E-Paper
Advertisement

Gold Rates: పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి పరుగు.. కొనేవారికి చుక్కలు, అమ్మేవారికి పండగ

Gold Rates: పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి పరుగు.. కొనేవారికి చుక్కలు, అమ్మేవారికి పండగ
Advertisement

Gold Rates: వామ్మో.. మళ్ళీ ఊపందుకున్న పసిడి ధరలు.. గత కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గుతూ సామాన్యులకు ఊరటనిచ్చిన బంగారం ధరలు, ఒక్కసారిగా మళ్ళీ ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే అమెరికా డాలర్ విలువలో వస్తున్న మార్పులు, గ్లోబల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 4,430 డాలర్ల మార్కును దాటడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అంతేకాకుండా పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ పెరగడం, మరోవైపు అంతర్జాతీయ సరఫరాలో ఆటంకాలు ఏర్పడటం ధరలు తగ్గకుండా చేస్తున్నాయి. ఒకానొక దశలో ధరలు దిగి వస్తాయని ఆశించిన సామాన్యులకు, ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే బంగారం ధరలు మరికొంత కాలం అందనంత ఎత్తులోనే ఉండేలా కనిపిస్తున్నాయి. కొనుగోలు చేసేవారు ప్రస్తుత మార్కెట్ ఒడిదుడుకులను గమనించి, స్థానిక జ్యువెలరీ షాపుల్లో ధరలను సరిచూసుకోవడం ఉత్తమం.

Advertisement

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,580 కాగా.. నేడు శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,090 వద్ద ఉంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,450 ఉండగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,750 వద్ద ఉంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.2,510 పెరిగింది.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,48,090 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,750 వద్ద కొనసాగుతుంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,090 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,750 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,090 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,750 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,220 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,35,900 వద్ద ఉంది.

Also Read: సరికొత్త కార్మిక చట్టం.. ఉద్యోగం మారినా, తీసేసినా.. 48 గంటల్లో ఫుల్ పేమెంట్!

నేటి సిల్వర్ ధరలు..
షాకింగ్.. సిల్వర్ ధరలు నిన్న తగ్గినట్టే తగ్గి.. నేడు మళ్లీ భారీగా పెరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కారణంగా ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయో.. ఎప్పుడు తగ్గుతున్నాయో.. తెలియడం లేదు. నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,45,000 వద్ద ఉండగా.. నేడు శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 2,50,000 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ. 5,000 పెరిగింది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ పై రూ.5,000 పెరిగి.. 2,45,000 వద్ద కొనసాగుతుంది.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×