E-Paper
Advertisement

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. లగేజీ బుకింగ్ ఇక మరింత ఈజీ!

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. లగేజీ బుకింగ్ ఇక మరింత ఈజీ!
Advertisement

Indian Railways Online Luggage Booking: రైలులో ఎక్కువ సామానుతో ప్రయాణించే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై అదనపు సామాను బుక్ చేయడానికి ప్రత్యేకంగా రైల్వే స్టేషన్‌ లోని పార్సెల్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టింది. జూలై 31 నుంచి ఆన్‌ లైన్‌ లో అదనపు లగేజీని కూడా బుక్ చేసుకునే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది.

టికెట్ బుక్ చేసినంత ఈజీగా లగేజీ బుకింగ్

ఇప్పటి వరకు నిర్ణీత ఉచిత పరిమితికి మించి సామాను తీసుకెళ్లాలంటే ప్రయాణికులు పార్సెల్ కార్యాలయానికి వెళ్లి బుకింగ్ చేయాల్సి వచ్చేది. కొత్త విధానంతో ఈ ప్రక్రియ మరింత సులభం కానుంది. టికెట్ రిజర్వేషన్ చేసే సమయంలోనే అదనపు లగేజీ వివరాలను నమోదు చేసి, అవసరమైన ఛార్జీని  చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే ఈ సదుపాయం అన్ని కోచ్‌లకు వర్తించదు. ఏసీ 3 టైర్,  ఏసీ చైర్ కార్, సెకండ్ క్లాస్ కోచ్‌లలో ప్రస్తుతం ఉన్న ఉచిత సామాను పరిమితుల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ తరగతుల్లో ఉచిత పరిమితి, గరిష్ట అనుమతి ఒకేలా ఉండటంతో అదనపు సామాను బుక్ చేసుకునే అవకాశం ఉండదు.

ఏ క్లాస్ లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చంటే?

Advertisement

ప్రస్తుతం రైల్వే నిబంధనల ప్రకారం ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 70 కిలోలు, ఫస్ట్ క్లాస్/ఏసీ 2 టైర్‌లో 50 కిలోలు, ఏసీ 3 టైర్, ఏసీ చైర్ కార్, స్లీపర్ క్లాస్‌లో 40 కిలోలు, సెకండ్ క్లాస్‌ లో 35 కిలోల వరకు ఉచితంగా సామాను తీసుకెళ్లవచ్చు. ఉచిత పరిమితిని మించి సామాను తీసుకెళ్లాలనుకునే వారు, ఆయా తరగతులకు అనుమతించిన గరిష్ట పరిమితిలోపు మాత్రమే అదనపు బుకింగ్ చేసుకోవాలి. ఇందుకోసం సాధారణ లగేజీ ఛార్జీకి 1.5 రెట్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 150 కిలోలు, ఫస్ట్ క్లాస్/ఏసీ 2 టైర్‌ లో 100 కిలోలు, స్లీపర్ క్లాస్‌ లో 80 కిలోలు, సెకండ్ క్లాస్‌ లో 70 కిలోల వరకు సామాను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అయితే ఏసీ 3 టైర్, ఏసీ చైర్ కార్ కోచ్‌ లలో అదనపు లగేజీ బుకింగ్‌కు అవకాశం ఉండదని అధికారులు వెల్లడించారు.

పరిమితికి మించి సామాను తీసుకెళ్తే భారీ జరిమానా!

ప్రయాణ సమయంలో, గమ్యస్థానంలో అనుమతించిన పరిమితికి మించి బుక్ చేయని సామాను ఉన్నట్లు గుర్తిస్తే జరిమానా విధించే అవకాశం ఉందని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎక్కువ సామాను తీసుకెళ్లే వారు ముందుగానే నిబంధనలు తెలుసుకుని బుక్ చేసుకోవడం మంచిది. సామాను బరువుతో పాటు దాని పరిమాణంపై కూడా రైల్వే పరిమితులు విధించాయి. ఏసీ 3 టైర్, ఏసీ చైర్ కార్ కోచ్‌లలో నిర్ణయించిన కొలతల కంటే పెద్ద సామానును అనుమతించరు. అలాంటి వస్తువులను తప్పనిసరిగా లగేజీ, పార్సెల్ వ్యాన్‌ లో బుక్ చేయాలి. లగేజీ ఛార్జీలు ప్రయాణ దూరం, బరువు, రైలు రకం ఆధారంగా మారుతాయి. కనీసంగా 10 కిలోల స్లాబ్‌కు రూ.30 నుంచి ఛార్జీలు ప్రారంభమవుతాయి. కనీస బుకింగ్ దూరం 50 కిలోమీటర్లుగా ఉంటుంది.

Advertisement

Read Also: విశాఖ–బెంగళూరు వందే భారత్ స్లీపర్.. విజయవాడ మీదుగానేనా?

Related News

బెంగళూరు–విజయవాడ ప్రయాణానికి కొత్త దారి.. ఏకంగా 110 కి.మీ తగ్గనున్న దూరం!

మగ జీవులను నీచంగా చూసే.. భయంకరమైన ఆడ జంతువులు.. ఇవి చాలా డేంజర్ భయ్యా!

ఇండియన్ బుల్లెట్ రైల్ రెడీ.. ఇక పట్టాలు ఎక్కుడే తరువాయి..

భూగర్భంలో వింత నగరం.. ఏకంగా 20 వేల మంది హ్యాపీగా ఉండొచ్చు.. ఇంతకి ఎక్కడుందో తెలుసా?

భోగాపురం నుంచి అంతర్జాతీయ సర్వీసులు, అక్టోబర్ 27 నుంచి మరొక దేశానికి, వారానికి రెండు సార్లు

శ్రీకృష్ణుడి ద్వారకా తరహాలో.. సముద్ర గర్భంలో దాగి ఉన్న.. టాప్-5 ప్రాచీన నగరాలు ఇవే!

నాగార్జునసాగర్ టూర్ ఇక మరింత థ్రిల్లింగ్.. సరికొత్త అడ్వెంచర్ స్పాట్ గా ఎత్తిపోతల జలపాతం!

ఓరి దేవుడా.. కుక్కను వెతుక్కుంటూ వెళ్తే.. 17 వేల ఏళ్ల నాటి అద్భుతాలు బయటపడ్డాయ్!

Big Stories

Advertisement
×