E-Paper
Advertisement

జాబ్ ఇంటర్వ్యూలో ఏఐ స్కిల్స్ గురించి అడిగితే ఏం చెప్పాలి? కంపెనీలు మీ నుంచి ఆశించే సమాధానం ఇదే

జాబ్ ఇంటర్వ్యూలో ఏఐ స్కిల్స్ గురించి అడిగితే ఏం చెప్పాలి? కంపెనీలు మీ నుంచి ఆశించే సమాధానం ఇదే
Advertisement

AI skills Question in job interview| ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తున్నారా? అక్కడ ఏఐ నైపుణ్యాలు తెలుసా? అనే ప్రశ్న ఎదురైతే.. చాట్‌జిపిటి ఉపయోగించడం వచ్చని చెబితే సరిపోదు. ఎందుకంటే ఏఐ టూల్స్ ఉపయోగించడం మాత్రమే కాదు.. వాటితో సరైన ఫలితాలు సాధించడం కూడా ముఖ్యమే! ప్రస్తుతం కంపెనీలు అభ్యర్థుల్లో ఇలాంటి నైపుణ్యాలనే ఎక్కువగా గమనిస్తున్నాయి. సమాచారాన్ని చెక్ చేయడం, సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, ఏఐ ఇచ్చే సమాధానాల్లో తప్పులు గుర్తించడం వంటి సామర్థ్యాలను కోరుకుంటున్నాయి.

AI&Beyond, టెక్ విస్‌పరర్ కంపెనీల వ్యవస్థాపకుడు, సీఈఓ జస్ప్రీత్ బింద్రా మీడియాతో మాట్లాడుతూ.. ఏఐ టూల్స్ ఉపయోగించడం ప్రాథమిక నైపుణ్యం మాత్రమేనని వివరించారు. వాటిని సరిగ్గా ఉపయోగించి వ్యాపారానికి ఉపయోగపడే ఫలితాలను సాధించడమే అసలైన ప్రత్యేకత అని తెలిపారు.

అభ్యర్థుల్లో కంపెనీలు ఆశిస్తున్న 6 ఏఐ నైపుణ్యాలు

Advertisement

1. ఏఐకి స్పష్టమైన సూచనలు ఇవ్వాలి: ఏఐ నుంచి మంచి ఫలితాలు పొందాలంటే స్పష్టమైన ప్రశ్నలు అడగాలి. అవసరమైన సమాచారం, లక్ష్యాలను వివరించడం నేర్చుకోవాలి.

2. ఏఐ ఇచ్చే సమాచారాన్ని చెక్ చేయాలి: ఏఐ కొన్నిసార్లు తప్పుడు సమాచారాన్ని అందిస్తుంది. అందుకే వాస్తవాలను పరిశీలించి, తప్పులను సరిచేసిన తర్వాతే ఆ సమాచారాన్ని ఉపయోగించాలి.

Advertisement

3. నిజమైన సమస్యలకు పరిష్కారాలు చూపాలి: పరిశోధన, రిపోర్ట్స్ తయారీ, సమాచార విశ్లేషణ వంటి పనులను వేగంగా పూర్తి చేయడానికి ఏఐని ఉపయోగించవచ్చు. దీనివల్ల కలిగిన ప్రయోజనాలను ఇంటర్వ్యూలో వివరించాలి.

4. ఉద్యోగానికి తగిన ఏఐ టూల్స్ ఎంచుకోవాలి: మార్కెటింగ్‌లో ప్రచార ప్రణాళికలకు, ఫైనాన్స్‌లో సమాచార విశ్లేషణకు, హెచ్ఆర్‌లో సాధారణ పనులను సులభతరం చేయడానికి ఏఐ ఉపయోగపడుతుంది.

5. బాధ్యతాయుతంగా ఏఐని ఉపయోగించాలి: వ్యక్తిగత సమాచారం, కంపెనీ రహస్యాలు భద్రంగా ఉంచాలి. ఏఐ వినియోగంలో గోప్యత, పక్షపాతం వంటి సమస్యలను గుర్తించాలి.

