Gold Price Today: శుభకార్యాల వేళ బంగారు కోనుగోలుదారులకు బిగ్ రిలీఫ్. బంగారం-వెండి ధరలు కిందకు దిగొస్తున్నాయి. దేశీయ మార్కెట్లో ఈ వారం రెండో రోజు బంగారం-వెండి ధరలు భారీగా పడిపోయాయి. గడిచిన రెండు రోజుల్లో తులం బంగారంపై రూ.2,500 వరకు తగ్గింది. కొద్దిరోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నాయి బులియన్ మార్కెట్ వర్గాలు.
అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేటులో కోత ఉంటుందన్న అంచనాలు, ఇంకోవైపు డాలర్ పుంజుకోవడం వంటి పరిణామాలు బంగారానికి డిమాండ్ తగ్గింది. దీంతో మదుపరులు అమ్మకాలకు పాల్పడడంతో భారీగా ధరలు దిగుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు దిగొస్తున్నాయి. మంగళవారం స్వల్పంగా పసిడి ధరలు పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుకు 8 డాలరల్ వరకు పెరిగి 4433 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.07 శాతం పెరిగి66.87 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సెప్టెంబర్ 8 ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ మార్కెట్‌లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,54,140 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,290 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. ఇక కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద ఉంది. విజయవాడ మార్కెట్లో కూడా ధరలు ఈ విధంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటల తర్వాత మార్కెట్లో ధరలు అటుఇటుగా ఉంటుంది. ధరలు తగ్గడం వినియోగదారుల్లో ఆనందం మిన్నంటింది.
ALSO READ: ఇండియాలో వారసత్వ ఆస్తుల బదిలీ అంత ఈజీ కాదు.. అన్నీ సవ్యంగా ఉన్నా లంచాలు ఇవ్వాల్సిందే
మెట్రోనగరాల్లో ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములు ధర రూ. రూ.1,54,290 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. ఇక ముంబై, బెంగుళూరు, చెన్నై, కోల్‌కత్తా, కేరళ, వడోరదాలో హైదరాబాద్ ధరలు కంటిన్యూ అవుతున్నాయి. అటు వెండి ధరల విషయంలో కాస్త హెచ్చతగ్గులున్నాయి.