E-Paper
Advertisement

Gold Rate Dropped: మిడిల్ క్లాస్ ఊపిరి పీల్చుకో.. భారీగా తగ్గిన బంగారం, సిల్వర్ ధరలు

Gold Rate Dropped: మిడిల్ క్లాస్ ఊపిరి పీల్చుకో.. భారీగా తగ్గిన బంగారం, సిల్వర్ ధరలు
Advertisement

Gold Rate Dropped: పసిడి ప్రియులకు చల్లిని కబురు.. పెళ్లిళ్ల సీజన్ మొదలైందో లేదో, అప్పుడే పసిడి ధరలు ‘ఢమాల్’ అని కింద పడ్డయ్! గత వారం వరకు చుక్కల్లో ఉన్న ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నయ్. ఈ మధ్యే వచ్చిన కేంద్ర బడ్జెట్ ఎఫెక్టో లేక అమెరికాలో డాలర్ గట్టిగ కావడమో తెలవదు కానీ, బంగారం రేట్లు మాత్రం దారుణంగా తగ్గినయ్. ఇది చూసి ఆడ బిడ్డలంతా సంబరపడిపోతున్నారు..

నేడు బంగారం ధరలు ఇలా..
బంగారం ధరలు మళ్లీ నేడు భారీగా తగ్గాయి.. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,170 ఉండగా.. నేడు మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,750 వద్ద ఉంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,400 కాగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,100 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,420 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,51,750 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,100 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,750 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,100 వద్ద కొనసాగుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,750 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,100 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,900 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,39,250 వద్ద కొనసాగుతోంది.

Also Read: భారత్-యూఎస్‌ ట్రేడ్ డీల్.. స్టాక్‌మార్కెట్‌లో బుల్ జోరు, రుపీకి సానుకూలంగా

నేటి సిల్వర్ ధరలు ఇలా..
వావ్.. కేవలం బంగారం ధరలే కాకుండా సిల్వర్ ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి. ఒక్క రోజులోనే ధరలు కుప్పకూలడంతో.. ప్రజలు మళ్లీ ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్న సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,00,000 కాగా.. నేడు మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,80,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.20,000 తగ్గింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,80,000 వద్ద పలుకుతోంది. అయితే ఇంకా రేట్లు తగ్గే అవకాశం ఉందని కొందరంటుంటే, పెళ్లిళ్లు ఉన్నోళ్లు మాత్రం “మళ్ళీ ఎప్పుడు పెరుగుతదో ఏమో” అని జెల్ది జెల్ది దుకాణాల బాట పడుతున్నారు. మొత్తానికి బంగారం షాపుల్లో మాత్రం పసిడి ప్రియుల సందడి మాములుగా లేదు.

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×