BigTV English

Brahmamudi Serial Today October 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్:  దుగ్గిరాల కుటుంబంలో చీలికలు – కావ్యను తిట్టి ఇంట్లోనే తేల్చుకుంటానన్న రాజ్‌

Brahmamudi Serial Today October 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్:  దుగ్గిరాల కుటుంబంలో చీలికలు – కావ్యను తిట్టి ఇంట్లోనే తేల్చుకుంటానన్న రాజ్‌

Brahmamudi serial today Episode:  తన అపాయింట్‌మెంట్‌ లెటర్‌ను రాజ్‌కు ఇస్తుంది కావ్య… తనను తాతయ్యే అపాయింట్‌ చేశారని చెప్తుంది. లెటర్‌ చదివిన రాజ్‌ గట్టిగా తాతయ్యా.. అని అరుస్తాడు. ఇక నుంచి మీరు నన్ను కలవాలంటే నా అపాయింట్‌ తీసుకుని రావాలి. అండర్‌స్టాండ్‌ అంటుంది కావ్య.. అప్పర్‌ స్టాండ్‌లో ఉండి అండర్‌స్టాండ్‌ అంటే సైకిల్‌ స్టాండ్‌ వేసినట్టు అలాగే ఉండిపోతాను అనుకున్నావా? ఇది ఇంతటితో అయిపోదు అంటాడు రాజ్‌. ఇంతలో ఇంటి నుంచి సీతారామయ్య  కావ్యకు  ఫోన్‌ చేస్తాడు.


ఇదిగోండి ఇదిగో తాతయ్యగారు ఫోన్‌ చేస్తున్నారు.. ఐ మీన్‌ ఛైర్మన్‌ గారు ఫోన్‌ చేస్తున్నారు. మాట్లాడతారా మేనేజర్‌గారు అంటూ కావ్య వెటకారంగా చెప్పగానే నీ ఫోన్‌ లో మాట్లాడే కర్మ నాకేం పట్టలేదు.. నేను ఇంటికి వెళ్లి తేల్చుకుంటాను అని చెప్తాడు రాజ్‌. ఫోన్‌ లో రాజ్‌ మాటలు వింటున్న సీతారామయ్యా ఏంటి వాగుతున్నాడు అని కావ్యను అడుగుతాడు. ఇంటికి వచ్చి తేల్చుకుంటారట  అని కావ్య చెప్తుంది.

రమ్మను గడ్డి పెట్టడానికి సిద్దంగా ఉన్నాము. ఇది నా ఆర్డర్‌.. నా ఆర్డర్‌ ను దిక్కరించే హక్కు ఎవరికీ లేదు అంటాడు సీతారామయ్యా.. దీంతో  ఈ గూడు పుఠాణీకి చైర్మన్‌ ఎవరు.? ఈ డెస్టినేషన్‌ డిజైన్‌ చేసిన పౌండర్‌ ఎవరు..? ఆ కాన్సర్‌ నాటకం ఆడిన కనకమేనా..? మా ఇంట్లో ఇవాళ కురుక్షేత్ర సంగ్రామం మొదలు కాబోతుందే.. అంటూ కోపంగా రాజ్‌ చెప్తాడు. ఇద్దరి మధ్య గొడవ జరగుతుంది. ఇంతలో శృతి పూల బొకే తీసుకుని వచ్చి రాజ్ కు ఇచ్చి కొత్త సీఈవో గారికి వెల్‌కం చెప్పండి సార్‌ అంటుంది. బొకే కింద పడేసి తొక్కి రాజ్ వెళ్లిపోతాడు.


ఇంటికి వెళ్లినర రాజ్‌ కోపంగా గట్టిగా తాతయ్యా అని పిలుస్తాడు. అపర్ణ ఏమైంది నాన్నా అని అడుగుతుంది. తాతయ్య ఎక్కడ మమ్మీ అని అడుగుతాడు రాజ్‌. ఇంతలో ఇందిరాదేవి వచ్చి ఏంట్రా అరుస్తున్నావు అని గద్దిస్తుంది. అరిచినట్టు ఉందా? ఆక్రోషించినట్టుగా ఉందా? అని ప్రశ్నిస్తాడు రాజ్‌. ఇంతలో ప్రకాష్‌ కలగజేసుకుని ఉక్రోషం అంటే తెలుసు.. ఆక్రోషం అంటే ఏ క్రోషంరా.. అని వెటకారంగా అడుగుతాడు. దీంతో రాజ్‌…  ఇప్పుడు నానా అర్థాలు అవసరమా..? బాబాయ్‌.. అంటాడు.

