E-Paper
Advertisement

పసిడి షాక్.. కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు.. ఆషాఢం ఎఫెక్టేనా!

పసిడి షాక్.. కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు.. ఆషాఢం ఎఫెక్టేనా!
Advertisement

Gold Prices: బంగారం ధరల జోరు చూస్తుంటే సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి పసిడిలా మెరుస్తూ, కొండెక్కి కూర్చోవడంతో కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలే వివాహాది శుభకార్యాల సీజన్ ముగిసి, ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుండటంతో బంగారం ధరలు తగ్గుతాయని చాలామంది ఆశించారు. సాధారణంగా ఆషాఢంలో డిమాండ్ తగ్గి ధరలు కాస్త శాంతిస్తాయని భావిస్తారు. కానీ, దానికి భిన్నంగా పసిడి ధరలు నింగినంటుతుండటంతో అసలు ఈ పెరుగుదలకు ఆషాఢం ఎఫెక్ట్ కారణమా, లేక వెనుక ఏదైనా బలమైన ఆర్థిక కారణాలు ఉన్నాయా అనే చర్చ జోరుగా సాగుతోంది.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు మళ్లీ పసిడి ధరలు పెరిగాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,510 ఉండగా.. నేడు గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,280 వద్ద పలుకుతుంది. అలాగే బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,300 కాగా.. నేడు గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,000 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.770 పెరిగింది.

Advertisement

పసిడి పరుగురు ఇదే కారాణమా!

నిజానికి ఆభరణాల కొనుగోళ్లు తగ్గినా ధరలు తగ్గకపోవడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ ప్రభావమే! ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక అస్థిరతలు, కేంద్రీయ బ్యాంకులు భారీగా పసిడిని నిల్వ చేసుకోవడం, అలాగే డాలర్ మారకం విలువలో వస్తున్న మార్పులు బంగారం ధరను గాల్లోకి లేపుతున్నాయి. మన దేశంలో పండగల వాతావరణం, ఆషాఢం వంటి స్థానిక అంశాల కంటే గ్లోబల్ ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించడమే ఈ రికార్డు స్థాయి పెరుగుదలకు అసలు ముగింపు లేని కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు తక్షణమే తగ్గే సూచనలు కనిపంచడం లేదు కాబట్టి, పసిడి ప్రియులు కొనుగోళ్ల విషయంలో కాస్త వేచి చూసే ధోరణి అవలంబించడమే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,47,280 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,000 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,280 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,000 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,280 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,000 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,420 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,35,150 వద్ద ఉంది.

Also Read: రూ. 1.32 లక్షల కోట్ల నీట్ దందా.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కార్పొరేట్ శక్తులు!

Related News

పోస్టాఫీసు డబ్బా ఎరుపు రంగులోనే ఎందుకు? అసలు మ్యాటర్ ఇదన్నమాట!

షాకింగ్ న్యూస్.. రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్లతో మైండ్ బ్లాంక్!

ట్రంప్ ప్రకటన.. జెనరిక్ మందులపై 200 శాతం సుంకాలు, భారతీయ కంపెనీలపై ప్రభావం ఎంత?

ఇండియాలోనూ ప్లాస్టిక్ నోట్లు.. ప్రస్తుతం ఏయే దేశాల్లో చెలామణిలో ఉన్నాయంటే?

Polymer Currency: త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..ఆర్‌బీఐ సన్నాహాలు!

Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్.. కేంద్రం క్లారిటీ, వారే అర్హులు

ఆభరణాలకు పింక్ పేపరే ఎందుకు? దాని వెనుక ఉన్న రహస్యమేంటి?

Big Stories

Advertisement
×