E-Paper
Advertisement

దిగొచ్చిన పసిడి ధరలు.. ఇది తాత్కాలిక షాకా.. కొనుగోలుకు గోల్డెన్ ఛాన్సా?

దిగొచ్చిన పసిడి ధరలు.. ఇది తాత్కాలిక షాకా.. కొనుగోలుకు గోల్డెన్ ఛాన్సా?
Advertisement

Gold Price Today: హమ్మయ్య.. వారం రోజులుగా చుక్కలనంటిన బంగారం ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. నిరంతరం పెరుగుతూ సామాన్యులకు, పసిడి ప్రియులకు షాక్ ఇచ్చిన బంగారం ధరలు నేడు ఒక్కసారిగా భారీగా తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న మార్పులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు సడలడం, అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపడమే ఈ హఠాత్ తగ్గుదలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ అనూహ్య పతనంతో కొంతకాలంగా కొనుగోళ్లు వాయిదా వేసుకున్న వారందరూ తీవ్ర ఉపశమనం పొందుతూ నగల షాపుల వైపు పరుగులు తీస్తున్నారు.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,180 ఉండగా.. నేడు శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,330 వద్ద పలుకుతుంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,000 కాగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,300 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,850 తగ్గింది.

Advertisement

ఆనందంలో కొనుగోలుదారులు.. కానీ ఆ భయం తప్పదా?
అయితే, ఈ తాత్కాలిక ఊరట వెనుక పసిడి ప్రియులను ఒక వైపు ఆనందం నింపుతున్నా, మరోవైపు భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆర్థిక అస్థిరతలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ మొదలైతే ఈ ధరల తగ్గుదల తాత్కాలికమే కావచ్చునని, త్వరలోనే పసిడి మళ్లీ రెక్కలు తొడుగుతుందనే ప్రచారం జరుగుతోంది. అందుకే ధరలు మరికొద్ది రోజులు తగ్గుతాయా లేక సడన్‌గా మళ్లీ పుంజుకుంటాయా అనే గందరగోళంలో కొనుగోలుదారులు పడ్డారు. కాబట్టి, రాబోయే రోజుల్లో ధరల సరళిని నిశితంగా గమనిస్తూ, అవసరమైన మేరకు ప్లాన్ చేసుకుని కొనుగోలు చేయడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,44,330 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,300 వద్ద కొనసాగుతుంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,330 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,300 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,330 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,300 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,480 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,32,450 వద్ద ఉంది.

నేటి సిల్వర్ ధరలు..
అయ్యబాబోబ్.. నేడు బంగారమే కాదు.. సిల్వర్ ధరలు కూడా భారీగానే తగ్గాయి. నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 2,45,000 కాగా.. నేడు శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ.2,40,000 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు కేజీ సిల్వర్ పై రూ.5,000 తగ్గింది. అలాగే కలకత్త, ముంబై, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,35,000 లు పలుకుతోంది.

Also Read: అర్ధరాత్రి ప్రకటన.. అంతా సరే, రాజీనామా సంగతేంటి?

Related News

నేషనల్ పెన్షన్ సిస్టమ్ కొత్త రూల్స్.. పెన్షన్ డబ్బులకు ఫుల్ గ్యారెంటీ, ఇంకెందుకు ఆ చింత

ఆకాశానికి క్రూడ్ ఆయిల్ ధరలు.. 95 డాలర్లు పైనే, ఆయిల్ ధరలు పెరిగే ఛాన్స్

పసిడి షాక్.. కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు.. ఆషాఢం ఎఫెక్టేనా!

పోస్టాఫీసు డబ్బా ఎరుపు రంగులోనే ఎందుకు? అసలు మ్యాటర్ ఇదన్నమాట!

షాకింగ్ న్యూస్.. రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్లతో మైండ్ బ్లాంక్!

ట్రంప్ ప్రకటన.. జెనరిక్ మందులపై 200 శాతం సుంకాలు, భారతీయ కంపెనీలపై ప్రభావం ఎంత?

ఇండియాలోనూ ప్లాస్టిక్ నోట్లు.. ప్రస్తుతం ఏయే దేశాల్లో చెలామణిలో ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×