E-Paper
Advertisement

Anasuya Bhardwaj: మీలోనూ అందమైన వ్యక్తి ఉన్నారు.. మరో పోస్ట్ వేసిన అనసూయ!

Anasuya Bhardwaj: మీలోనూ అందమైన వ్యక్తి ఉన్నారు.. మరో పోస్ట్ వేసిన అనసూయ!
Advertisement

Anasuya Bhardwaj: అనసూయ గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. అనసూయ ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటం లేకుండా తన ఆలోచన విధానాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తుంటారు .అలాగే మహిళలను ఎవరైనా కించపరుస్తూ మాట్లాడితే ఈమె వెంటనే స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేయడమే కాకుండా ఇతరులకు తనదైన శైలిలోనే కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నటుడు శివాజీ(Sivaji) ఇటీవల హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడిన తీరుపై అనసూయ(Anasuya) ఘాటుగా స్పందిస్తూ వరుస పోస్టులు వేస్తూ కౌంటర్ ఇస్తున్నారు. ఇలా గత మూడు రోజులుగా శివాజీ వర్సెస్ అనసూయ అనే విధంగా సోషల్ మీడియాలో కోల్డ్ వార్ జరుగుతుంది.

మహిళా సాధికారత ..

అనసూయ పోస్టుల పట్ల శివాజీ మౌనం వహించినప్పటికీ అనసూయ మాత్రం అసలు తగ్గకుండా వరుస పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ సుదీర్ఘమైన పోస్ట్ వేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహిళా సాధికారత(Women Empowerment) గురించి మహిళల వస్త్రధారణ గురించి అనసూయ స్పందిస్తూ.. మహిళల జీవితంలో వారికి నచ్చిన గమ్యాన్ని చేరుకునే వరకు ఆమె సామర్థ్యాన్ని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించకుండా, తనని గౌరవించబడే తోడు అవసరమని తెలిపారు.

సాధికారత అంటే గౌరవించడం…

Advertisement

మహిళల విషయంలో పురుషులు తమ సౌకర్యానికి అనుగుణంగా స్త్రీలను తమకు తాము కుచించుకుపోయేలా ప్రోత్సహించడం మద్దతు కాదని, సాధికారత అంటే మహిళలను ఎల్లప్పుడూ గౌరవించడమని తెలిపారు. ఇలాంటి విషయాలను పదేపదే గుర్తు చేసుకోవటం ఎంతో అవసరం మీలోను ఎంతో అందమైన వ్యక్తి దాగి ఉన్నాడు అంటూ ఈ సందర్భంగా అనసూయ మహిళ సాధికారత గురించి సుదీర్ఘమైన పోస్ట్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

ఇలా అనసూయ చేసిన ఈ పోస్టుపై అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టుతో పాటు అనసూయ నిండుగా చీర కట్టుకొని ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో శివాజీ అన్న ఎఫెక్ట్ అంటూ ఈమె డ్రెస్సింగ్ స్టైల్ పై కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అనసూయ నిత్యం ఇలాంటి వివాదాల ద్వారా తరచూ వార్తలలో నిలుస్తూ ఉన్నారు. గతంలో కూడా అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఎన్నో విమర్శలు వచ్చిన ఈమె మాత్రం అసలు తగ్గకుండా తనకు నచ్చినట్టుగానే తాను బ్రతుకుతానని తనదైన శైలిలోనే విమర్శించే వారికి కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఇలా అనసూయ నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను తెలియజేయడంతోనే ఇలాంటి వివాదాలను ఎదుర్కొంటున్నారని చెప్పాలి.

Also Read: Actress Namitha: రీ ఎంట్రీకి సిద్ధమైన ప్రభాస్ బ్యూటీ.. ఆ తప్పు అస్సలు చేయనంటూ!

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×