Gold-Silver Price Down: దేశంలో పండగల వేళ మహిళలకు శుభవార్త. ఇన్నాళ్లు అందని దాక్షగా ఉన్న బంగారం-వెండి ధరలు పతనం అవుతున్నాయి. కేవలం 10 రోజుల్లో 7 వేలు తగ్గింది. అటు వెండి కూడా అదే దారిలో నడుస్తోంది. ఇంకా ధరలు పతనమవుతాయా? ఇక్కడితో బ్రేక్ పడనుందా? మార్కెట్ ఇంతగా పడిపోవడానికి కారణాలను ఇప్పుడు చూద్దాం.
గురువారం దేశీయంగా బంగారం-వెండి ధరలు భారీగా పడిపోయాయి. గడిచిన వారం రోజులుగా పతనం కొనసాగుతూనే ఉంది. బంగారం దాదాపు రూ. 1700 మేర తగ్గి రూ.1,45,000 మార్కు కంటే దిగువన ట్రేడింగ్ అవుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర 1.19 శాతం తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 1,44,340కి చేరింది. వెండి ధర మరింత తీవ్రంగా పడిపోయింది. కిలో ధర రూ. 5,200 అంటే 2.47 శాతం తగ్గింది. ప్రస్తుతం రూ. 2,04,002 వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి.
విలువైన లోహాల ధరలు ఇంకా పతనం అవుతాయా? ఇక్కడితో బ్రేక్ పడుతుందా? బులియన్ మార్కెట్ వర్గాలు ఏం చెబుతున్నాయి? గోల్డ్ రేట్లు పతనం కావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ పుంజుకోవడం, ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడమేనని అంటున్నాయి మార్కెట్ వర్గాలు. అమెరికా బాండ్ ఈల్డ్స్ 10 సంవత్సరాల ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ 5 శాతానికిపైగా పెరిగాయి.
బాండ్లపై అధిక రాబడి వస్తున్నప్పుడు బంగారంపై పెట్టుబడుదారుల ఆసక్తి తగ్గుతుంది. దీనికితోడు పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్, సౌదీఅరేబియా- హూతీ తిరుగుబాటుదారుల ఘర్షణతో ముడి చమురు ధరలు క్రమంగా ఎగబాకుతున్నాయి. ఇటీవల బ్యారెల్కు 110 డాలర్ల మార్కును అధిగమించి 5 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు వెంటాడుతున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు సేఫ్ జోన్ ని ఎంచుకున్నారు.
హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి ధర ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 1,44,380 వద్ద కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజు దాదాపు రూ. 1700 తగ్గుముఖం పట్టింది. అక్టోబర్ 10న రూ. 1,51,420 వద్ద ఉండేది. గడిచిన 10 రోజులను పరిశీలిస్తే ఏకంగా రూ. 7040 తగ్గింది. 22 క్యారెట్ల బంగారు ఆభరణాల ధర రూ. 1,32,350 వద్ద ఉంది. గురువారం ఒక్కరోజు రూ. 1550 మేరా తగ్గింది. అక్టోబర్ 20న రూ. 1800 తగ్గింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో రూ. 3350 మేరా దిగి వచ్చింది.
ALSO READ: ఉద్యోగంతో విసిగిపోయారా? రూ. లక్ష ఉంటే చాలు.. ఇంటి నుంచే ప్రారంభించగల వ్యాపారాలు ఇవే!
ఇంటర్నేషనల్ బులియన్ మార్కెట్లోనూ అదే పరిస్థితి నెలకొంది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు వారం కిందట 4200 డాలర్లపైన ట్రేడింగ్ జరిగేది. ఇప్పుడు 4100 డాలర్ల దిగువకు చేరింది. స్పాట్ సిల్వర్ రేటు 63 డాలర్ల స్థాయి నుంచి 55 డాలర్లకు పడిపోయింది. మరోవైపు మల్టీ కమొడిటీ ఎక్స్చేంజీలో (MCX) బంగారం ధర గురువారం ఒక శాతం వరకు తగ్గింది. ఎంసీఎక్స్ సిల్వర్ రేటు 3 శాతం వరకు తగ్గింది.