Gold Rate Dropped: అబ్బా.. గత మూడు రోజులుగా బంగారం ధరలు దిగిరావడంతో మనోళ్లందరి ముఖాల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. పెళ్లిళ్ల సీజన్ ముందల ఇట్లా రేట్లు తగ్గడం అంటే అది మామూలు ముచ్చట కాదు. మొన్నటి దాకా ఆకాశంలో ఉన్న ధరలు ఇప్పడు కాస్త మెత్తబడడంతో, పసిడి ప్రేమికులు షాపుల బాట పడుతున్నారు. ఈ రేట్ల తగ్గుదల చూస్తుంటే, అప్పు చేసి అయినా సరే ఒక తులాన్ని ఇంట్లో పడేయాలని మధ్యతరగతి జనం గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నరు.
నిజానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో మార్పుల వల్లనే మన దగ్గర కూడా రేట్లు ఇట్లా తగ్గుతున్నాయని ట్రేడర్లు చెబుతున్నారు. మొన్నటి దాకా పైపైకి ఎగబాకిన బంగారం ధరలు, ఒక్కసారిగా కిందికి రావడం ఒక రకంగా మనకి దొరికిన మంచి ఛాన్సే. ఇలాంటి టైంలోనే జాగ్రత్తగా చూసి కొనుక్కుంటే పైసలు కూడా మంచిగనే ఆదా అవుతాయి. ఒకవేళ మీరు కూడా ఎప్పటి నుంచో బంగారు గొలుసో, గాజులో చేయించుకోవాలని చూస్తుంటే మాత్రం.. ఇదే కరెక్ట్ టైమ్. ఒక్కసారి రేట్లు మళ్లీ పెరగకముందే జల్దీగా ఆలోచించి అడుగు ముందుకు వేయండి!
నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,690 ఉండగా.. నేడు శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,660 వద్ద ఉంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,300 కాగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,350 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,030 తగ్గింది.
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,59,660 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,350 వద్ద కొనసాగుతుంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,660 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,350 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,660 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,350 వద్ద పలుకుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,810 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,46,500 వద్ద ఉంది.
Also Read: ఫిక్స్ డ్ డిపాజిట్ వర్సెస్ పీపీఎఫ్.. మీ డబ్బు ఎందులో స్పీడ్ గా పెరుగుతుంది?
నేటి సిల్వర్ ధరలు..
చల్లటి శుభవార్త.. బంగారంతో పాటు నేడు సిల్వర్ ధరలు కూడా భారీగా తగ్గాయి.. నిన్న శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,90,000 వద్ద ఉండగా.. నేడు శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 2,80,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ. 10,000 తగ్గింది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ పై రూ.5,000 తగ్గి.. 2,75,000 వద్ద పలుకుతుంది.