E-Paper
Advertisement

పతనానికి బ్రేక్.. మళ్లీ బంగారం ధరలు పైపైకి, ఇవాళ మార్కెట్లో ధరలు

పతనానికి బ్రేక్.. మళ్లీ బంగారం ధరలు పైపైకి, ఇవాళ మార్కెట్లో ధరలు
Advertisement

Gold Price Today: గతవారం అంతా పతనం బాటలో పయనించిన బంగారం-వెండి ధరలు అమాంతంగా ఎగబాకాయి. సోమవారం మార్కెట్లో ధరలు ఒక్కసారి పెరిగాయి. ఉన్నట్లుండి విలువైన లోహాల ధరలు పెరగడంతో కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ ఇవాళ మార్కెట్లో ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.

పతనానికి బ్రేక్.. మళ్లీ మార్కెట్ బంగారం-వెండి ధరలు పైపైకి

గోల్డ్ ప్రియులకు సడన్ షాక్. గడిచిన వారం రోజులుగా బంగారం ధరల పతనానికి బ్రేక్ పడింది. దీపావళి రాకముందు విలువైన లోహాల ధరలు క్రమంగా ఎగబాకుతున్నాయి. సోమవారం ఉదయం మార్కెట్లు ప్రారంభం కాగానే పసిడి-వెండి ధరలు క్రమంగా పుంజుకోవడం మొదలుపెట్టాయి. ఉన్నట్లుండి ధరల పెరుగుదల పలు కారణాలు చెబుతున్నాయి బులియన్ మార్కెట్ వర్గాలు.

ఇవాళ దేశంలోని బంగారం ధరలు పరిశీలిద్దాం

Advertisement

గతవారం ఇంధన ధరలు పైపైకి వెళ్లడంతో ద్రవ్యోల్బణ పెరుగుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు వడ్డీ రేట్లు కంటిన్యూ అవుతుందని అంచనాలు క్రమంగా బలపడుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడిపై ప్రతికూల ప్రభావం చూపింది. గతవారం ముగింపుతో పోలిస్తే.. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం ధర 0.21 శాతం పెరుగుదల నమోదు అయ్యింది.

10 గ్రాములు రూ. 1,42,810 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. కేజీ వెండి ధర 0.36 శాతం పెరిగింది. ప్రస్తుతం రూ.1,97,300 వద్ద ట్రేడింగ్ లావాదేవీలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ఎంసీఎక్స్-MCX ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఉదయం 9:13 గంటలకు డిసెంబర్ బంగారం 0.21 శాతం లాభపడింది. వెండి ఫ్యూచర్స్ 0.37 శాతం పెరిగింది.

Advertisement

ALSO READ: జాబ్ ఇంటర్వ్యూలో ఏఐ స్కిల్స్ గురించి అడిగితే ఏం చెప్పాలి? కంపెనీలు మీ నుంచి ఆశించే సమాధానం ఇదే

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,42,750 వద్ద కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజు రూ.170 పెరిగింది. 22 క్యారెట్ల రేటు రూ.1,30,850 వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ విభాగం రూ.150 మేరా పెరిగింది. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,42,900 వద్ద ఉంది. 22 క్యారెట్ల రేటు రూ.1,31,000 వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,750 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల ధర రూ.1,30,850గా ఉంది.

Related News

మందుబాబులకు గుడ్ న్యూస్? తగ్గనున్న స్కాచ్ విస్కీ ధరలు..

జాబ్ ఇంటర్వ్యూలో ఏఐ స్కిల్స్ గురించి అడిగితే ఏం చెప్పాలి? కంపెనీలు మీ నుంచి ఆశించే సమాధానం ఇదే

ఏడాదికి రూ.3.25 కోట్ల వరకు వేతనం.. ఏఐ కంపెనీలో రైటర్లు కావలెను మీరూ ట్రై చేసేయండి

ఉద్యోగం పోయింది, ఆర్థిక సంక్షోభం వస్తే ఎలా? ఎమర్జెన్సీ ఖర్చులకు అప్పు చేయకుండా ఈ 3 పనులు చేయండి

దీపావళి వేళ బాణాసంచా ప్రమాదాలు.. కేవలం రూ.11కే ఇన్సూరెన్స్.. రూ.25,000 వరకు కవరేజ్

కిలో వెండి రూ.4.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు.. ఇప్పుడు కొంటే లాభమా? నష్టమా?

తండ్రిపై కోర్టుకెక్కిన కూతురు.. పీపీఎఫ్ డబ్బులు తీసుకున్నారని కేసు.. తీర్పు ఇదే

Big Stories

Advertisement
×