E-Paper
Advertisement

Bapatla Crime: మానవత్వం మంటగలిసిన వేళ.. 13 కీ.మీ తమ్ముడి శవాన్ని బైక్‌పై తరలించిన అన్నదమ్ములు!

Bapatla Crime: మానవత్వం మంటగలిసిన వేళ.. 13 కీ.మీ తమ్ముడి శవాన్ని బైక్‌పై తరలించిన అన్నదమ్ములు!
Advertisement

Bapatla Crime: బాపట్ల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అత్యంత విషాదకరం , మనసును కలిచివేసేలా ఉంది. పేదరికం ఎంతటి దుస్థితికి తీసుకెళ్తుందో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం.

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామానికి చెందిన నక్కా నాగేశ్వరరావు అనే వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆ నిమిషం వరకు ప్రాణాలతో ఉంటాడనుకున్న వ్యక్తి విగతజీవిగా మారడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Advertisement

మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ వాహనం అందుబాటులో లేకపోవడం ఆ కుటుంబానికి మొదటి అడ్డంకిగా మారింది. సాధారణంగా మృతదేహాలను ఉచితంగా తరలించాల్సిన ప్రభుత్వ అంబులెన్స్‌లు లేదా వాహనాలు సమయానికి అందుబాటులో లేకపోవడంతో.. వారు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వచ్చింది.

మృతదేహాన్ని తరలించేందుకు ఒక ఆటో డ్రైవర్‌ను సంప్రదించగా.. అతను 2000 రూపాయలు డిమాండ్ చేశాడు. కనీస భారమైన ఆ మొత్తాన్ని చెల్లించుకోలేని ఆర్థిక స్థితిలో ఉన్న ఆ సోదరులు.. చేసేదేం లేక గుండె నిండా భారంతో ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. తమ సోదరుడి మృతదేహాన్ని బైక్ మీద ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టుకుని.. సుమారు 13 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చింతాయపాలెం చేరుకున్నారు.

Advertisement

ఈ దృశ్యం చూసిన స్థానికులు , బాటసారులు చలించిపోయారు. ప్రాణం ఉన్నప్పుడు సరైన వైద్యం, ప్రాణం పోయాక కనీసం గౌరవప్రదమైన అంతిమ యాత్రకు కూడా నోచుకోలేని పేదరికంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం , ఆసుపత్రి యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి అమానవీయ ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి.. మృతుడి కుటుంబానికి సాయం అందించాలని.. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read: మహదేవప్ప మృతిపై మంత్రి శ్రీహరి దిగ్భ్రాంతి.. నిజం నిప్పులాంటిది.. విచారణకు సిద్ధం!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×