E-Paper
Advertisement

New Labour Laws 2026: సరికొత్త కార్మిక చట్టం.. ఉద్యోగం మారినా, తీసేసినా.. 48 గంటల్లో ఫుల్ పేమెంట్!

New Labour Laws 2026: సరికొత్త కార్మిక చట్టం.. ఉద్యోగం మారినా, తీసేసినా.. 48 గంటల్లో ఫుల్ పేమెంట్!
Advertisement

New Labour Laws 2026: ఉద్యోగులు, కార్మికులకు భారీ ఊరటనిచ్చే సరికొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టంలో చేర్చింది. ఈ లేబర్ కోడ్స్ (Labour Codes) ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం ఏ ఉద్యోగి అయినా రాజీనామా చేసినా లేదా తొలగింపునకు గురైనా వారి పూర్తి వేతన సెటిల్‌మెంట్ (Full and Final Settlement) కేవలం 2 పని దినాలలో (2 Working Days) కంపెనీలు పూర్తి చేయాల్సి ఉంటుంది.

48 గంటల్లోనే పేమెంట్

‘కోడ్ ఆన్ వేజెస్ – 2019’ (Code on Wages, 2019) నిబంధన ప్రకారం.. ఉద్యోగి సంస్థను వీడినప్పుడు (రాజీనామా, తొలగింపు లేదా రిట్రెంచ్‌మెంట్ ఏదైనా సరే) యాజమాన్యం వారి బకాయిలను 2 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే గతంలో దీనికి 30 నుండి 45 రోజుల సమయాన్ని కంపెనీలు తీసుకోనగా.. ఏప్రిల్ 1 నుంచి మాత్రం తప్పనిసరిగా 48 గంటల నిబంధనను పాటించాల్సి ఉంటుంది.

ఉద్యోగులకు కలిగే ప్రయోజనం

Advertisement

సాధారణంగా కంపెనీకి రాజీనామా చేసిన, జాబ్ నుంచి తీసేసిన వ్యక్తులకు యాజమాన్యాలు సరైన సమయానికి పేమెంట్స్ చెల్లించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో చాలా మంది ఉద్యోగులు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కార్మిక శాఖ దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు.. ఈ బాధల నుంచి ఉద్యోగులకు ఉపశమనం కలిగించనున్నాయి. ఉద్యోగి తన చివరి నెలలో పనిచేసిన రోజులకు రావాల్సిన జీతం, మిగిలి ఉన్న సెలవులకు బదులుగా వచ్చే నగదు (Leave Encashment), రావాల్సిన బోనస్ లేదా ఇతర అలవెన్సులను పొందేందుకు ఈ కొత్త రూల్స్ దోహదం చేయనున్నాయి.

Also Read: Gas Free Kitchen: గ్యాస్ లేకుండా వంట చేయడం ఎలా? ఇదేమి కష్టం కాదండోయ్.. చాలా ఈజీగా చేసేయోచ్చు!

కంపెనీలపై ప్రభావం

Advertisement

ఈ కొత్త నిబంధన వల్ల కంపెనీలు తమ హెచ్ఆర్ (HR), పేరోల్ వ్యవస్థలను మరింత వేగవంతం చేయాల్సి ఉంటుంది. ఉద్యోగి చివరి పని దినం నాటికే నో డ్యూస్ (No-dues) సర్టిఫికేట్ వంటి ప్రక్రియలన్నీ ముందే సిద్ధం చేసుకోవాలి. మరోవైపు ఉద్యోగి పేమెంట్ కు సంబంధించిన క్లియరెన్స్ ను సైతం కంపెనీలోని వివిధ విభాగాలు.. ఎలాంటి జాప్యం చేయకుండా త్వరగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే 48 గంటల వ్యవధిని మాత్రమే ఇవ్వడం వల్ల ఇది తమపై తీవ్ర ఒత్తిడిని పెంచవచ్చని కంపెనీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: AI Robot Soldier: తుపాకీ 100 శాతం గురిపెట్టే రోబో లాంచ్.. యుద్ధంలో శత్రు సైన్యానికి వేటాడే వార్ మెషీన్

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×