E-Paper
Advertisement

US Iran War: రష్యా, చైనాలకు ఇరాన్‌పై ఎందుకంత ప్రేమ? ఇరాన్‌తో ఈ రెండు దేశాలకు వచ్చే లాభాలేంటి?

US Iran War: రష్యా, చైనాలకు ఇరాన్‌పై ఎందుకంత ప్రేమ? ఇరాన్‌తో ఈ రెండు దేశాలకు వచ్చే లాభాలేంటి?

US  Iran War: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొదలై రోజులు గడుస్తున్నాయి. కానీ ఇరాన్‌ ఇంకా అమెరికా గుప్పిట్లోకి రాలేదు. అమెరికాను ప్రాథేయడపడటం లేదు. యుద్ధం ఆపమని వేడుకోవడం లేదు. సై అంటే సై అంటోంది. దేనికైనా రెడీ అంటోంది. యుద్ధం మరో ఆరు రోజులు.. ఆరు వారాలు కాదు.. ఆరు నెలలైనా చేస్తామంటోంది. మరి ఇరాన్‌కు ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? ఇరాన్ ధైర్యమేంటి? అంటే సమాధానం రష్యా, చైనా. రీసెంట్‌గా అమెరికా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చింది. రష్యా పరోక్షంగా యుద్ధం చేస్తోంది. అమెరికాకు సంబంధించిన ఎయిర్‌బేస్‌లు, కీలక స్థావరాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని సేకరించి ఇరాన్‌కు చేరవేస్తుంది అని. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇదంతా నిజమని అనిపిస్తోంది.

ఆత్మరక్షణ కోసమే దాడులు

రీసెంట్‌గా అమెరికా, ఇరాన్ వార్‌పై అమెరికా అధ్యక్షుడు పుతిన్ కూడా స్పందించారు. తాము ఈ యుద్ధంలో న్యూట్రల్‌గా లేము అని. అంతేకాదు ఈ యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా అని.. ఇరాన్‌ కేవలం ప్రతిస్పందిస్తుంది.. ఆత్మరక్షణ కోసమే దాడులు చేస్తుంది అని ప్రకటించారు. అంతేకాదు తమ ఫుల్ సపోర్ట్ ఇరాన్‌కే ఉంటుందని చెప్పారు. తమకు ఇరాన్‌ ఒక నమ్మకమైన భాగస్వామ్య దేశమన్నారు. అంతేకాదు నూతన సుప్రీం లీడర్‌గా ఎంపికైన ముజ్తబా ఖమేనీకి అభినందనలు తెలిపారు. సో ఈ చర్యలతో ఇరాన్‌కు రష్యా సాయం అందుతుందని క్లియర్‌కట్‌గా అర్థమైపోయింది. అమెరికా చేస్తున్నవి ఆరోపణలు కావు.. నిజాలేని పుతిన్ చెప్పకనే చెబుతున్నారు. నిజానికి ఇరాన్‌కు ప్రస్తుతం ఎలాంటి రాడార్ వ్యవస్థ లేదు. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ లేదు. దశల వారీగా ఇరాన్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేస్తూ వచ్చింది ఇజ్రాయెల్. కానీ అమెరికా సేనలు, దళాలు ఎక్కడ ఉన్నాయి..? ఎటునుంచి వస్తున్నాయి? అనే డేటా మాత్రం ఇరాన్‌కు ముందే అందుతుందనే చర్చ జరుగుతోంది.

Also Read: Iran Warning Trump: ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్.. మూల్యం తప్పదని ఘాటు హెచ్చరిక

అమెరికన్ ఆర్మీపై ఫోకస్

ప్రస్తుతం రష్యా నిఘా శాటిలైట్స్‌ అమెరికన్ ఆర్మీపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అమెరికా ట్రూప్ మూవ్‌మెంట్స్, షిప్స్, ఎయిర్‌క్రాఫ్ట్స్‌ లోకేషన్స అన్ని కూడా తెలుసుకొని ఇరాన్‌కు అందజేస్తుందనే చర్చ జరుగుతోంది. నిజానికి ఈ విషయాలను ఎప్పుడో ధ్రువీకరించింది అమెరికా. ఇరాన్ చేసిన దాడుల్లో అమెరికా భారీగానే నష్టపోయింది. బిలియన్ డాలర్ల విలువైన రాడార్ సిస్టమ్స్ ధ్వంసమయ్యాయి. అంతేకాదు అమెరికా ట్రూప్స్‌ ఉన్న ఎగ్జాక్ట్‌ లోకేషన్స్‌ను ఇరాన్‌ మిసైల్స్ తాకాయి. ఇదంతా చూస్తుంటే ఈ యుద్ధంలో తన మిత్ర దేశం కోసం రష్యా చేయాల్సిందంతా చేస్తుందని క్లియర్‌ కట్‌గా అర్థమైపోతుంది.

