E-Paper
Advertisement

బంగారు ఆభరణాలపై ఈ సీక్రెట్ కోడ్స్ గమనించారా? ఈ 916, 750, 585 నెంబర్లకు అర్థమేంటి?

బంగారు ఆభరణాలపై ఈ సీక్రెట్ కోడ్స్ గమనించారా? ఈ 916, 750, 585 నెంబర్లకు అర్థమేంటి?
Advertisement

Gold Hallmark Numbers: దేశంలో పసిడికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండుగలు, శుభకార్యాలు వచ్చాయంటే తప్పనిసరిగా బంగారం కొనాల్సిందే. మరోవైపు సేవింగ్స్ కోసం చాలా మంది గోల్డ్ ను కొనుగోలు చేస్తున్నారు. అయితే నగలు కొనేటప్పుడు వాటి వెనుక కొన్ని రకాల నెంబర్లు ఎప్పుడోకప్పుడు గమనించే ఉంటారు. ప్రధానంగా ఆభరణాల లోపలి భాగంలో 916, 750, 585 వంటి మూడంకెల సంఖ్యలు చెక్కి ఉంటాయి. అసలు ఈ నంబర్లు దేనికి సంకేతం? బంగారం కొనుగోళ్లలో వీటి ప్రాధాన్యత ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈ నంబర్లు ఎందుకు ముద్రిస్తారు?

బంగారం ఆభరణాలపై కనిపించే ఈ మూడంకెల సంఖ్యలు.. ఆ నగలోని స్వచ్ఛత (Purity) శాతాన్ని సూచిస్తాయి. ఆభరణాలు చేసేటప్పుడు మేలిమి బంగారంలో రాగి, వెండి వంటి ఇతర లోహాలను కలుపుతారన్న సంగతి తెలిసిందే. అలా కలిపిన తర్వాత ఆ నగరూపంలో ఎంత శాతం నకిలీ లేని అసలు బంగారం ఉందో చెప్పడానికే ఈ హాల్‌మార్క్ కోడింగ్ విధానాన్ని ఉపయోగిస్తారు.

916, 750 కోడ్స్ అర్థమేంటి?

Advertisement

జ్యూవెలరీ షాపుల్లో కొనే నగలపై ఉన్న నంబర్లను బట్టి ఆ బంగారం క్యారెట్ ఎంతనేది ఈజీగా కనిపెట్టవచ్చు. మీ ఆభరణంపై ‘916’ అని ఉంటే.. అందులో 91.6 శాతం మేలిమి బంగారం, మిగిలిన 8.4 శాతం ఇతర లోహాలు ఉన్నాయని అర్థం. ప్రస్తుతం మెజారిటీ ప్రజలు కొనుగోలు చేసే 22 క్యారెట్ బంగారంలో ఈ కోడ్స్ ప్రధానంగా కనిపిస్తాయి. అలా కాకుండా 750 నెంబర్ ఉంటే.. ఆ నగల్లో 75 శాతం బంగారం, 25 శాతం ఇతర లోహాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఈ నెంబర్ 18 క్యారెట్ల ఆభరణాల్లో కనిపిస్తాయి. వజ్రాల నగల తయారీకి, రోజ్ గోల్డ్ ఆభరణాలకు ఈ 18 క్యారెట్ల పసిడిని ఉపయోగిస్తారు.

మరి 585 కోడ్ సంగతేంటి?

బంగారంపై ఈ కోడ్ ఉంటే ఆ ఆభరణంలో 58.5 శాతం మాత్రమే బంగారం ఉందని గ్రహించాలి. మిగతా భాగం రాగి, వెండి వంటి ఇతర లోహాలతో నిండి ఉన్నట్లు భావించాలి. ఈ కోడ్ ను ప్రధానంగా 14 క్యారెట్ల జ్యూయలరీస్ లో చూడొచ్చు. తక్కువ బడ్జెట్ లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారు.. ప్రధానంగా 585 కోడ్ ను ఆభరణాలపై తరుచూ చూస్తుంటారు.

24 క్యారెట్లకు కోడ్ ఏంటంటే?

Advertisement

సాధారణంగా 24 క్యారెట్ల బంగారం అనేది 99.9 శాతం ఎంతో స్వచ్ఛమైనది. ఇందులో రాగి, వెండి వంటి ఇతర లోహాలు ఏమాత్రం కలిసి ఉండవు. అందుకే దీని ప్యూరిటీని 999 కోడ్ (99.9%) తో సూచిస్తారు. అయితే అంత స్వచ్ఛమైన బంగారంతో ఆభరణాలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. స్వచ్చమైన బంగారం.. చాలా మెత్తగా ఉండటం వల్ల దానితో ఆభరణాలు చేయడం సాధ్యపడదు. అందుకే నగలు గట్టిగా, మన్నికగా ఉండటానికి రాగి, వెండి వంటి ఇతర లోహాలను కలపాల్సి వస్తుంది.

Also Read: సామాన్యుల స్పెషల్.. BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. 72 రోజులు రచ్చ రంబోలా!

బీఐఎస్ హాల్‌మార్కింగ్

ప్రభుత్వం నిబంధనల ప్రకారం.. బంగారానికి బీఐఎస్ (BIS) హాల్‌మార్కింగ్ తప్పనిసరి. కాబట్టి బంగారం కొనుగోలు చేసేటప్పుడు కేవలం డిజైన్ మాత్రమే కాకుండా నగపై బీఐఎస్ లోగోతో పాటు 916, 750, 585 వంటి నంబర్లు స్పష్టంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఒక్కోసారి 22 క్యారెట్ల బంగారం పేరు చెప్పి 585 కోడ్ ఉన్న ఆభరణాలు కొందరు వ్యాపారులు కట్టబెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ కోడ్స్ పై అవగాహన ఉంటే.. అలాంటి మోసాలకు చెక్ పెట్టేందుకు వీలు ఏర్పడుతుంది.

Also Read: జియో మరో క్రేజీ ప్లాన్.. రూ. 1,748 కే 11 నెలల వ్యాలిడిటీ.. ఫ్రీ కాల్స్, డేటా, లైవ్ ఛానల్స్!

Related News

రైతులకు కీలక కబురు.. పీఎం కిసాన్ స్కీమ్ 24వ విడత నిధులు, నవరాత్రుల సమయంలో

దిగొస్తున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు మాటేంటి?

ఇండియాలో వారసత్వ ఆస్తుల బదిలీ అంత ఈజీ కాదు.. అన్నీ సవ్యంగా ఉన్నా లంచాలు ఇవ్వాల్సిందే

ఎల్పీజీ గ్యాస్ బుకింగ్‌పై కీలక నిర్ణయం.. వినియోగదారులకు గుడ్‌న్యూస్, బుకింగ్ సమయం తగ్గింపు

జన్‌ ధన్‌ బ్యాంకు ఖాతాలు.. వెలుగులోకి కొత్త విషయాలు, సమాచారం హక్కు చట్టం ద్వారా..

ఈసారి పండుగలకు చేదు రుచి.. భారీగా పెరగనున్న స్వీట్స్ ధరలు

బ్యాంక్ అకౌంట్‌లో ఎంత నగదు జమ చేస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసు వస్తుంది? ఈ రూల్స్ తెలుసుకోండి

ఓల్డ్ మాంక్ రమ్ అసలు రమ్మే కాదు.. ఇంతకాలం మందుబాబులను కంపెనీ మోసం చేసిందా?

Big Stories

Advertisement
×