E-Paper
Advertisement

Stock Market: భారత్-యూఎస్‌ ట్రేడ్ డీల్.. స్టాక్‌మార్కెట్‌లో బుల్ జోరు, రుపీకి సానుకూలంగా

Stock Market: భారత్-యూఎస్‌ ట్రేడ్ డీల్.. స్టాక్‌మార్కెట్‌లో బుల్ జోరు, రుపీకి సానుకూలంగా
Advertisement

Stock Market: భారత్-యూఎస్‌ ట్రేడ్ డీల్ ప్రభావం బాంబే స్టాక్ మార్కెట్‌పై పడింది. మంగళవారం ఉదయం స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభం అయ్యింది. ఉదయం 9.30 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్‌ 2,256 పాయింట్ల లాభంతో మార్కెట్ మొదలైంది. ప్రస్తుతం 83,935 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. అటు నిఫ్టీ కూడా 699 పాయింట్లు పెరిగింది. 25,787 వద్ద ట్రేడింగ్ సాగుతోంది.

స్టాక్‌మార్కెట్‌లో బుల్ జోరు 

Advertisement

అంతకుముందు ప్రీ ఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 3,600 పాయింట్ల వరకు పెరిగింది. నిఫ్టీ అయితే ఏకంగా 26,300 మార్క్‌ను దాటేసింది. మంగళవారం ట్రేడింగ్​ మొదటి 15 నిమిషాల్లో ఇన్వెస్టర్ల సంపద రూ. 13 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్​ఈ మార్కెట్​ క్యాపిటల్​ రూ. 468.32 లక్షల కోట్లకు చేరడంతో మదుపరుల్లో ఆనందం వెళ్లివెరిసింది.

ఇటీవల బడ్జెట్‌లో ఫ్యూచర్స్-ఆప్షన్స్ విభాగానికి సెక్యూరిటీ లావాదేవీల పన్ను పెంపుదల తర్వాత దాదాపు 2 శాతం కుప్పకూలింది. ఆ తర్వాత మార్కెట్‌లో ఈ పెరుగుదల కనిపించింది. కేంద్ర బడ్జెట్ తర్వాత పెట్టుబడిదారుల్లో భయం మొదలైంది. సోమవారం సూచీలు సగానికి పైగా నష్టాల నుంచి కోలుకున్నాయి. మంగళవారం ఉదయం పెరుగుదలతో బడ్జెట్ తర్వాత లాభాల్లోకి సూచీలు వెళ్లాయి.

Advertisement

స్టాక్ మార్కెట్‌పై  భారత్-యూఎస్‌ ట్రేడ్ డీల్ ప్రభావం

భారత్-అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంలో జాప్యం జరుగుతూ వచ్చింది. దీని ప్రభావం బాంబే స్టాక్ మార్కెట్‌పై పడింది. భారత ఎగుమతిదారుల పెరుగుతున్న ఖర్చుల నుండి రూపాయి ఒత్తిడికి గురైంది. బలహీనమైన కరెన్సీ, ఆదాయ వృద్ధి పెద్దగా కనిపించకపోవడంతో విదేశీ పెట్టుబడిదారులను కొంతకాలంగా ఈక్విటీలకు దూరంగా ఉన్నారు.

ట్రేడ్ డీల్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ సోమవారం రాత్రి ప్రకటన చేశారు. భారత్‌తో ట్రేడ్​ డీల్​ కుదిరినట్టు తెలిపారు. ఫలితంగా భారత్‌పై ఆ దేశం విధిస్తున్న 50 శాతం సుంకాలు ఇప్పుడు 18 శాతానికి తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. బీఎస్​ఈ సెన్సెక్స్​-30లో దాదాపు అన్ని స్టాక్స్​ లాభాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి. అదానీ పోర్ట్స్​, బజాజ్​ ఫినాన్స్, ఎటర్నల్, ఇన్ఫోసిస్, రిలయన్స్​ లాభాల్లో ట్రేడింగ్ జరుగుతోంది.

ALSO READ: ప్రయాణికులకు అలర్ట్.. మహిళలకు 40 గ్రా. పురుషులకు 20 గ్రామ్స్

ఇక నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, జియో ఫైనాన్షియల్, బజాజ్‌ ఫైనాన్స్‌, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు రూపాయి బాగానే కోలుకుంటోంది. డాలర్‌తో పోలిస్తే సోమవారం రూపాయి మారకం విలువ 91.49 వద్ద ముగిసింది. ప్రస్తుతం మంగళవారం 90.30గా కదులుతోంది.

గతేడాది ఆగస్టు నుండి భారత్‌పై అదనంగా 25 శాతం సుంకాన్ని విధించింది అమెరికా. ఆ తర్వాత 50 శాతానికి పెంచింది. దీంతో బాంబే స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల నుండి దాదాపు 12 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నారు. ఆ సమయంలో సెన్సెక్స్ 1 శాతం కంటే కొంచెం ఎక్కువ లాభపడింది. దీంతో ప్రస్తుతం FIIలు మార్కెట్‌కు తిరిగి రావడం ప్రారంభించాయి.

Related News

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

Big Stories

Advertisement
×