E-Paper
Advertisement

Egg: ఎగ్ వైట్ మాత్రమే తింటున్నారా? అయితే మీరు తీవ్రమైన పొరపాటు చేస్తున్నట్లే!

Egg: ఎగ్ వైట్ మాత్రమే తింటున్నారా? అయితే మీరు తీవ్రమైన పొరపాటు చేస్తున్నట్లే!
Advertisement

Egg: దశాబ్దాలుగా “గుడ్డు తెల్లసొన మాత్రమే తినడం గుండె ఆరోగ్యానికి మంచిది” అనే ప్రచారం వింటూనే ఉన్నాం. కానీ.. ఈ నమ్మకాన్ని సవాలు చేస్తూ 40 ఏళ్ల అనుభవం ఉన్న ఢిల్లీకి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు. గుడ్డులోని పచ్చసొన ను పారేసి, కేవలం తెల్లసొన మాత్రమే తినడం వల్ల శరీరానికి పోషకాలు అందకపోగా, కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయన హెచ్చరించారు. గుడ్డు పూర్తి ప్రయోజనాలను పొందాలంటే పచ్చసొనతో సహా తినాలని ఆయన సూచిస్తున్నారు.

చాలామంది బరువు తగ్గాలనో లేదా కొలెస్ట్రాల్ పెరుగుతుందనో భయపడి గుడ్డులోని పచ్చసొనను పారేసి, కేవలం తెల్లసొనతోనే ఆమ్లెట్లు వేసుకుంటారు. అయితే.. ఫంక్షనల్ మెడిసిన్ నిపుణులైన డాక్టర్ దీనిని ఒక పెద్ద పొరపాటుగా అభివర్ణించారు. వారి ప్రకారం.. గుడ్డు తెల్లసొన కంటే పచ్చసొనలోనే పోషకాల నిధి దాగి ఉంది.

Advertisement

తెల్లసొన మాత్రమే తింటే ఏమవుతుంది?

గుడ్డు పచ్చసొన లేకుండా కేవలం తెల్లసొనను మాత్రమే తినడం వల్ల కలిగే నష్టాలను డాక్టర్ వివరించారు. తెల్లసొనలో అధిక ప్రోటీన్ ఉంటుంది. కానీ పచ్చసొన లేకపోతే అది శరీరంలో ‘ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్’గా మారే ప్రమాదం ఉంది. దీని వల్ల శరీరంలో వాపులు, కీళ్లనొప్పులు, అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అలాగే, పచ్చసొన లేకపోతే శరీరం ప్రోటీన్‌ను సరిగ్గా గ్రహించలేదు.

Advertisement

కొలెస్ట్రాల్ పుకార్లు – వాస్తవాలు:
గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందనేది నిజమే, కానీ ఇటీవలి శాస్త్రీయ పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే.. ఆహారం ద్వారా తీసుకునే కొలెస్ట్రాల్‌కు, రక్తంలో ఉండే కొలెస్ట్రాల్‌కు నేరుగా సంబంధం లేదు. మానవ శరీరంలో 85 శాతం కొలెస్ట్రాల్‌ను కాలేయమే ఉత్పత్తి చేసుకుంటుంది. ఆహారం నుంచి వచ్చేది కేవలం 15 శాతం మాత్రమే. కాబట్టి పచ్చసొన తింటేనే కొలెస్ట్రాల్ పెరుగుతుందనేది ఒక అపోహ మాత్రమేనని డాక్టర్ స్పష్టం చేశారు.

పచ్చసొనలోని పోషకాల నిధి:
గుడ్డులో ఉండే 7 గ్రాముల ప్రోటీన్‌లో కొంత భాగం తెల్లసొనలో ఉన్నా, 5 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ A, విటమిన్ E, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, బేటా-కెరోటిన్ వంటి అత్యవసర పోషకాలన్నీ పచ్చసొనలోనే ఉంటాయి. పచ్చసొన లేని గుడ్డును తినడం వల్ల ఈ పోషకాలన్నీ మనకు అందవు.

ఆరోగ్య సమస్యల ముప్పు:
పచ్చసొనను నిరంతరం నిరాకరించడం వల్ల శరీరంలో బయోటిన్ లోపం ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా.. పచ్చిగా లేదా సరిగ్గా ఉడికించని తెల్లసొనను తినడం వల్ల ‘సాల్మొనెల్లా’ వంటి బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

Also Read: మీ శరీరంలో విటమిన్ D పెరగాలంటే.. రోజూ ఇలా చేయండి!

ఎలాంటి గుడ్లు తినాలి?
డాక్టర్ కేవలం గుడ్డు తినమని మాత్రమే కాదు. ‘ఏ గుడ్డు’ తింటున్నాం అనేది కూడా ముఖ్యమని చెప్పారు. కోళ్లు స్వేచ్ఛగా తిరుగుతూ, సహజమైన ఆహారం తీసుకుంటూ, సూర్యరశ్మిలో పెరిగే ‘ఆర్గానిక్ పాశ్చర్డ్ గుడ్లు’ మాత్రమే ఆరోగ్యకరమని ఆయన సూచించారు. ఫ్యాక్టరీలలో పెంచే కోళ్ల గుడ్ల కంటే ఇవి ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి.

“భయాన్ని వీడి, ఆహారం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోండి” అని డాక్టర్ చోప్రా సలహా ఇస్తున్నారు. గుడ్డును పూర్తిస్థాయిలో తిన్నప్పుడే అది ఆరోగ్యానికి ‘పవర్-ప్యాక్డ్ పంచ్’ అవుతుంది. కాబట్టి. తెల్లసొన కోసం పచ్చసొనను త్యాగం చేయడం ఆపేయండి.

Related News

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×