E-Paper
Advertisement

World’s largest Car: ప్రపంచంలో అతిపెద్ద, అతిచిన్న కార్లు ఇవే.. చూడ్డానికి భలే ఉన్నాయే!

World’s largest Car: ప్రపంచంలో అతిపెద్ద, అతిచిన్న కార్లు ఇవే.. చూడ్డానికి భలే ఉన్నాయే!
Advertisement

World’s Largest – Smallest Cars:  ప్రపంచంలో ఎన్నో వింతైన కార్లు ఉన్నాయి. వాటిలో రెండు కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద కారు. మరొకటి అతిచిన్న కారు.  సాధారణంగా, ప్రొడక్షన్ కార్లు అంటే సీరియల్‌గా తయారైనవి, కస్టమ్/స్పెషల్ బిల్ట్ ప్రత్యేకంగా తయారు చేసినవి వేరు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే కార్లు ఎలాంటి ప్రత్యేకతను సంతరించుకున్నాయో చూద్దాం..

⦿ ప్రపంచంలోనే అతిచిన్న కారు: Peel P50

ప్రపంచంలోనే అతి చిన్న కారుగా Peel P50 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఇది సీరియల్ ప్రొడక్షన్‌ లోకి వచ్చిన అతిచిన్న కారుగా గుర్తింపు పొందింది. దీనిని 1962-1965 మధ్య Peel Engineering Company తయారు చేసింది. మళ్లీ 2010 నుండి రీ ప్రొడక్షన్‌ లో ఉంది. ఈ చిన్నకారు పొడవు 137 సెం.మీ (54 అంగుళాలు) ఉంది. వెడల్పు 99 సెం.మీ (39 అంగుళాలు) ఉంది. బరువు కేవలం 59 కేజీలు ఉంది.

Peel P50 ప్రత్యేకతలు

Advertisement

ఇందులో ఒకే సీటు ఉంటుంది. ఒకే వ్యక్తి ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఒక బ్యాగ్ కూడా పెట్టుకుని వెళ్లవచ్చు. ఇంజిన్ విషయానికి వస్తే, 49cc సింగిల్ సిలిండర్ (4.2 హార్స్‌ పవర్), టాప్ స్పీడ్ 60 కి.మీ/గం వరకు ఉంటుంది. ఈ కారు ప్రత్యకతల విషయానికి వస్తే, రివర్స్ గేర్ లేదు. కారును చేత్తో లాగి తిప్పాలి. మూడు చక్రాలు, ఒక డోర్, ఒక హెడ్‌లైట్ ను కలిగి ఉంటుంది. ఫ్యూయల్ ఎఫిషియెన్సీ 100 mpg ఉంటుంది. ఇందులో సుమారు 2.8 లీటర్లు పోయిస్తే, 100 కి.మీ వరకు వెళ్లే అవకాశం ఉంటుంది.  మొత్తం 50 కార్లు తయారయ్యాయి. ఇప్పుడు 27 మాత్రమే మిగిలి ఉన్నాయి.

⦿ ప్రపంచంలోనే అతిపెద్ద కారు: The American Dream

Advertisement

ప్రపంచంలోనే అతి పొడవైన కారుగా The American Dream (కస్టమ్ లిమోజిన్) గుర్తింపు తెచ్చుకుంది. దీని పొడవు ఏకంగా 30.54 మీటర్లు అంటే సుమారు 100 అడుగులు ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కారుగా గిన్నిస్ రికార్డు సాధించింది. 1986లో Jay Ohrberg తయారు చేశాడు. 2022లో రీస్టోర్ చేశారు.

Read Also: బెస్ట్ జపనీస్ క్లాసిక్ కార్లు.. ఆ దేశంలో వీటికి ఫుల్ క్రేజ్ భయ్యా!

The American Dream ప్రత్యేకతలు

ఈ కారు మొత్తం 26 చక్రాలను కలిగి ఉంటుంది. కారులో స్విమ్మింగ్ పూల్, జకూజీ, హెలిప్యాడ్, మినీ గాల్ఫ్ కోర్స్ లాంటి ఫీచర్లు ఉంటాయి. మధ్యలో హింజ్ ఉంటుంది. ఇది మలుపు తిరగడానికి ఉపయోగపడుతుంది. రెండు V8 ఇంజన్లు, ముందు ఒకటి, వెనుక ఒకటి ఉంటుంది. ఒకేసారి 75 మంది వరకు కూర్చునే అవకాశం ఉంటుంది. ఈ కారు చుట్టు నడవడానికి ఏకంగా ఒక నిమిషం పాటు సమయం పడుతుంది. ప్రస్తుతం ఈ కారు ఫ్లోరిడాలోని ఓర్లాండో ఆటో మ్యూజియంలో ఉంది.

Read Also:  బెస్ట్ జపనీస్ క్లాసిక్ కార్లు.. ఆ దేశంలో వీటికి ఫుల్ క్రేజ్ భయ్యా!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×