మిడిల్ ఈస్ట్ లో యుద్ధం కారణంగా పెట్రోల్ కొరత తప్పదనే వార్తల నేపథ్యంలో ప్రజలు బంకుల దగ్గర క్యూ కడుతున్నారు. ఫ్యూయెల్ దేశ అవసరాలకు సరిపడ ఉందని కేంద్రం చెప్తున్నప్పటికీ, పెట్రోల్ కొరత తప్పదని ఫేక్ ప్రచారాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు బంకుల ముందు క్యూ కడుతున్నారు. కొంత మంది క్యాన్లు, బాటిళ్లు తీసుకొని వస్తున్న నేపథ్యంలో బంకుల యాజమాన్యాలు కేవలం వాహనాల్లోనే పెట్రోల్ పొస్తామని తెగేసి చెప్తున్నారు.
వాహనాల్లోనే పెట్రోల్ పోస్తామని బంకు యజమానులు చెప్పడంతో, కొంత మంది వాహనదారులు క్రేజీ ఆలోచన చేస్తున్నారు. ఏకంగా ఓ యువకుడు బైక్ పెట్రోల్ ట్యాంక్ ను విప్పుకొని బంక్ కు దగ్గరికి తీసుకొచ్చాడు. దాని నిండా పెట్రోల్ కొట్టించుకుని తీసుకెళ్లాడు. బైక్ తో వచ్చి గంటల తరబడి నిలబడ్డం కంటే.. పెట్రోల్ ట్యాంక్ ను తీసుకొని రావడం వల్ల బైక్ పెట్రోల్ ఖర్చు తప్పిందని సదరు యువకుడు సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పెట్రోల్ కొరత వేళ.. పెట్రోల్ బంకుల్లో ఎన్నో సిత్రాలు
తన వాహనాన్ని తీసుకొచ్చే ఓపిక లేక.. కేవలం బైక్ ట్యాంక్ ఎత్తుకొచ్చిన ఓ వ్యక్తి
బండి తీసుకొచ్చి, గంటల తరబడి క్యూ లైన్లో నిల్చునే ఓపిక లేకే ఈ పని చేసిన వ్యక్తి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో pic.twitter.com/1q3dDQSZna
— PulseNewsBreaking (@pulsenewsbreak) March 27, 2026
అటు ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. ‘ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అటు ఇండియాలో ఏదైనా సాధ్యమే అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఇండియన్ ఆలోచనలు మరే దేశంలోనూ రావని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు. పెట్రోల్ కొట్టించుకోవడానికి బైక్ తీసుకుని రావడం వల్ల పెట్రోల్ వేస్ట్ చేయడం ఇష్టం లేక ఈ పని చేసి ఉండొచ్చు, అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరోవైపు ఓ వ్యక్తి ఏకంగా సైకిల్ కు బైక్ పెట్రోల్ ట్యాంక్ తగిలించుకుని వచ్చాడు. లైన్ లో నిలబడి పెట్రోల్ కొట్టించుకుని వెళ్లాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మొత్తంగా ఇరాన్ యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారత్ లో పెట్రోల్ బంకుల దగ్గర చిత్ర విచిత్రమైన ఘటనలు దర్శనం ఇస్తున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు వీటిని చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
Read Also: వందే భారత్ ఫుడ్ బాగాలేదా? రైల్వే అధికారులకు ఎలా కంప్లైంట్ చేయాలంటే?