E-Paper
Advertisement

Gold Price Hike Today: భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. తులం బంగారం ధర తెలిస్తే గుండె గుభేల్!

Gold Price Hike Today: భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. తులం బంగారం ధర తెలిస్తే గుండె గుభేల్!
Advertisement

Gold Price Hike Today: వామ్మో.. బంగారం ధరలు చూస్తుంటే గుండె గుభేల్ మంటోంది! ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు తులం బంగారం లక్ష రూపాయలు దాటుతుందా అని అనుమానపడిన వారందరికీ షాక్ ఇస్తూ, ధరలు ఏకంగా లక్ష నలభై వేలు దాటింది. రేట్లు తగ్గుతాయేమోనని వేచి చూస్తున్న సామాన్యులకు, ప్రతిరోజూ పెరుగుతున్న ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర సామాన్యుడి నెల జీతం కంటే ఎక్కువగా ఉండటంతో, ఇకపై బంగారం కొనడం అనేది ఒక కలగానే మిగిలిపోతుందా అనే భయం పసిడి ప్రియుల్లో వ్యక్తమవుతోంది.

నేడు పసిడి ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,250 కాగా.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,020 వద్ద ఉంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,650 ఉండగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,350 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.770 పెరిగింది.

Advertisement

అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం, ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకోవడం వంటి కారణాలు వల్ల ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఇంట్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు పెట్టుకున్న వారు ఈ ధరల పెరుగుదల చూసి బెంబేలెత్తిపోతున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం 2026 నాటికి ధరలు మరింత పెరిగి రూ.1.5 లక్షల నుండి రూ. 1.75 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉందని వస్తున్న వార్తలు సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ధరలు ఇలాగే ఉంటే భవిష్యత్తులో సామాన్యులు బంగారం షాపు గడప తొక్కడమే కష్టమని, పసిడి మంటతో మధ్యతరగతి కలలు కాలిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,40,020 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,350 వద్ద పలుకుతోంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,020 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,28,350 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,020 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,28,350 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,170 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,28,500 వద్ద కొనసాగుతోంది.

నేటి సిల్వర్ ధరలు ఇలా..
దేవుడా.. ఏంట్రా బాబు సిల్వర్ ధరలు ఇలా మండిపోతున్నాయి. ఒక్క రోజే ఇంతా దారుణంగా ధరలు పెరిగితే ఇక సామాన్య ప్రజలు సిల్వర్ కొనడం కూడా మానేస్తారు. నిన్న గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 2,45,000 ఉండగా.. నేడు శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,54,000 వద్ద కొనసాగుతోంది. నేడు కేజీ సిల్వర్ ధరపై రూ.9,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,40,000 వద్ద పలుకుతోంది.

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×