Podarillu Serial : బుల్లితెర ప్రముఖ ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని ఆకట్టుకుంటున్నాయి..ఈ మధ్యకాలంలో ప్రారంభమైన సీరియల్స్ సైతం ప్రేక్షకులను ఎక్కువగా అలరించడంతో ఈ సీరియల్ ఈరోజు డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఇటీవల కాలంలో ఈ సీరియల్ నుంచి కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇస్తున్న కూడా సీరియల్ స్టోరీ లో ఏదో తెలియని అసంతృప్తి ఉందని జనాలు అభిప్రాయపడుతున్నారు ఒకప్పుడు ట్విస్టులతో అందరినీ ఆకట్టుకున్న ఈ సీరియల్ ఇప్పుడు మాత్రం కాస్త డల్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి కొత్త కేర్తెలని దించిన కూడా అవి కూడా పెద్దగా ఆకట్టుకోలేదని టాక్ అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈమధ్య డాక్టర్ బాబు భార్య మంజుల కూడా సీరియల్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆసక్తిగా మారుతుంది అని అందరూ అనుకున్నారు కానీ స్టోరీ కాస్త వీక్ గా ఉంది అంటూ జనాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సీరియల్ నుంచి ఇప్పుడు ఒక క్యారక్టర్ అవుట్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ క్యారక్టర్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం..
పొదరిల్లు సీరియల్ స్టార్ మాలో సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. గత ఏడాది డిసెంబర్ లో ప్రారంభం అయిన ఈ సీరియల్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చక్రీ, మహా పెళ్లి తర్వాత ఈ సీరియల్ లో అనేక ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయి.. మహాలక్ష్మి ఇష్టం లేకపోయినా కూడా చక్రిని పెళ్లి చేసుకుంటుంది.. ఇందులో చక్రీ అన్నయ్య మాధవ్ కు మహాలక్ష్మీ బాగా దగ్గరవుతుంది. ఆ తర్వాత అతనికోసం ఏదైన చేసేలా ఉంటుంది. అయితే కేశవ పెళ్లి కోసం మాధవ్ పెళ్లి చేసుకుంటున్న విషయం తెలియక అతని సంతోషం కోసం మహా ఏదైన చేస్తుంది. అలాంటిది జయంతితో పెళ్లి జరిగిన తర్వాత మాధవ్ ను బృందావనంకు దూరం చేస్తానని మహా అంటుంది. అలా మాధవ్ క్యారక్టర్ ఇకమీదట కనిపించడని అర్థమవుతుంది. ఆమెను పెళ్లి చేసుకోకుండా ఉంటే మాత్రం అన్నదమ్ములతో కలిసి ఉంటాడు.. జయంతితో పెళ్లికి మాధవ్ సిద్దపడిన సరే.. చివరి నిమిషంలో ఆమె గురించి తెలిసిపోయి పెళ్లి క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి..
చక్రీ మహా ఇద్దరు మాధవ్ ను చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుంది. ఆమె ప్రవర్తన ఏంటి తెలుసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తారు. జయంతి అసలు స్వరూపం గురించి తెలుసుకొని భయపడి పోతారు. ఆమె తల్లి కూడా అదే క్యారక్టర్ అని తెలిసి కంగారు పడిపోతారు. ఇలాంటి అమ్మాయితో పెద్దోడి పెళ్లి అయితే మాత్రం అతను మా నుంచి దూరం అవుతారని భయపడిపోతూ ఉంటారు. ఇక ఆ ఇంటికి వెళ్లి ఎంగేజ్మెంట్ చేసుకోవాలని అనుకుంటారు. అయితే రేపటి ప్రోమోలో జయంతి మాత్రం తనకు కాబోయే భర్త ఇంటిని చూస్తే అస్సలు బాగోలేదు.. ఆ ఇల్లు ఎప్పుడు కూలిపోతాదో తెలీదు అలాంటి ఇంటికి నువ్వు కోడలుగా వెళ్తావా అని జయంతి తమ్ముడు అడుగుతాడు. ఆ తర్వాత నారాయణ వాళ్ళు విని షాక్ అవుతారు. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :చక్రీ గర్ల్ ఫ్రెండ్ గోపిక బ్యాగ్రౌండ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?