E-Paper
Advertisement

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
Advertisement

Hyderabad Gold Rate Today:  బంగారం కొనాలనుకునే వారికి నేడు ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు, డాలర్ హెచ్చుతగ్గుల ప్రభావంతో ఈరోజు భాగ్యనగరంలో పసిడి ధరలు నిన్నటితో పోలిస్తే.. స్వల్పంగా తగ్గాయి. నేడు హైదరాబాద్ మార్కెట్లో 18 క్యారెట్లు, 22 క్యారెట్లు , 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయి? నిన్నటి కంటే ఎంత తగ్గాయి? అలాగే వెండి ధరల పరిస్థితి ఏంటి?ఇప్పుడు తెలుసుకుందాం.

నిన్నటి (మే 26) ధరలతో పోలిస్తే ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు స్వల్ప తగ్గుముఖం పట్టాయి. పెట్టుబడిదారులు, సామాన్య కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశంగా నిపుణులు భావిస్తున్నారు. ఖచ్చితమైన గణాంకాల ప్రకారం.. నిన్నటితో పోలిస్తే ఈరోజు హైదరాబాద్‌లో బంగారం ధరలు తగ్గాయి. నగలు తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల తులం (10 గ్రాములు) బంగారం ధర రూ. 460 తగ్గి ప్రస్తుతం రూ.1,45,640 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్న దీని ధర రూ.1,46,100 గా నమోదైంది.

Advertisement

అలాగే పెట్టుబడి రూపంలో కొనుగోలు చేసే అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంపై తులం బంగారానికి రూ. 500 మేర క్షీణత కనిపించి, నేడు రూ.1,58,880 కి చేరుకుంది. నిన్న దీని ధర రూ.1,59,380 గా ఉండేది. మరోవైపు డైమండ్ జ్యువెలరీ కోసం వాడే 18 క్యారెట్ల పసిడిపై కూడా రూ.380 మేర తగ్గి నేడు రూ.1,19,160 వద్ద కొనసాగుతోంది. అయితే ఈ ధరలకు స్థానిక జీఎస్టీ (3 శాతం), మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయని గమనించాలి.

బంగారంతో పాటే వెండి కొనుగోలుదారులకు కూడా నేడు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయంగా పారిశ్రామిక డిమాండ్ నెమ్మదించడంతో వెండి ధరలు కూడా దిగివచ్చాయి. హైదరాబాద్‌లో నేడు 1 కిలో వెండి ధర సుమారు రూ.2,84,900 నుండి రూ. 2,90,900 మధ్య ట్రేడ్ అవుతోంది. నిన్నటితో పోలిస్తే.. కేజీ వెండిపై దాదాపు రూ.500 నుంచి రూ. 1000 వరకు తగ్గుదల కనిపించింది. స్థానిక జ్యువెలరీ మార్కెట్లను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై వస్తున్న అంచనాల కారణంగా అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధరలు ఒత్తిడికి లోనయ్యాయి. మన దేశంలో దిగుమతి సుంకాలు , అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల కదలికలు కూడా స్థానిక ధరలను ప్రభావితం చేశాయి.

Related News

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

కస్టమర్లకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, మార్కెట్లో ఇప్పుడు ఎంతంటే..

ఇంజినీరింగ్‌లో 11 బ్యాక్‌లాగ్స్.. కట్ చేస్తే రూ.50 లక్షల ప్యాకేజీ జాబ్.. సక్సెస్ స్టోరీ

హైదరాబాద్ నుంచి Zomato అవుట్? 250 మంది ఉద్యోగుల తొలగింపు?

డబ్బు సంపాదించడానికి డిగ్రీలు అవసరం లేదు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కంటే ఈ కెరీర్లు బెటర్

బంగారం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

Advertisement
×