E-Paper
Advertisement

Gold Rates Hike: పసిడి ప్రియులకు షాక్.. తగ్గినట్టే తగ్గి.. మళ్లీ జెట్ స్పీడ్‌లో పైకి!

Gold Rates Hike: పసిడి ప్రియులకు షాక్.. తగ్గినట్టే తగ్గి.. మళ్లీ జెట్ స్పీడ్‌లో పైకి!

Gold Rates Hike: వామ్మో.. నిన్న తగ్గినట్టే తగ్గి.. నేడు పసిడి ధరలు మళ్లీ రెక్కలు విప్పుకోవడం సామాన్యులకు షాకింగ్‌గా మారింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు వల్ల బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో ఊహించడం నిపుణులకు కూడా సవాలుగా మారింది.

అయితే ఈ యుద్ధం కొనసాగినంత కాలం మార్కెట్‌లో ఈ తరహా ఒడిదుడుకులు సహజమని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం యుద్ధమే కాకుండా, సెంట్రల్ బ్యాంకుల వద్ద పేరుకుపోతున్న నిల్వలు, ద్రవ్యోల్బణ భయాలు కూడా పసిడికి గిరాకీని పెంచుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలుదారులు ఈ పెరిగిన ధరలను భరించక తప్పని స్థితి నెలకొంది. రానున్న రోజుల్లో అంతర్జాతీయ శాంతి చర్చలు సఫలమైతే తప్ప, పసిడి ధరలు స్థిరపడే సూచనలు కనిపించడం లేదు.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,680 ఉండగా.. నేడు మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,62,380 వద్ద ఉంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,200 కాగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,850 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.700 పెరిగింది.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,62,380 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,850 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,380 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,850 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,380 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,850 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,62,530 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,49,000 వద్ద ఉంది.

Also Read: రిటైర్మెంట్ లైఫ్ కోసం.. NPSలో రూ. 50,000 పెట్టుబడి.. ప్లానింగ్ ఎలా అంటే?

నేటి సిల్వర్ ధరలు..
బిగ్ షాక్.. సిల్వర్ ధరలు నిన్నమొన్నటి వరకు సైలెంట్‌గా ఉండి నేడు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. నిన్న సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,90,000 వద్ద ఉండగా.. నేడు మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,00,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ. 10,000 పెరిగింది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ పై రూ.10,000 పెరిగి.. 2,90,000 వద్ద పలుకుతుంది.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×