ఇంతలో సీతారామయ్య వచ్చి ఏంటి రాజ్‌ చెప్పు అంటాడు. దీంతో మీరు నన్ను అవమానించారు తాతయ్యా అంటూ ఆ కళావతిని సీఈవోను చేయడంలో మీ ఉద్దేశం ఏంటి తాతయ్యా.. అని అడుగుతాడు. అది కావ్యలోని కళకు జరిగిన సన్మానం…  అది నీకెలా అవమానం అవుతుందిరా.. అంటాడు. అసలు మా ఇద్దరి మధ్య ఎంత దూరం ఉందో మీకు తెలుసు కదా. అని రాజ్‌ అంటే మీ ఇద్దరి మధ్య దూరం ఉండొచ్చు. కానీ మా ఇద్దరి మధ్య బంధం ఉది. తాత మనవరాలు అనే వాత్సల్యం ఉంది. పోయిన కంపెనీ పరువు తీసుకురావాలనే ఆత్రుత ఉంది. కావ్య లేకుండా నువ్వు అవార్డు గెలవలేన్న అనుమానం ఉంది అందుకే కావ్యకు పట్టం కట్టాను అంటాడు సీతారామయ్య.

రాజ్‌ కోపంగా మీరు నన్ను అవమానించడానికే ఇలా చేశారు. అయినా మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి నన్ను అడగాల్సింది తాతయ్య అంటాడు రాజ్‌. నువ్వు నీ భార్యను ఇంట్లోంచి పంపించినప్పుడు మాకు ఒక్కమాటైనా చెప్పావా..? అసలు నువ్వు మీ అమ్మ మాట వింటున్నావా..? ఇంట్లో పెద్దవాళ్లను గౌరవిస్తున్నావా? అంటూ సీతారామయ్య, రాజ్‌పై రెచ్చిపోతాడు. ఇంతలో రుద్రాణి, ధాన్యలక్ష్మి ఇద్దరూ కలిసి సీతారామయ్య నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. రాజ్‌కు సపోర్టుగా మాట్లాడతారు. అయితే ఎవ్వరు ఏం మాట్లాడినా ఈ ఇంటి పెద్దగా  నేను తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు అంటూ వెళ్లిపోతాడు సీతారామయ్య.

రోడ్డు మీద ఆటో  నిలుపుకుని ఉన్న కళ్యాణ్‌ దగ్గరకు ఇద్దరు కాలేజీ విద్యార్థినులు వచ్చి కాలేజ్‌కు ఆటో తీసుకుని వెళ్తారు. ఆటోలో వెళ్తూ  కళ్యాన్‌ రాసిన సాంగ్‌ పెట్టుకుని వింటుంటారు. సాంగ్‌ చాలా బాగుందని ఫీలవుతుంటారు. వాళ్ల మాటలు విన్న కళ్యాణ్‌ గర్వంగా ఫీలవుతాడు. తన పాట జనానికి బాగా నచ్చిందన్న ఆనందంతో లక్ష్మీకాంత్‌ గారిని కలిసి అసిస్టెంట్‌ గా తీసుకోమని అడగాలి అనుకుంటాడు.

స్వరాజ్‌ ఆఫీసులోని ఉద్యోగికి ఫోన్‌ చేసి అనామిక ఎప్పటిలాగే ఇప్పుడు కూడా అక్కడి రహస్యాలు మాకు చెప్పాలని అడుగుతుంది. ఆ ఉద్యోగి ఇంతమకు ముందు రాజ్‌ సార్ మమ్మల్ని నమ్మాడు కాబట్టి చేయగలిగాను. కానీ ఇప్పుడు కావ్య మేడం చాలా స్టిక్టుగా ఉందని కొంచెం కష్టమే అని మాట్లాడుతుంటే కావ్య వింటుంది. ఫోన్‌ లాక్కుని అనామికకు వార్నింగ్‌ ఇస్తుంది. ఆ ఎంప్లాయిని సెక్షన్‌ మేనేజర్‌ నుంచి సెక్యూరిటీ గార్డుగా డీమోట్‌ చేస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big Stories

×