Tanveer Ahmed On PSL: పాకిస్తాన్ సూపర్ లీగ్ ( Pakistan Super League ) మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 26వ తేదీన ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభానికి సిద్ధమైంది. అభిమానులు ఎవరూ లేకుండానే మ్యాచ్ లు నిర్వహిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, కేవలం రెండు వేదికల్లో మాత్రమే ఈ మెగా టోర్నమెంటును నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే PSL జరుగుతోన్న సమయంలోనే ఐపీఎల్ 2026 కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రకరకాల కారణాలు చెప్పి విదేశీ క్రికెటర్లందరూ, మెల్లిగా ఐపీఎల్ వైపు మొగ్గుచూపి ఇండియాకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది విదేశీ క్రికెటర్లు PSL టోర్నమెంట్ కోసం పేర్లు దరఖాస్తు చేసుకొని, డబ్బులు ఎక్కువగా వచ్చాయి ఐపీఎల్ వైపు జంప్ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( TANVEER AHMED ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ ఆడే విదేశీ క్రికెటర్లలో ఒక్కడిని పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడేందుకు తీసుకురావాలని PSL ఓనర్లకు సవాల్ విసిరాడు తన్వీర్ అహ్మద్. అలా చేస్తే లాహోర్ వీధుల్లో నగ్నంగా ( Lahore Streets ) భరత నాట్యం చేస్తానని చాలెంజ్ చేశాడు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన చాలెంజ్ ఇప్పుడు వైరల్ గా మారింది.
విదేశీ క్రికెటర్లందరూ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోకి జంప్ అవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ మాజీ స్టార్ ఆటగాడు తన్వీర్ అహ్మద్ తన స్టైల్ లో ఇచ్చిపడేశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే ఐపీఎల్ చాలా గొప్పదని కితాభిస్తూ, PSL టోర్నమెంట్ ఓనర్లకు సవాల్ విసిరాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు సంబంధించిన ఓనర్లకు ఒకటే చెబుతున్నా.. మీ దగ్గర నిజంగానే దమ్ముంటే, ఒకే అబ్బకు పుట్టిన మగాళ్లే అయితే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నుంచి ఒకే ఒక్క విదేశీ ఆటగాడిని పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి తీసుకురండి అంటూ సవాల్ విసిరారు.
ఒకవేళ తన సవాల్ ను స్వీకరించి, PSL ఓనర్లు సక్సెస్ అయితే ప్రతి శుక్రవారం లాహోర్ వీధులలో నగ్నంగా డాన్స్ చేస్తానంటూ శపథం చేశాడు తన్వీర్ అహ్మద్. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాగా ఇప్పటికే పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి లంక ఆటగాడు శనకా, బ్లెస్సింగ్ ముజారాబాని లాంటి క్రికెటర్లు ఐపీఎల్ లో చేరారు. దీంతో ఇలాంటి ప్లేయర్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని మొహ్సిన్ నఖ్వీ హెచ్చరించారు.
🚨 MASSIVE STATEMENT BY TANVEER AHMED ON PSL OWNERS 🚨
"To all PSL owners, if you are truly your father's sons, try bringing even one IPL foreign player into the PSL. If you manage to do it, I will dance naked on the Lahore Streets on every Friday." 😆 pic.twitter.com/6xnKeBBguh
— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 24, 2026