E-Paper
Advertisement

BRS Party: డ్రగ్స్ పార్టీ ఇష్యూ.. పైలట్ రోహిత్‌రెడ్డికి బీఆర్ఎస్ నోటీసు, మండలిలో కాంగ్రెస్ దాడి షురూ

BRS Party: డ్రగ్స్ పార్టీ ఇష్యూ.. పైలట్ రోహిత్‌రెడ్డికి బీఆర్ఎస్ నోటీసు, మండలిలో కాంగ్రెస్ దాడి షురూ
Advertisement

BRS Party: మెయినాబాద్ డ్రగ్స్ కేసు రాజకీయంగా దుమారం రేపుతోందా? ఈ కేసులో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఉండడంతో నిందితుల చుట్టూ ఉచ్చు బిగిసుకున్నట్లేనా? పరిస్థితి గమనించిన బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయ్యిందా? మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని నోటీసులు జారీ చేసిందా? అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు.

మెయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో వేగంగా పరిణామాలు

Advertisement

మెయినాబాద్ డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కయ్యారు తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు. ఈ కేసులో కేవలం ఇద్దరు నేతలు పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఒకరు ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కాగా, మరొకరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఈ కేసులో వీరితో నమిత్‌శర్మ పేరు బలంగా వినిపిస్తోంది. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఎంపీ మహేష్‌కు టీడీపీ నోటీసు ఇచ్చింది. తాజాగా ఈ జాబితాలోకి బీఆర్ఎస్ కూడా చేరిపోయింది.

మంగళవారం ఉదయం ఈ కేసుపై ప్రభుత్వం సిట్ వేసింది. పరిస్థితి గమనించిన బీఆర్ఎస్, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. హైదరాబాద్ శివార్లలో ఓ సమావేశంలో మాదకద్రవ్యాల వినియోగం జరిగినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

బీఆర్ఎస్ పార్టీలో కలకలం.. పైలట్ రోహిత్‌రెడ్డికి నోటీసు

దీనిపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అందులో ప్రస్తావించింది. వివరణ ఇచ్చేవరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అందులో ప్రస్తావించింది. క్రమశిక్షణ విషయంలో పార్టీ రాజీ పడేది లేదని స్పష్టం చేసింది. గడువులోపు సమాధానాలు లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని పేర్కొంది.

సంతృప్తికరమైన వివరణ ఇవ్వకుంటే ఎలాంటి నోటీసు లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆ లేఖలో ప్రస్తావించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ వ్యవహారం చుట్టూనే తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి.  మండలి లో బీఆర్ఎస్ పార్టీని అధికార పార్టీ సభ్యులు ఏకి పారేశారు.

ALSO READ: నేనే పెద్ద స్టార్.. అవకాశాలొద్దు, సినిమాలు తీస్తానన్న మల్లారెడ్డి

బీఆర్‌ఎస్‌ నాయకుడు డ్రగ్స్‌ సేవించి పట్టుబడితే దానిపై ఆ పార్టీ స్పందన ఏదని మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్‌ గౌడ్ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ నాయకులంతా డ్రగ్స్‌ టెస్ట్‌ చేసుకోవాలన్నారు.  తాము, మా నాయకుడు కూడా టెస్టుకు రెడీ అని అన్నారు.

డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తుంటే బీఆర్‌ఎస్‌ నేతలు డ్రగ్స్‌ను ప్రోత్సాహిస్తూ ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ స్టేట్‌గా మారుస్తున్నారని ఆరోపించారు. ఈగల్ టీంకు బీఆర్ఎస్ లీడర్లు పట్టుబడుతున్నారంటే బీఆర్ఎస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు మరో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. డ్రగ్స్ తీసుకునే వాళ్లకు అసలు పార్టీ టికెట్ ఇవ్వకూడదన్నారు.

 

 

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×