Telangana Anchors Remuneration:ప్రమోషన్ అనేది పెద్ద ఆక్సిజన్ ,అది సినిమాకైనా ,ఈవెంట్ కైనా ,షో కైనా..అందుకే వాటిని ముందుండి నడిపించే యాంకర్లకి ఎంతైనా కుమ్మరించి ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతారు మేకర్స్.మరి తెలంగాణ నుండి ఇండస్ట్రీలోకి వచ్చి ఒక వెలుగు వెలిగిన, వెలుగొందుతున్న యాంకర్స్ లో ఎవరు ఎంతెంత పారితోషికం తీసుకున్నారో,తీసుకుంటున్నారో మనమూ ఒక లుక్ వేద్దాం !
ఉదయభాను
తెలంగాణా యాంకర్స్ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చే పేరు ఉదయభాను ..పెద్దపల్లికి ఉదయ భాను ఇప్పుడంటే కాస్త స్పీడ్ తగ్గించింది కాని, ఒకప్పుడు ఈ భామ టీవీల్లో, షోలలో,ఈవెంట్స్ లలో ఎంత సందడి చేసేదో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.వన్స్ మోర్ ప్లీజ్ లాంటి ఎన్నో ఎంటర్ టైన్ మెంట్ ఎపిసోడ్స్ పాటు అనేక సినిమా ఫంక్షన్స్ ని ఒంటి చేత్తో లాగించిన ఈ వెటరన్ యాంకర్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు డిమాండ్ ని బట్టి యాబయ్ వేల నుండి లక్ష రూపాయల వరకు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని సోషల్ మీడియా టాక్.ఇక ప్రస్తుతం అడపాదడపా ఈవెంట్స్ చేస్తున్న ఉదయభాను రెండు నుండి మూడు లక్షల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం.
అనసూయ భరద్వాజ్
ఇక హైదరాబాద్ కి చెందిన అనసూయ భరద్వాజ్ కూడా కొంతకాలం క్రితం వరకు జబర్దస్త్ వంటి ఎన్నో షోలని తనదైన యాంకరింగ్ తో ఎంటర్ టైన్ చేసిందే. ఇక ఈ భామ పారితోషికం విషయానికి వస్తే బాగా డిమాండ్ ఉన్నప్పుడు 2 నుండి 3 వరకు వసూలు చేసిన ఈ వెటరన్ భామ ప్రస్తుతం లక్ష నుండి రెండు లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టు వినిపిస్తుంది.
శ్రీముఖి
ఇక నిజామాబాదు కి చెందిన శ్రీముఖి కూడా ఇపుడు వరుస షోలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెల్సిందే.ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న యాంకర్ లలో అటు మా ఇంటి బంగారం వంటి సినిమాలతో పాటు ఇటు షోస్ అంటూ ఎక్కువ బిజీగా ఉన్న యాంకర్ శ్రీముఖే అని చెప్పాలి.ఇక శ్రీముఖి విషయానికి వస్తే ప్రస్తుతం ఒక్కో షోకి దాదాపు 75 వేల నుండి లక్షా యాబయ్ వేల వరకు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
బిత్తిరి సత్తి
ఇక తెలంగాణ యాసని పాపులర్ చేసిన బిత్తిరి సత్తి ఆలియాస్ రవిది రంగారెడ్డి జిల్లా , చేవెళ్ల మండలం లోని పామెన గ్రామం అన్న సంగతి తెల్సిందే.ఇక తనదైన మాటతీరుతో సోషల్ మీడియా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సత్తి ప్రస్తుతం లక్ష నుండి లక్షా 50 వేల మధ్యలో పుచ్చుకుంటున్నట్టు వినిపిస్తుంది.మరి ఇందులో నిజమెంతో సత్తియే బయటపెట్టాలి.
శివ జ్యోతి ఆలియాస్ సావిత్రి
ఇక సత్తితో పాటే యాంకరింగ్ చేసి ఫుల్ పాపులర్ అయిన శివ జ్యోతి ఆలియాస్ సావిత్రిది నిజామాబాద్ జిల్లా, ముప్కాల్ మండలంలోని నాగంపేట గ్రామం.ఇప్పుడంటే షోస్ తగ్గించింది కానీ ఒకప్పుడు ఈవిడ యాంకరింగ్ చేస్తే షో TRP లో రాకెట్ లా దూసుకెళ్తుంది అన్న పేరుండేది.ఇక ఈవిడ పారితోషికం విషయానికి వస్తే 50 వేల నుండి లక్ష మధ్యలో అందుకుంటున్నట్టు సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.
రవి
ఇక హైదరాబాద్ కి చెందిన రవి కూడా ప్రస్తుతం యాంకరింగ్ లో దూసుకుపోతున్నవాడే.ఇక వరుస పెట్టి షోలు, ఈవెంట్స్ అంటూ చేసుకుపోతున్న రవి ప్రస్తుతం ఒక్కో షోకి లక్ష నుండి రెండు వరకని , డిమాండ్ ని బట్టి రెండు నుండి మూడు వరకు కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు
ఇక హైదరాబాద్ కి చెందిన విష్ణు ప్రియ,కత్తి కార్తీక,రచ్చ రాములమ్మ ఆలియాస్ రమ్యకృష్ణ ,గాయత్రి భార్గవి,శిల్పా చక్రవర్తి,అరియానా గ్లోరి,హన్మకొండ చెందిన సుజాత ,ఖమ్మంకి చెందిన ప్రభాకర్ లు కూడా డిమాండ్ కి తగ్గట్టుగా యాబయ్ వేల నుండి లక్ష వరకు డిమాండ్ చేస్తారన్న టాక్ వినిపిస్తుంది.అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలుగానే పరిగణించాలి .నిజానిజాలేంటో వాళ్ళు బతికి చెబితే కాని తెలీదు.
ALSO READ :ఇదేం క్రేజ్ మామా.. ‘గాజులు గల గల’ పాటకు జనం ఫిదా!