6. సొంత ఆలోచనకు ప్రాధాన్యం ఇవ్వాలి: ఏఐ సూచనలను గుడ్డిగా నమ్మకూడదు. సొంత పరిజ్ఞానం, క్రియేటివిటీతో వాటిని పరిశీలించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి.

Also Read: ఇంజినీర్ జాబ్ మానేసి రాపిడో డ్రైవర్ పనికి.. ఇప్పుడు నెలకు రూ.1.2 లక్ష ఆదాయం

ఏఐతో పాటు వ్యాపార పరిజ్ఞానం కూడా అవసరమే

మాస్టెక్ కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్, జనరల్ కౌన్సెల్ విమల్ దాంగ్రి ప్రకారం.. ఏఐని ఉపయోగించి పనితీరును మెరుగుపరచడం ముఖ్యం. కేవలం ప్రశ్నలు అడగడం తెలిసినంత మాత్రాన పూర్తి నైపుణ్యం ఉన్నట్లు కాదు. వ్యాపార సమస్యను అర్థం చేసుకుని, దానికి తగిన పరిష్కారాన్ని కనుగొనాలి. అలాగే కొత్త టూల్స్ గురించి నేర్చుకోవడం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవడం అవసరం.

Also Read: కార్పొరేట్ జాబ్ వద్దు వ్యవసాయం ముద్దు.. పొలం బాట పడుతున్న కోట్ల మంది గ్రాడ్యుయేట్లు

ఇంటర్వ్యూలో మీ ఏఐ నైపుణ్యాలను ఎలా నిరూపించాలి?

ఏఐ టూల్స్ పేర్లు చెప్పడం కంటే వాటిని ఉపయోగించిన అనుభవాలను వివరించడం మంచిది. ఏ సమస్యను ఎదుర్కొన్నారు, ఏఐని ఎలా ఉపయోగించారు, వచ్చిన సమాచారాన్ని ఎలా చెక్ చేశారు, చివరకు ఎలాంటి ఫలితాలు సాధించారు అనే విషయాలను స్పష్టంగా చెప్పాలి.

ఫ్రెషర్లు తమ కాలేజీ ప్రాజెక్టులు, పర్సనల్ ప్రాజెక్టుల గురించి చెప్పడం ద్వారా కూడా ఈ నైపుణ్యాలను నిరూపించవచ్చు. ఏఐని ఉపయోగించడం మాత్రమే కాదు.. దాని ఫలితాలను పరిశీలించి, సరైన నిర్ణయాలు తీసుకోగలగడమే ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచే కీలక నైపుణ్యం.

Related News

ఏడాదికి రూ.3.25 కోట్ల వరకు వేతనం.. ఏఐ కంపెనీలో రైటర్లు కావలెను మీరూ ట్రై చేసేయండి

ఆర్థిక సంక్షోభం వస్తే ఎలా భరించాలి? ఎమర్జెన్సీ ఖర్చులకు అప్పు చేయకుండా ఈ 3 పనులు చేయండి

దీపావళి వేళ బాణాసంచా ప్రమాదాలు.. కేవలం రూ.11కే ఇన్సూరెన్స్.. రూ.25,000 వరకు కవరేజ్

కిలో వెండి రూ.4.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు.. ఇప్పుడు కొంటే లాభమా? నష్టమా?

తండ్రిపై కోర్టుకెక్కిన కూతురు.. పీపీఎఫ్ డబ్బులు తీసుకున్నారని కేసు.. తీర్పు ఇదే

కార్పొరేట్ జాబ్ వద్దు వ్యవసాయం ముద్దు.. పొలం బాట పడుతున్న కోట్ల మంది గ్రాడ్యుయేట్లు

అమెరికాలో లక్ష డాలర్ల జీతం..  ఇండియాలో ఎంత సంపాదనతో సమానం?

Big Stories

Advertisement
×