E-Paper
Advertisement

ఒరేయ్ వైభ‌వ్…నీకు ఆంధ్ర పూతరేకులు తినిపిస్తా, డ‌కౌట్ అయిపో..యాంక‌ర్ రిక్వెస్ట్

ఒరేయ్ వైభ‌వ్…నీకు ఆంధ్ర పూతరేకులు తినిపిస్తా, డ‌కౌట్ అయిపో..యాంక‌ర్ రిక్వెస్ట్
Advertisement

SRH VS RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (Sunrisers Hyderabad vs Rajasthan Royals, Eliminator) జట్లు తలపడతాయి. న్యూ చండీగఢ్ (Mullanpur, New Chandigarh) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు షురూ అవుతుంది. ఈ మేరకు రెండు జట్లు కూడా ఎలిమినేటర్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాయి. ఇలాంటి క్రమంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్య వంశీ (vaibhav suryavanshi) ఆట తీరుపై అందరి దృష్టిపడింది. అతడు కాస్త క్లిక్ అయితే, ఆపడం కష్టమే. దాని ఎఫెక్ట్ హైదరాబాద్ పైన పడుతుంది. వైభవ్ రెచ్చిపోతే మాత్రం హైదరాబాద్ ఓడిపోయి ఇంటికి వెళ్లడం గ్యారెంటీ అంటున్నారు క్రీడా విశ్లేషకులు.

Also Read: Vaibhav-Parag: వైభ‌వ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బ‌య‌ట‌పెట్టిన‌ రియాన్ ప‌రాగ్, ఇదిగో షాకింగ్ వీడియో 

ఒరేయ్ వైభ‌వ్…నీకు ఆంధ్ర పూతరేకులు తినిపిస్తా, డ‌కౌట్ అయిపో

Advertisement

ఎలిమినేటర్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ చాలా భయంకరంగా ఆడతాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలుగు స్పోర్ట్స్ యాంకర్ వింధ్య విశాఖ మేడపాటి సంచలన వీడియో పెట్టారు. వైభవ్ సూర్య వంశీ డకౌట్ అయితే… ఆంధ్ర పూతరేకులు (Pootharekulu) తినిపిస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించారు వింధ్య విశాఖ మేడపాటి ( vindhya vishaka). ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఉప్పల్ స్టేడియం వేదికగా లీగ్ దశలో ఆడినప్పుడు వైభవ్ సూర్యవంశీకి చాక్లెట్, ఐస్ క్రీమ్ ఆఫర్ చేశాను.. అప్పుడు డకౌట్ అయ్యాడని గుర్తు చేశారు. కానీ రాజస్థాన్ వేదికగా జరిగిన మరో మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీకి ఎలాంటి ఆఫర్ చేయలేదని.. దాంతో సెంచరీ కొట్టినట్లు ఆమె వెల్లడించారు. ఇక ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా డకౌట్ అయితే మాత్రం, ఆంధ్ర పూతరేకులు తినిపిస్తానని వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. తన మాట విని తొందరగా ఔట్ అవ్వు వైభవ్ అంటూ బతిలాడారు. దీంతో స్పోర్ట్స్ యాంకర్ వింధ్య విశాఖ మేడపాటి వీడియో వైరల్ గా మారింది.

హైదరాబాద్ పై వైభవ్ కు మంచి రికార్డులు

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై వైభవ్ సూర్య వంశీకి విభిన్న రికార్డులు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీన హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో SRH మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు వైభవ్. అదే జైపూర్ లో ఏప్రిల్ 25వ తేదీన మ్యాచ్ జరిగితే.. హైదరాబాద్ పై సెంచరీ నమోదు చేశాడు వైభవ్. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ చేయడం గమనార్హం. ఇందులో 12 సిక్సర్స్ అలాగే ఐదు ఫోర్లు ఉన్నాయి. అంటే వైభవ్ సూర్య వంశీ ఇవాళ ఓడిస్తేనే మనోళ్లు గెలుస్తారన్నమాట.

Advertisement

Also Read:  Abdul Razzaq: PSL అల్లా కంటే ప‌విత్ర‌మైన‌ది..ఐపీఎల్ అతిపెద్ద‌ ఫిక్సింగ్ హబ్ Abdul Razzaq: PSL

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×