Gold Rate Hike: పసిడి ప్రియులకు ఊరటనిస్తూ ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలకు బ్రేక్ పడటంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిణామాలు, రష్యా-అమెరికా మధ్య వాణిజ్యపరమైన సానుకూల సంకేతాలు, అమెరికా డాలర్ బలోపేతం కావడం వంటి అంశాలు పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. గత వారం ఆల్-టైమ్ రికార్డు స్థాయిలకు చేరుకున్న ధరలు, ఇప్పుడు ఒక్కసారిగా పతనం కావడం ఇన్వెస్టర్లలో కూడా చర్చనీయాంశమైంది. రానున్న రోజుల్లో అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు మరింత మెరుగుపడితే ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,57,750 ఉండగా.. నేడు సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,440 వద్ద ఉంది. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,600 కాగా.. నేడు సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,400 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,310 తగ్గింది.
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,56,440 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,400 వద్ద ఉంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,440 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,400 వద్ద పలుకుతోంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,440 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,400 వద్ద కొనసాగుతుంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,590 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,550 వద్ద ఉంది.
Also Read: రూ.100, రూ.500 నోట్ల రద్దు కాదు అప్ గ్రేడ్.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