E-Paper
Advertisement

Gold-Silver Market: మంగళవారం మార్కెట్లో బంగారం-సిల్వర్ పతనం తప్పదు? ఎప్పటివరకు అంటే..

Gold-Silver Market: మంగళవారం మార్కెట్లో బంగారం-సిల్వర్ పతనం తప్పదు? ఎప్పటివరకు అంటే..
Advertisement

Gold-Silver Market: పశ్చిమాసియా సంక్షోభం తగ్గే సూచనలు కనిపించలేదు. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసినప్పటికీ బంగారం, సిల్వర్ ధరలు పతనం అవుతున్నాయి. మంగళవారం కూడా ఈ రెండు లోహాల ధరలు పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి.

మంగళవారం మార్కెట్లో బంగారం-సిల్వర్ పతనం?

Advertisement

ఇరాన్ యుద్ధం ఏమో గానీ బంగారం, వెండి ధరలు క్రమంగా పడిపోతున్నాయి. గతంలో వీటిపై మొగ్గు చూపిన ఫారెన్, దేశీయ ఇన్వెష్టర్లు, ఇప్పుడు అమ్మకాలకు పాల్పడుతున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మధ్య బంగారం, వెండి ధరలు సాధారణంగా పెరుగుతాయి. ఈసారి అవి వేగంగా పడిపోతున్నాయని మార్కెట్ విశ్లేషకుడు అరుణ్ అన్నారు. తన మూడు దశాబ్దాల కెరీర్‌లో ఈ స్థాయిలో పడిపోయిన సందర్భం లేదన్నారు.

జరుగుతున్నది చూస్తుంటే ఆందోళన కలుగుతుందని ఓ నేషనల్ మీడియాతో చెప్పారు. ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు జరిగినప్పటి నుండి ట్రెజరీ ఈల్డ్స్ పెరిగాయి. డాలర్ కూడా బలపడింది. పెట్టుబడిదారులు ఇతర చోట్ల నష్టాలను పూడ్చుకోవడానికి బంగారం, సిల్వర్ నుంచి డ్రాప్ అవుతున్నారు. ఒకప్పుడు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధర ప్రతి వారం పడిపోతోంది.

Advertisement

డాలర్ బలపడడమే అందుకు కారణం

సోమవారం ట్రేడింగ్‌లో బంగారం-వెండి ధరలు 8 నుంచి 11 శాతం వరకు పడిపోయాయి. ఏప్రిల్ 2 డెలివరీకి సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్లు 10 గ్రాములకు 5.64 శాతం తగ్గి రూ. 1,36,349 వద్ద ఉంది. సిల్వర్ ఫ్యూచర్లు కిలోకు రూ. 17,665 తగ్గి రూ. 2,09,107 వద్ద సాగుతోంది. ఇవాళ్టి మార్కెట్‌లో ఈ రెండు లోహాల ధరలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.

సురక్షిత పెట్టుబడి నేపథ్యంలో యూఎస్ డాలర్ ఇండెక్స్ తన నష్టాలను పూడ్చుకుంది. 99.50 మార్కును తిరిగి పొందినట్టు చెబుతున్నారు. ఇరాన్‌లో యుద్ధం సురక్షిత పెట్టుబడిగా డాలర్‌కు డిమాండ్‌ను పెంచిందని చెబుతున్నారు. డాలర్ సూచికకు బంగారం, ఈక్విటీలతో సంబంధం ఉంటుంది. ఆరు ప్రధాన ప్రపంచ కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ను సూచి 0.14 శాతం పెరిగింది. 99.79 వద్ద కొనసాగుతోంది.

ALSO READ: హోం ఇన్సూరెన్స్ తో ఇంటికి ధీమా.. మీ పెట్టుబడికి ప్రొటెక్షన్

ఇరాన్ యుద్ధం ప్రారంభంలో 95.55 స్థాయిలో ఉండేదని అంటున్నారు. దీనికి అదనంగా ట్రెజరీ ఈల్డ్స్ కూడా డాలర్‌కు మద్దతు ఇచ్చాయి. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో బంగారం గరిష్ట స్థాయి నుండి సుమారు 22 శాతం పడిపోయినట్టు చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే బుల్ నుంచి బేర్ మార్కెట్‌లోకి ప్రవేశించిందని చెబుతున్నారు.

గత వారం MCX లో బంగారం 8 శాతానికి పైగా పతనమైంది. జూన్ 25 తర్వాత తొలిసారిగా వీక్లీ చార్ట్‌లో 9 వారాల EMA కంటే దిగువకు చేరింది. ఇది బేరిష్‌కు సంకేతమని, ధరలు పడిపోయే అవకాశం ఉందని సూచిస్తోందన్నారు. MCX వెండి తన మూడు వారాల నష్టాల పరంపరను కొనసాగిస్తూ గతవారం 12 శాతానికి పైగా పడిపోయింది. ఏప్రిల్ మొదటివారం వరకు బంగారం, సిల్వర్ పతనం తప్పదని అంటున్నారు.  ఆ తర్వాత వీటి మార్కెట్ పెరిగే అవకాశముందని చెబుతున్నారు.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×