E-Paper
Advertisement

Today Gold Rate: హమ్మయ్య.. వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు ఒక్క రోజే ఎంత తగ్గిందంటే..!

Today Gold Rate: హమ్మయ్య.. వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు ఒక్క రోజే ఎంత తగ్గిందంటే..!
Advertisement

Today Gold Rate: బంగారం ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. లక్ష మార్క్ ను దాటి.. పసిడి అంతకంతకు పైకి పోతూనే ఉంది. భవిష్యత్ లో పెరిగే అవకాశాలు తప్ప.. తగ్గే సూచనలు కనిపించడం లేదని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్, గోల్డ్ షో రూమ్‌ల నిర్వాహకులు చెప్తున్నారు. కానీ గత మూడు రోజులుగా స్వల్పంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మరి నిపుణులు చెబుతున్నట్లు ముందు ముందు బంగారం ధరలు తగ్గుతాయా? లేదా పెరుగుతాయా? అనేది అందరి మైండ్‌లో మెదులుతున్న ప్రశ్న..

నేటి బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,420 ఉండగా.. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,090 వద్ద కొనసాగుతోంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,550 కాగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,250 వద్ద ఉంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ. 330 తగ్గింది.

Advertisement

అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతోంది..? 2026లో బంగారం నిజంగానే 2 లక్షలు అవుతోందా?

ప్రస్తుతం డాలర్ విలువలో హెచ్చుతగ్గులు ఉండటం వల్ల బంగారం ధరలు మరింత పెరిగిపోతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు తమ సంపదను రక్షించుకోవడానికి సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కానీ, సోషల్ మీడియాలో బంగారం ధరలు 2026లో 2 లక్షలు దాటుతుంది అనే ప్రచారం వినిపిస్తుంది. మరి వారు చెప్పినట్టుగానే 2 లక్షలు దాటుతుందా? లేదా ఇప్పుడు ఉన్న దానికన్న ఇంకా తగ్గుతోందా? అనేది చూడాలి..

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,30,090 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,250 వద్ద ఉంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,090 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,250 వద్ద పలుకుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,090 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,250 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,240 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,19,400 వద్ద పలుకుతోంది.

Also Read: తెలంగాణ ప్రజలకు మంచి రోజు.. పార్టీ మాటిచ్చింది, నిలబెట్టుకుంది.. LIVE

నేటి సిల్వర్ ధరలు ఇలా..
అయ్యయ్యో.. బంగారం ధరలు తగ్గిన సిల్వర్ ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,98,000 కాగా.. నేడు మంగళవారం వారం కేజీ సిల్వర్ ధర రూ. 1,99,900 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ ధరపై రూ.1,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,90,000లు కొనసాగుతోంది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×