Jeevitha Rajasekhar: చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న సినీ జంటలలో రాజశేఖర్ , జీవిత దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకవైపు సినిమాలు చేస్తూ.. నిర్మిస్తూ.. తమ వారసురాలను ఇండస్ట్రీలోకి పంపించారు కూడా.. ఇకపోతే ఈయన కూతుర్లు ఒకవైపు ఎంబిబిఎస్ చదువుకుంటూనే మరొకవైపు సినిమా రంగంలో ఎవరికి వారు దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రోజుకో కొత్త ట్రెండ్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ అంటూ నెట్టింట విచిత్రమైన పోస్టులు సోషల్ మీడియాలో వెలిసాయి. ఫేస్ బుక్ , ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఇలా ఏ సోషల్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా సరే అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలే కనిపించాయి.
ముఖ్యంగా సినిమా అవకాశాలు లేక సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ గోటీల (గోళీలు) ఫ్యాక్టరీ పెట్టారని.. దానిద్వారా కోట్లు సంపాదిస్తున్నారని.. అందుకే సినిమాల్లోకి రాకుండా ఈ ఫ్యాక్టరీ ద్వారా పనిచేసి ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారు అంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే దానిపై తాజాగా జీవిత రాజశేఖర్ స్పందించి ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఒక ఈవెంట్ కి హాజరైన జీవిత రాజశేఖర్ నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై ఖండించింది.. రాజశేఖర్ పేరుతో తమకు ఎలాంటి గోటీల ఫ్యాక్టరీ లేదని అదంతా ఫేక్ న్యూస్ మాత్రమే అంటూ కొట్టి పారేసింది.
దీనిపై జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. “అసలు ఆ గోటీల ఫ్యాక్టరీలు ఏంటో? ఎవరు? ఎందుకు ఇలా పోస్ట్లు సృష్టిస్తున్నారో? అర్థం కావడం లేదు. నేను, మా ఆయన, మా పిల్లలు అవి చూసి నవ్వుకుంటున్నాము. ఈ మధ్య సోషల్ మీడియా కూడా ఫేక్ గా మారిపోతోంది. అందులో ఏమైనా నెగెటివిటీ విమర్శలు వచ్చాయి అంటే దాన్ని చూసి బాధపడాలా లేదా అనే ఆలోచన ఎవరికీ లేదు. ఏది నిజమో ఏది అబద్దమో కూడా తెలుసుకోలేకపోతున్నాం. ప్రతిదీ కూడా ఫేక్ చేస్తున్నారు” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ALSO READ:Tollywood: ఇండస్ట్రీలో విషాదం.. ఎన్టీఆర్ మూవీ నిర్మాత మృతి.. అసలు ఎలా జరిగిందంటే?
ఇకపోతే ఇదంతా బాగానే ఉన్నా మళ్ళీ ఆమె మాట్లాడుతూ..” రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ అంటూ వస్తున్న ఫేక్ ప్రచారం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇందులో ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని విన్నాను. అలాంటివి జరగడం చాలా బాధాకరం. దయచేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఇలాంటి పోస్టులను ఎవరు కూడా నమ్మకండి . మీకు పూర్తిగా దానిపై అవగాహన వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి మీరు ఆరా తీయండి. ఎందుకంటే ఏదైనా కూడా ఈ మధ్య ఫేక్ ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా అది ఫేక్ అని మేము వెళ్లి చెప్పలేం కదా.మీ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండండి” అంటూ క్లారిటీ ఇచ్చింది. ఏది ఏమైనా కొత్త ట్రెండ్ ఏఐ ను ఉపయోగించి క్రియేట్ చేసిన ఈ రూమర్స్ పై జీవిత క్లారిటీ ఇచ్చింది.