E-Paper
Advertisement

Gold Rate Today: తగ్గేదేలే.. భారీగా పెరుగుతున్న వెండి, పసిడి ధరలు.. తులం ఎంతంటే..

Gold Rate Today: తగ్గేదేలే.. భారీగా పెరుగుతున్న వెండి, పసిడి ధరలు.. తులం ఎంతంటే..
Advertisement

Gold Rate Today: ఇవాళ కొంచెం తగ్గినట్లే చేస్తాది. రేపు కొండంత పెరిగి కొసారు కొమ్మల్లో కూర్చుంటాది. అదేనండీ బంగారం ధర(Gold Rate).. తులం బంగారం కొద్ది రోజుల క్రితం 73, 74 వేల వరకూ ఉండేది. ఇప్పుడు ఏకంగా 80, 000 మార్క్‌ను దాటేసింది. బంగారం కొనడం ఏమో కానీ దాని ధర వింటేనే దడ పుడుతుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) 79, 630 ఉంటే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర 72, 990 వరకు ఉంది. తగ్గేటప్పుడు మాత్రం పది రూపాయలు, 20 రూపాయలు తగ్గుతుంది. పెరిగేటప్పుడు మాత్రం ఏకంగా వేలకు పెరుగుతుంది. సామాన్యులకు అందనంత ఎత్తులో దూసుకుపోతుంది బంగారం ధర.

ఇంట్లో ఏదైనా శుభకార్యాలయితే కూడా తులం పెట్టే కాడ పావళ మందంతోనే చేపిస్తూన్నారంటే బంగారం ఎంత రేటు పెరిగిందో చూడండి. ఇక పెళ్లిల్లు పెట్టుకున్న ఆడపిల్ల ఇంటోవాళ్ల గోస అయితే చెప్పనవసరం లేదు. కాబోయే అల్లుడికి ఎంత బంగారం ఒప్పుకున్నారో.. అదంతా లగ్గం పోలుమీదనే అప్పజెప్పాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సినంత పనైంది. పోనీ ఇంత రేటుంది అదేమన్న తినేదా, తాగేదా అంటే అది కాదు. కానీ అంతకన్న ఎక్కువే అని పెద్దోలు చెబుతున్న ముచ్చట. ఇక బంగారం ధర ఇలా ఉంటే.. వెండి కూడా అదే బాటలో నడుస్తుంది. కిలో వెండి ధర ఏకంగా రూ.1,10,100 వరకు పలుకుతుంది.

Advertisement

బంగారం ధరలు..

ఈరోజు ఢిల్లీలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. 24 క్యారట్ల తులం బంగారం ధర(Gold Rate) ఏకంగా రూ. 79, 780 వరకు పెరిగింది. ఇక 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) చూస్తే.. రూ.73, 140 ఉంది.

Advertisement

ముంబైలో నేటి పసిడి ధరలు చూస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ. 79, 630 ఉంది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 72, 990 వద్ద కొనసాగుతోంది.

బెంగుళూరులో నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ. 79, 630 ఉంది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ. 72, 990 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ. 79, 630 ఉంది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ. 72, 990 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దాం.

ఈరోజు బంగారం ధర హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ. 79, 630 వరకు పెరిగింది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ. 72, 990 వద్ద ట్రెండింగ్ లో ఉంది.

విజయవాడలో కూడా అదే రేటు కొనసాగుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ. 79, 630 వరకు పెరిగింది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ. 72, 990 వద్ద కొనసాగుతోంది.

వైజాగ్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ. 79, 630 వరకు పెరిగింది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ. 72, 990 ఉంది.

Also Read:  పండగ వేళ భారీ షాక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు

వెండి ధరలు పరిశీలిద్దాం..

ఢిల్లీలో వెండి ధరలు పరిశీలిస్తే.. కిలో వెండి ధర(silver rate) ఏకంగా రూ. 1,10, 100 వరకు ఉంది.

బెంగుళూరులో కిలో వెండి ధర(silver rate) 96,800 ఉంది. చెన్నై, ముంబైలో చూస్తే.. రూ. 1,02,100 వరకు ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర((silver rate) రూ. 1,02,100 వద్ద కొనసాగుతోంది.

 

 

 

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×