ఇక ఇరాన్‌కు మరో ఆప్తమిత్ర దేశం చైనా. ఎందుకు అనేది కాసేపటి తర్వాత చెప్పుకుందాం. అయితే డ్రాగన్ కంట్రీ కూడా ఇరాన్‌ కోసం చేయాల్సిందంతా చేస్తోంది. ఇరాన్‌కు కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్‌ను చైనా చూసుకుంటుందనే చర్చ జరుగుతోంది. స్పేర్ పార్ట్స్, మిసైల్‌ కంపోనెంట్స్ అందిస్తుందని తెలుస్తోంది. ఇరాన్‌పై దాడుల కోసం డాలర్లను కుమ్మరిస్తోంది అమెరికా. అంతేకాదు 50 వేల మంది సైన్యం, 200 ఫైటర్ జెట్స్‌, రెండు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లతో కూడిన స్ట్రైకింగ్‌ గ్రూప్‌లను ఉపయోగిస్తోంది. సో.. యుద్ధం ఎంత ఎక్కువకాలం కొనసాగిస్తే.. అంత ఎక్కువగా డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది అమెరికా.

ఇదే ఇరాన్‌కు గేమ్‌

నిజానికి చాలా ఏళ్లుగా మిసైల్, డ్రోన్ టెక్నాలజీని ఇరాన్‌కు అందిస్తూ వచ్చింది రష్యా. ఇదే ఇరాన్‌కు గేమ్‌ ఛేంజర్‌గా మారింది. ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ విధ్వంసం సృష్టించే టెక్నాలజీని రష్యా అందించింది. కానీ అమెరికా అలా కాదు. ప్రయోగించే ప్రతి మిసైల్ కూడా భారీ ఖర్చుతో తయారైనదే. సో.. యుద్ధంలో పేలే ప్రతి బుల్లెట్‌కు, దూసుకొచ్చే ప్రతి మిసైల్‌కు ఇరాన్‌తో పోలిస్తే వందశాతం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
కానీ రష్యా, చైనా చాలా సేఫ్‌ గేమ్ ఆడుతున్నాయి. ప్రపంచం దృష్టిలో ఈ యుద్దానికి దూరంగా ఉన్నట్టు సీన్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు దేశాలు ఎక్కడా కూడా నేరుగా అమెరికాను కానీ, ఇజ్రాయెల్‌ను కానీ విమర్శించలేదు.. కార్నర్‌ చేసేలా మాట్లాడలేదు. కానీ సైలెంట్‌గా తమ ఆప్త మిత్ర దేశం ఏం చేయాలో అవే చేస్తున్నాయి.

మరో ఇంట్రెస్టింగ్‌ విషయం ఏంటంటే.. ఓ వైపు ఇరాన్‌ చుట్టుపక్కల అమెరికా మోహరింపులు కొనసాగుతున్న సమయంలోనే.. ఓ రెండు విషయాలు జరిగాయి. ఒకటి రష్యన్ నేవీతో కలిసి ఇరానియన్ నేవీ యుద్ధ విన్యాసాలు చేయడం.. రెండు చైనా నేవీకి చెందిన మూడు కీలకమైన యుద్ధ నౌకలు ఇరాన్‌కు సమీపంలోకి రావడం. అమెరికా దాడులు చేయడానికి ముందు చైనా నేవీకి చెందిన టైప్ 055 క్లాస్ డిస్ట్రాయర్.. టైప్ 052D క్లాస్‌ డిస్ట్రాయర్ యుద్ద నౌకలు గల్ఫ్‌ ఆప్‌ ఒమన్‌లో ఉన్నాయి. వీటికి తోడు లియావోవాంగ్-1 అనే మారిటైమ్‌ స్పేస్ ట్రాకింగ్‌ అండ్ సర్వైలెన్స్‌ షిప్‌ కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఈ షిప్స్ ఆ ఏరియాలో ఉన్నంత కాలం అమెరికా ఎలాంటి దాడులు చేయలేదు. ఎందుకంటే దాడులకు సంబంధించిన పక్కా సమాచారం ఇరాన్‌కు ముందే వెళ్లిపోతుందనే ఆలోచనతో చాలా రోజుల పాటు వేచి చూశారని తెలుస్తోంది.

ఈ రెండు దేశాలకు వచ్చే లాభాలేంటి?

కానీ ఈ ఇంటెలిజెన్స్‌ గ్యాదరింగ్ షిప్స్ అన్నీ కూడా.. యూఎస్ ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. జోర్డాన్, ఖతార్, UAEలోని యాంటి బాలిస్టిక్‌ మిసైల్ డేటాను సేకరించాయని తెలుస్తోంది. ఈ రెండు దేశాలు ఇచ్చిన సమాచారంతోనే ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. అంతేకాదు ఇరాన్‌కు చైనా లాంగ్ రేంజ్ ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా అందించినట్టు సమాచారం. అయితే ఇవి అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఆపడంలో మాత్రం విఫలమైనట్టు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ రెండు దేశాలు ఇరాన్‌ కోసం ఎంత చేయాలో అంత చేస్తున్నట్టు మాత్రం అర్థమవుతోంది. మరి రష్యా, చైనాలకు ఇరాన్‌పై ఎందుకంత ప్రేమ? ఇరాన్‌తో ఈ రెండు దేశాలకు వచ్చే లాభాలేంటి?

చైనాకు ఇరాన్‌తో వ్యూహాత్మక బంధం

ఇరాన్‌కు రష్యా, చైనా మిత్ర దేశాలు అని అందరికి తెలుసు. కానీ ఎందుకనేది మాత్రం కొన్ని విషయాలను లోతుగా అర్థం చేసుకుంటేనే క్లారిటీ వస్తుంది. ముందుగా చైనా విషయానికి వస్తే.. చైనాకు ఇరాన్‌తో వ్యూహాత్మక బంధం ఉంది. ఎందుకంటే ఇరాన్‌ నుంచి వచ్చే చమురు చైనా డెవలప్‌మెంట్‌కు ఓ ఇంధనం లాంటిది. ఇరాన్, చైనా రెండూ కూడా అమెరికా డామినెన్స్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఇదే ఈ రెండు దేశాలను దగ్గరి చేసింది.
చైనాకు వచ్చే క్రూడ్ ఆయిల్‌లో 55 శాతం మిడిల్ ఈస్ట్‌ నుంచే వస్తుంది. ఇందులో 13 శాతం క్రూడ్ ఆయిల్ ఒక్క ఇరాన్‌ నుంచే వస్తుంది. అంతేకాదు.. ఇరాన్‌ క్రూడ్ ఆయిల్‌లో 80 శాతాన్ని కొనుగోలు చేసేది చైనానే. అంతేకాదు హర్మూజ్ జలసంధి గుండా తన ఆయిల్ ట్యాంకర్‌లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వెళ్లాలంటే ఇరాన్‌తో మంచి రిలేషన్స్ చాలా అవసరం.

ఒకవేళ ఇరాన్‌ను అమెరికా కంట్రోల్‌లోకి తీసుకుంటే.. చైనా ఇంధన అవసరాలను కంట్రోల్ చేసే అధికారం అమెరికా చేతికి వచ్చినట్టే. అదే జరిగితే చైనా ఆయిల్ సప్లై రిస్క్‌లో పడ్డట్టే. ఇరాన్‌ కాకుండా మిగిలిన దేశాలన్ని కూడా అమెరికా ఎలా అంటే అలా తలూపేవే. అరబ్ దేశాల్లో అమెరికన్ ఆర్మీ బేస్‌లు కూడా ఉన్నాయి. సో.. వాటికి కౌంటర్‌గా ఉండాలన్నా.. కంట్రోల్‌ చేయాలన్నా.. ఇరాన్‌ అనేది తమ చేజారకుండా ఉండాలనేది చైనా ఆలోచన. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే.. ఇరాన్‌ను ఆర్థికంగా ఆదుకునేందుకు చైనా చేయాల్సిందంతా చేస్తోంది. ఓ వైపు అమెరికా ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇరాన్‌కు ఆపన్నహస్తం అందించింది చైనా. ఇరాన్ నుంచి భారీగా చమురును కొనుగోలు చేస్తూ ఆర్థికంగా ఆదుకుంది. 2021 నుంచి మొన్నటి వరకు 140 బిలియన్ డాలర్ల విలువైన క్రూడ్ ఆయిల్‌ను కొనుగోలు చేసింది చైనా. అంతేకాదు.. ఎనర్జీ, బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్టార్‌లో ఏకంగా 400 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించుకుంది. ఇరాన్‌లో లార్జెస్ట్ టెలికమ్యూనికేషన్స్‌ సంస్థ చైనాకు చెందిన హువావే.

సేమ్ అదే స్ట్రాటజీ

ఇరాన్‌కు ఏఐ టెక్నాలజీ అందించింది చైనా. ఇరాన్‌లో ఓపెన్ ఇంటర్నేట్ యాక్సిక్‌కు కావాల్సిన ఫైర్‌వాల్, టెక్నికల్ సపోర్ట్‌ కూడా చైనాదే. అంతేకాదు ఇరాన్‌తో అనేక రక్షణరంగ ఒప్పందాలు కూడా చేసుకుంది చైనా. అంతేకాదు దీని వెనక చైనా మరో వ్యూహం కూడా ఉంది. తైవాన్‌ను చైనా పక్కలో బల్లెంలా తయారు చేస్తోంది అమెరికా. సేమ్ అదే స్ట్రాటజీని ఇరాన్‌ విషయంలో ఇంప్లిమెంట్ చేస్తుంది చైనా. తైవాన్‌ విషయంలో అమెరికా ఫోకస్ చేయకుండా ఉండాలంటే.. అగ్రరాజ్యం మొత్తం ఫోకస్‌ మిడిల్ ఈస్ట్‌ పేనే ఉంచాలి. అంతేకాదు అమెరికా తన బడ్జెట్‌ను ఇక్కడే ఖర్చు చేసేలా చేయాలి. ఇప్పుడుదే జరుగుతోంది. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఆయిల్ దాహానికి ఇరాన్ బలవుతున్న సమయంలోనే తాను చేయాల్సింది చేస్తోంది చైనా.

ఇక రష్యా విషయానికి వస్తే ఇరాన్‌కు సాయం చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. మాములుగానే రష్యా, అమెరికా మొదటి నుంచి బద్ధ శత్రవులు. అక్కడ చైనా విషయంలో తైవాన్‌ను ఎలాగైతే తయారు చేసిందో.. ఇక్కడ ఉక్రెయిన్‌ను కూడా రష్యాకు పక్కలో బల్లెంలా మార్చింది. రష్యాను బూచిగా చూపించి.. ఈయూను చెప్పు చేతుల్లోకి తెచ్చుకుంది అమెరికా. మిడిల్‌ ఈస్ట్‌లో కూడా ఇరాన్‌ను బూచిగా చూపించి అన్ని దేశాలను కంట్రోల్‌లో ఉంచుకుంది. ఇలా ఒక్కో దేశంపై అమెరికా పెత్తనం చేయడం రష్యాకు మొదటి నుంచే ఇష్టం లేదు. ఇప్పుడు మరో దేశం కూడా తమ చేతి నుంచి చేజారడం రష్యాకు మింగుడు పడని అంశం. అందుకే ఇరాన్‌కు మేము సైతం సాయం అందించేందుకు రెడీ అవుతుంది. ఇలా ఓ వైపు రష్యా,మరోవైపు చైనా ఇరాన్‌కు మేమున్నామంటూ సైలెంట్‌గా చేయాల్సింది చేస్తుంది. అందుకే ఇరాన్ ఇన్నాళ్ల పాటు పోరాటం చేయగలిగింది. లేదంటే ఇరాన్ కథ ముగిసి ఇప్పటికే చాలా రోజులయ్యేది. ఇప్పుడు ఇరాన్‌పై ప్రేమతో కాకపోయినా.. వారి వారి లక్ష్యాలను సాధించడానికైనా ఇరాన్‌కు తప్పక సాయం చేయాల్సిన పరిస్థితి.

Story by: Anup, Big Tv

Also Read: US Iran War: రంగంలోకి సెకండ్ జనరేషన్ మిసైల్స్.. అసలు యుద్ధం ఇప్పుడే మొదలైందంటున్న ఇరాన్!

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×