Space Saving Washing Machines: ఈ రోజుల్లో.. మెట్రో నగరాల్లో అపార్ట్‌మెంట్ చిన్నదైనా లేదా సింగిల్ రూమ్ బ్యాచిలర్ లైఫ్ అయినా.. ఉన్న తక్కువ స్థలంలోనే అన్ని సర్దుకోవడం పెద్ద సవాలుగా మారింది! ముఖ్యంగా బట్టలు ఉతికే, వాషింగ్ మెషీన్ పెట్టడానికి స్థలం సరిపోక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే స్పేస్ సమస్యకు చెక్ పెట్టడానికి, అతి తక్కువ స్థలంలో సరిపోయే లేటెస్ట్ ‘కాంపాక్ట్ వాషింగ్ మెషీన్స్’ ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్.. అవుతున్నాయి. మీ లైఫ్‌స్టైల్‌ని ఈజీగా, ట్రెండీగా మార్చే టాప్ 5 కాంపాక్ట్ వాషింగ్ మెషీన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
మీకు బాల్కనీలో అసలు స్థలమే లేదా? అయితే ఈ ఫోల్డబుల్ మినీ వాషింగ్ మెషీన్ మీ కోసమే! ఉతికాక దీనిని బకెట్‌లా మడతబెట్టి అల్మారాలో లేదా మంచం కింద పెట్టేయొచ్చు. చిన్న పిల్లల బట్టలు, సాక్స్, డెలికేట్ బట్టలకు ఇది పర్ఫెక్ట్.
ఫోల్డబుల్ డిజైన్, లైట్ వెయిట్, తక్కువ కరెంట్ వాడకం వంటి బెస్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్టూడెంట్స్, హాస్టలర్స్, వర్కింగ్ బ్యాచిలర్స్ ఇది ఫర్ఫెక్ట్ అని చెప్పవచ్చు ధర కూడా చాలా తక్కువగానే ఉంటుంది.
ధర: రూ.1,800 – రూ.2,500
సింగిల్ రూమ్‌లో ఉండే వారికి డీఎమ్‌ఆర్ మినీ వాషింగ్ మెషీన్ బెస్ట్ అనే చెప్పాలి. కాంపాక్ట్ సైజులో.. ఉంటూనే మంచి వాషింగ్, స్పిన్ డ్రైయర్ ఫీచర్లతో వస్తుంది. తక్కువ నీరు , కరెంట్‌తో వేగంగా బట్టలు ఉతికేస్తుంది. పోర్టబుల్ క్యారీ హ్యాండిల్, తక్కువ బరువు దీని ప్రత్యేకతలు. బ్యాచిలర్స్, రోజువారీ కొన్ని బట్టలు మాత్రమే ఉతికేవారికి ఇవి బెస్ట్.
ధర: రూ.3,500 – రూ.4,500
3.Onida 6.5 kg Washer Only/Liliput:
మరీ చిన్న మినీ మెషీన్ కాకుండా, కాస్త ఎక్కువ లోడ్ సరిపోయే కాంపాక్ట్ వాషర్ కావాలంటే.. ఒనిడా పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది కానీ జీన్స్, బెడ్‌షీట్స్ వంటి బరువైన బట్టలను కూడా ఈజీగా ఉతుకుతుంది. పవర్‌ఫుల్ మోటార్, రస్ట్-ఫ్రీ బాడీ దీని ప్రత్యేకతలు. చిన్న కుటుంబాలు, స్పేస్ సేవింగ్ వెతుకుతున్న వారికి ఇవి బెస్ట్.
ధర: రూ.5,500 –రూ.7,000
మీకు ఫుల్లీ ఆటోమేటిక్ కావాలి, కానీ స్పేస్ తక్కువ ఉందా? LG 6.5kg స్మార్ట్ ఇన్వర్టర్ మోడల్ చిన్న బాల్కనీ లేదా డ్రై ఏరియాలో కూడా హాయిగా సరిపోతుంది. స్మార్ట్ డయాగ్నోసిస్, ఫైవ్ స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో కరెంట్ ఆదా చేస్తుంది. 5-స్టార్ ఎనర్జీ రేటింగ్, స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ దీని ప్రత్యేకతలు. మోడర్న్ అపార్ట్‌మెంట్స్, 3-4 మంది ఉన్న కుటుంబాలు ఉన్న వారికి ఇది బెస్ట్ అనే చెప్పాలి.
Also Read: రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్
ధర: రూ.16,500 – రూ.18,500
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు సాధారణంగా ఎక్కువ స్థలం తీసుకుంటాయి. కానీ IFB 6kg మోడల్ చాలా కాంపాక్ట్‌గా రూపొందించబడింది. దీని పైన మీరు ఇతర కౌంటర్ ఆర్గనైజర్లను కూడా సెట్ చేసుకోవచ్చు. హాట్ వాష్, స్టీమ్ ఫీచర్లతో బట్టలను క్లీన్ చేస్తుంది. 2X పవర్ స్టీమ్, ఇన్-బిల్ట్ హీటర్, ప్రీమియం వాష్ క్వాలిటీ దీని ప్రత్యేకతలు. ప్రీమియం క్లీనింగ్ & స్పేస్ ఆప్టిమైజేషన్ కోరుకునే వారికి ఇది బెస్ట్ అనే చెప్పాలి.
ధర: రూ.21,990 –రూ.23,000
మీ ఇల్లు ఎంత చిన్నదైనా, మీ రోజువారీ అవసరాలు, బడ్జెట్‌కు సరి పోయే కాంపాక్ట్ వాషింగ్ మెషీన్‌ను ఎంచుకోవడం ద్వారా స్థలాన్ని ఆదా చేయడంతో.. పాటు బట్టలు ఉతికే పనిని ఎంతో ఈజీ చేసుకోవచ్చు.