E-Paper
Advertisement

ఘెట్టో కిడ్స్ తో భాగ్య శ్రీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదుర్స్.. వీడియో వైరల్!

ఘెట్టో కిడ్స్ తో భాగ్య శ్రీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదుర్స్.. వీడియో వైరల్!
Advertisement

Bhagyashree Bhorse:అందాల తార , అభినయ సుందరి భాగ్యశ్రీ బోర్సే(Bhagya Shree Borse) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ముఖ్యంగా అభిమానులు బంగారం అంటూ ముద్దుగా పిలుచుకుంటున్న ఈమె మనసు నిజంగానే బంగారం అనే చెప్పాలి. ఈమె ఎక్కడికి వెళితే అక్కడి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది అంటూ ఆమెతో గడిపిన ఎంతోమంది పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు కూడా.. ఇకపోతే తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన వీడియో ఈమె మంచి మనసును మరోసారి నిరూపించింది.

ఘెట్టో కిడ్స్ తో భాగ్య శ్రీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్..

తాజాగా ఘెట్టో కిడ్స్ తో ఈమె చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెలబ్రిటీ అనే అహం లేకుండా.. పిల్లల డాన్స్ స్టెప్పులకు అనుగుణంగా తనదైన శైలిలో డాన్స్ చేస్తూ అందరి హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఎవరీ ఘెట్టో కిడ్స్ అనే విషయానికి వస్తే.. ఉగాండా లోని కంపాలలోని కట్వే స్ట్రీట్ కి చెందిన పిల్లలతో కూడిన ఒక నృత్య లేదా సంగీత బృందాన్ని ఘెట్టో కిడ్స్ అని పిలుస్తారు. ఈ పిల్లలతో కలసి ఈమె చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ వీడియో షేర్ చేసిన భాగ్యశ్రీ “ఈ పిల్లలు నా మనసు దోచుకున్నారు” అంటూ క్యాప్షన్ జోడించింది.

భాగ్య శ్రీ మనసు బంగారం..

Advertisement

ఇకపోతే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఫిదా అవుతూ పలు కామెంట్లు చేస్తున్నారు. “ఇండియాలో మీకున్న అభిమాన గణం, ప్రజలు మిమ్మల్ని ఎంతగా ఆరాధిస్తున్నారో చూపిస్తోంది. కానీ ఈ వీడియో అంతకంటే అందమైన విషయాన్ని చూపించింది. మీ ఆకర్షణ దేశం దాటి ఆ చిన్నారుల హృదయాలను చేరుకుంది. భాష,సరిహద్దులు వేరుగా ఉండవచ్చు కానీ ప్రతి చిన్నారి చిరునవ్వులో ఆనందం ఒకేలా కనిపిస్తుంది. భాగ్యశ్రీ మీరు ఎక్కడ ఉంటే ఆ వాతావరణం మరింత ఆహ్లాదంగా మారుతుంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది..

also read:ఘనంగా అర్జున్ చిన్న కూతురు పెళ్లి.. ఫోటోలు వైరల్!

మోడల్ నుండి స్టార్ హీరోయిన్గా గుర్తింపు..

Advertisement

భాగ్యశ్రీ విషయానికి వస్తే.. మోడల్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె.. తొలుత వాణిజ్య ప్రకటనల్లో పనిచేసింది. అలా క్యాడ్బరీ డైరీ మిల్క్ ప్రోడక్ట్ తో వెలుగులోకి వచ్చిన ఈమెను ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) రవితేజ (Raviteja) సరసన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో హీరోయిన్గా అవకాశం కల్పించారు. ఇక ఇందులో తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాతో ఉత్తమ తొలి నటి విభాగంలో సైమా అవార్డును కూడా అందించింది. కింగ్డమ్ చిత్రంలో విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ఈమె.. దుల్కర్ సల్మాన్ తో కలిసి కాంతా అనే సినిమాలో కూడా నటించింది. రామ్ పోతినేనితో కలిసి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో నటించిన ఈమె.. అఖిల్ అక్కినేని సరసన లెనిన్ చిత్రంలో నటించి సూపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

భాగ్యశ్రీ ప్రస్తుత సినిమాలు..

ఈమె ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. విష్ణు మోహన్ దర్శకత్వంలో మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆపరేషన్ గంగా అనే మలయాళ చిత్రంలో అవకాశం అందుకుంది. అలాగే శివకుమార్ మురుగేషన్ దర్శకత్వంలో శివ కార్తీకేయన్ హీరోగా నటిస్తున్న సెయోన్ అనే తమిళ చిత్రంలో అవకాశం అందుకుంది. అలాగే ఒక కొత్త దర్శకుడితో స్వప్న దత్, ప్రియాంక దత్ తో కలిసి నిర్మిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీలో కూడా ఈమె భాగమైనట్లు సమాచారం.

?utm_source=ig_web_copy_link&cplk=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

Related News

తెలుగు డబ్బింగ్ కి సిద్ధమైన ఒడిస్సా హిట్ మూవీ..ఏదో తెలుసా?

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు..

ఏందమ్మా మానస.. సన్‌సెట్‌లోనూ ఇంత అందంగా ఉన్నావేంటి!

అసలు నేను చేసిందేంటి? గరివిడి లక్ష్మి వివాదంపై ఆర్పీ ఆవేదన!

గరివిడి లక్ష్మి వివాదంపై ఆర్పీ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు.. బయోపిక్‌లో నిజాలు చూపించారా?

ఇంస్టాగ్రామ్ నుంచి తప్పుకున్న పవన్ వైఫ్ అన్నా ..కారణం అదేనా?

ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన విశ్వక్ సేన్.. ఇది ఊహించలేదంటూ!

Big Stories

Advertisement
×