E-Paper
Advertisement

MSG Shooting :’మన శంకర వరప్రసాద్ గారు’ డబ్బింగ్ పూర్తి..అప్పుడే ప్రమోషన్స్ షురూ..!

MSG Shooting :’మన శంకర వరప్రసాద్ గారు’ డబ్బింగ్ పూర్తి..అప్పుడే ప్రమోషన్స్ షురూ..!
Advertisement

Mana Shankar Varaprasad Garu Shooting: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి, బ్యూటిఫుల్ హీరోయిన్ నయనతార జంటగా నటిస్తున్న తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి.. మీసాల పిల్ల సాంగ్ భారీగా వ్యూస్ ను అందుకుంటుంది. రీసెంట్ గా వచ్చిన శశిరేఖ సాంగ్ పై ఒకవైపు విమర్శలు వినిపిస్తున్నా కూడా సోషల్ మీడియాలో అత్యధిక వ్యూస్ ను రాబడుతూ ట్రెండింగ్ లో ఉంది.. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.. ఇక మరి ప్రమోషన్స్ ఎప్పటి నుంచి మొదలు పెడతారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

శంకరవరప్రసాద్ డబ్బింగ్ పూర్తి..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ చెయ్యనున్నట్లు గతంలో ప్రకటించారు. సినిమా విడుదల అవ్వడానికి కేవలం నెల రోజులు మాత్రమే ఉండటంతో త్వరగా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో చిత్రయూనిట్ ఉంది. దాదాపు షూటింగ్ పూర్తి అయ్యిందట.. అంతేకాదు డబ్బింగ్ పనులు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. చిరంజీవి మొదటి పార్ట్ డబ్బింగ్ ను పూర్తి చేశారట. ఇవాళ్టితో రెండో పార్ట్ డబ్బింగ్ కూడా పూర్తి చెయ్యనున్నారని టాక్. మరో వారంలో అన్నీ పనులను పూర్తి చెయ్యాలని చిత్రయూనిట్ కష్టపడుతుంది.. తక్కువ టైం ఉండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ త్వరలోనే మొదలు పెట్టనున్నారని ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది.

Advertisement

Also Read :లీడర్ బోర్డులో స్కోర్ కోసం యుద్ధం.. తనూజ vs సంజన వార్.. ఇమ్మూ పై భరణి సీరియస్.. రచ్చ రచ్చే.

రికార్డు రేటుకు చిరు మూవీ డిజిటల్ రైట్స్..

చిరంజీవి, నయనతార లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా 2026 సంక్రాంతి రేసులో నిలిచింది.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. రీసెంట్ గా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయ్యిందని తెలుస్తుంది. భారీ రేటుతో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను జీ5, శాటిలైట్ హక్కులను జీ నెట్ వర్క్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వచ్చిన అనిల్ రావిపూడి చిత్రాలు అన్నిటికీ కూడా జీ 5 ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది.. చిరును వింటేజీ లుక్ లో చూపిస్తూ టీజర్, ఆ తర్వాత పాటలు.. ఇలా సినిమా హైప్ ను మరో లెవల్ కు తీసుకెళ్తున్నాయి.. ఇప్పటివరకు బయటకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి సంక్రాంతి బరిలో ఇప్పటికే చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి.. ఆ సినిమాలకు వరప్రసాద్ గారు ఎలాంటి పోటీని ఇస్తారో చూడాలి.. ఈ మూవీ తర్వాత మరో రెండు ప్రాజెక్టులకు చిరంజీవి సైన్ చేసినట్లు తెలుస్తుంది.. ఈ సినిమా రిలీజ్ అవ్వగానే ఆ చిత్రాలను సెట్స్ మీదకు వెళ్ళనున్నాయి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×