E-Paper
Advertisement

Gold Prices: పండుగ వేళ పసిడి ఘాటు.. ఉగాది పచ్చడిలో తీపి కంటే బంగారం ధర చేదే ఎక్కువ!

Gold Prices: పండుగ వేళ పసిడి ఘాటు.. ఉగాది పచ్చడిలో తీపి కంటే బంగారం ధర చేదే ఎక్కువ!
Advertisement

Gold Prices: అయ్యయ్యో.. గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.. ఉగాది పండుగ వేళ బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్లో ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. నేటి పసిడి ధరలు చూసుకుంటే..

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,420 ఉండగా.. నేడు మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,58,620 వద్ద ఉంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,300 కాగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,400 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,200 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,58,620 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,400 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,58,620 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,400 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,58,620 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,400 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,58,770 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,45,550 వద్ద ఉంది.

Also Read: సెంచరీ కొట్టిన ముడి చమురు.. బ్యారెల్ 106 డాలర్లు నాట్ అవుట్

నేటి సిల్వర్ ధరలు..
వామ్మో.. ఇదెక్కడి షాకింగ్ న్యూస్.. నేడు బంగారం ధరలు పెరిగాయని.. సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగాయి.. నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,76,000 వద్ద ఉండగా.. నేడు మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,80,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ. 4,000 పెరిగింది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ పై రూ.5,000 పెరిగి.. 2,75,000 వద్ద ఉంది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×