E-Paper
Advertisement

Oppo K14x: ఒప్పో నుంచి 6,500mAh బ్యాటరీ ఫోన్ లాంచ్.. రూ.14,999కే 120Hz డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 16 ఫీచర్లు!

Oppo K14x: ఒప్పో నుంచి 6,500mAh బ్యాటరీ ఫోన్ లాంచ్.. రూ.14,999కే 120Hz డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 16 ఫీచర్లు!
Advertisement

Oppo K14x: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో.. తమ యూజర్ల కోసం తన పాపులర్ K సిరీస్‌లో భాగంగా Oppo K14x పేరుతో సరికొత్త బడ్జెట్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. భారీ బ్యాటరీ, లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ వంటి ప్రత్యేకతలతో వచ్చిన ఈ ఫోన్, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర బడ్జెట్ ఫోన్‌లకు గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.

ధర ఎంతంటే?

సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఒప్పో ఈ ఫోన్ ధరను నిర్ణయించింది. Oppo K14x ఫోన్ 4GB RAM వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6GB RAM వేరియంట్ ధర kp.16,999గా ఉంది. ఫిబ్రవరి 16 నుండి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో అధికారిక సైట్లలో ఇది విక్రయానికి రానుంది. లాంచ్ ఆఫర్ కింద ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రిజం వయొలెట్, ఐసీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Advertisement

Also Read: తక్కువ ధరలో బెస్ట్ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ టాప్-5 ఫోన్లు మీ కోసమే!

మెరుగైన పనితీరు..

ఈ Oppo K14x ఫోన్ 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల గేమింగ్ లేదా వీడియోలు చూసేటప్పుడు మెరుగైన పనితీరును అందిస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా పీక్ బ్రైట్‌నెస్‌ను అందించారు. దీనికి ఉన్న IP64 రేటింగ్ వల్ల నీటి చినుకులు పడినా ఫోన్ పాడవుతుందనే భయం ఉండదు.

భారీ బ్యాటరీ సామర్థ్యం..

Advertisement

ఒప్పో K14x ప్లస్ పాయింట్ ఏమిటంటే.. దీని 6,500mAh భారీ బ్యాటరీ. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. చాలా గంటల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చు. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉండటం వల్ల బ్యాటరీ త్వరగానే ఫుల్ అవుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్.. మల్టీ టాస్కింగ్‌ను చాలా సులువుగా హ్యాండిల్ చేస్తుంది.

అద్భుతమైన కెమెరా సెటప్..

ఈ హ్యాండ్ సెట్ వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా ఉండటంతో, ఇది మంచి క్వాలిటీ ఫొటోలను అందిస్తుంది. ఇక సెల్ఫీల కోసం 5MP కెమెరాను అమర్చారు. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 పై రన్ అవుతుంది.

Also Read: రూ.13 వేలకే శాంసంగ్ 5G ఫోన్.. లెదర్ ఫినిష్ లుక్‌తో గెలాక్సీ F70e భారత్‌లో లాంచ్!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×