్తానికి దాదాపు సమానంగా ఉంటుంది.
10 శాతం వార్షిక రాబడితో SIP మొత్తం సుమారు రూ.41.79 లక్షలకు చేరుతుంది. పన్ను లెక్కల తర్వాత సుమారు రూ.38.9 లక్షలు అందవచ్చు. ఇది PPF కంటే సుమారు రూ.6.4 లక్షలు ఎక్కువ కావచ్చు.
12 శాతం వార్షిక రాబడితో SIP కార్పస్ సుమారు రూ.50.45 లక్షలకు చేరుతుంది. పన్ను లెక్కల తర్వాత సుమారు రూ.46.40 లక్షలు మిగిలిపోతుంది. ఈ సందర్భంలో PPFతో పోలిస్తే దాదాపు రూ.13.90 లక్షలు ఎక్కువగా ఉంటుంది.
తక్కువ రిస్క్, స్థిరమైన రాబడికి ప్రాధాన్యత ఇచ్చేవారికి PPF ఉపయోగపడుతుంది. రిటైర్మెంట్, పిల్లల చదువు వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు ఇది ఒక మంచి ఎంపిక.
Also Read: కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి
మార్కెట్ హెచ్చుతగ్గులను భరించగల దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఈక్విటీ SIP అనుకూలంగా ఉంటుంది. అయితే అధిక రాబడి కోసం అధిక మార్కెట్ రిస్క్‌ను కూడా అంగీకరించాలి.
కొంతమంది పెట్టుబడిదారులు రెండు మార్గాలను కలిపి ఉపయోగించడాన్ని పరిగణిస్తారు. ఉదాహరణకు 70 శాతం ఈక్విటీ SIP, 30 శాతం PPFగా కేటాయించడం మంచిది. ఇలా చేస్తే వృద్ధి అవకాశాలతో పాటు కొంత స్థిరత్వం ఉంటుంది, రిస్క్ కూడా తగ్గుతుంది. అయితే సరైన కేటాయింపు వ్యక్తిగత లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.
Also Read: ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే