E-Paper
Advertisement

NPS Investment: రిటైర్మెంట్ లైఫ్ కోసం.. NPSలో రూ. 50,000 పెట్టుబడి.. ప్లానింగ్ ఎలా అంటే?

NPS Investment: రిటైర్మెంట్ లైఫ్ కోసం.. NPSలో రూ. 50,000 పెట్టుబడి.. ప్లానింగ్ ఎలా అంటే?
Advertisement

NPS Investment: ఆర్థిక ప్రణాళికలో.. రిటైర్మెంట్ ప్లానింగ్ ఎప్పుడూ లాస్ట్ లోనే ఉంటుంది. EMIలు, రెంట్, స్కూల్ ఫీజులు, బీమా ప్రీమియం, రోజువారీ ఖర్చులకు వెంటనే కేటాయింపులు ఉంటాయి. మన ఆలోచనలో ఒక చిన్న మార్పు ఆర్థిక భవిష్యత్తును మారుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరిలో ఉన్నాం. రాబోయేది అప్రైసల్ సీజన్ కాబట్టి, చాలా మంది జీతాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెరుగుతాయి. పెరిగిన ఈ జీతం డబ్బులను తెలివిగా పెట్టుబడి పెట్టుకోవచ్చని నిపుణులు అంటున్నారు. సంవత్సరానికి రూ. 50,000, నెలకు అంటే నెలకు రూ. 4,000 పెట్టుబడి పెడితే భారీగా కార్పస్ బిల్డ్ చేసుకోవచ్చు.

9 శాతం రాబడి

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నియంత్రణలో ఉంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)..ద్వారా రిటైర్మెంట్ ఫండ్ ను పెంచుకోవచ్చు.
సగటున 9% వార్షిక రాబడితో 30 సంవత్సరాల పాటు ఏడాదికి రూ. 50,000 పెట్టుబడి పెట్టారనుకోండి. రిటైర్మెంట్ సమయానికి ఈ మొత్తం సుమారు రూ. 68.72 లక్షలకు చేరుకుంటుంది.

ఎక్కువ వ్యవధికి

Advertisement

ఈ పెట్టుబడిని 35 ఏళ్లకు పొడిగిస్తే, ఈ కార్పస్ రూ. 95 లక్షల నుంచి రూ.1 కోటి వరకు పెంచుకోవచ్చు. మీకు జీతం పెరిగినప్పుడల్లా ప్రతి సంవత్సరం 5% పెట్టుబడిని పెంచండి. ఇలా పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్తే రిటైర్మెంట్ కార్పస్‌ రూ. 1.1–1.2 కోట్లకు పెరుగుతుంది. ఎన్పీఎస్ లో ఫస్ట్ 10 ఇయర్స్ కాంపౌండింగ్ అంతగా కనిపించదు. కానీ, ఆ తర్వాత మీ డబ్బే డబ్బును సంపాదిస్తుంది. అందుకే ఏడాదికి రూ. 50,000 పెట్టుబడి కాస్త ముందుగా ప్రారంభిస్తే కోటి కంటే ఎక్కువ కార్పస్‌ను బిల్డ్ చేసుకోవచ్చు.

ఉదాహరణకు

ఉదాహరణకు 2000 సంవత్సరంలో పుట్టిన ఓ వ్యక్తి ఏడాదికి రూ. 50,000 పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. 60 సంవత్సరాల వయస్సు వరకు అలాగే పెట్టుబడి కొనసాగిస్తే, 9% వార్షిక రాబడిని అంచనా వేసుకుంటే కార్పస్ అమౌంట్ సుమారు రూ. 1.74 కోట్లకు పెరుగుతుంది. ఈ మొత్తంలో, ఒకేసారి 60 శాతం అంటే దాదాపు రూ. 1.04 కోట్లు విత్ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన బ్యాలెన్స్ ను నెలకు రూ. 52,289 చొప్పున పెన్షన్‌ గా పొందవచ్చు. NPS లో ఫండ్ మేనేజర్ సమస్య ఉండదు.

Advertisement

Also Read: మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏడాదికి రూ.10 వేలు ఈ పథకంలో పెట్టండి.. 18 ఏళ్ల తర్వాత అదిరిపోయే బెనిఫిట్

పన్ను ప్రయోజనాలు

NPS తో తక్షణమే పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. దీంతో పాటు సెక్షన్ 80CCD(1B) కింద మరో రూ. 50,000 పన్ను మినహాయింపు పొందవచ్చు. 30% పన్ను పరిధిలోని వారు NPSలో రూ. 50,000 పెట్టుబడి పెడితే సంవత్సరానికి సుమారు రూ. 15,000 పన్ను ఆదా చేసుకోవచ్చు.

Related News

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

ఏఐ సునామీ.. ఐబీఎంకు ఊహించని షాక్! గంటల్లోనే రూ. 6.7 లక్షల కోట్లు మాయం!

నెలకు రూ.15,000 జీతం వచ్చే వారు కూడా లక్షాధికారి ఎలా అవ్వచ్చు? 50-30-20 రూల్ అంటే ఏంటి?

Big Stories

Advertisement
×