E-Paper
Advertisement

Gold Rate Hike: భారీ కాదు.. అత్యంత భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతో తెలుసా?

Gold Rate Hike: భారీ కాదు.. అత్యంత భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతో తెలుసా?
Advertisement

Gold Rate Hike: ప్రస్తుతం బంగారం ధరలు అమాంతం పెరుగుతుండటంతో మధ్యతరగతి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా 2026 కొత్త సంవత్సరంలో ధరలు తగ్గుతాయని ఆశపడ్డ వాళ్లకి పసిడి షాక్ ఇస్తోంది. పండుగలు వచ్చినయ్, పొద్దున లేస్తే పెళ్లిళ్ల సీజన్ మొదలవుతది అందరూ ఎదురు చూస్తుంటే.. పసిడి ధరలు మాత్రం ఆకాశానికి నిచ్చెన వేస్తున్నయ్. ఈ కొత్త సంవత్సరం వేళ ధరలు కొంచెం తగ్గుతాయ్ అనుకుంటే, సీన్ రివర్స్ అయి మళ్లీ పైపైకే పోతున్నయ్.

Advertisement

నేడు బంగారం ధరలు ఇలా..

నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,460 కాగా.. నేడు సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,42,150 వద్ద ఉంది. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,750 ఉండగా.. నేడు సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,300 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ. 1,690 పెరిగింది.

Advertisement

చుక్కలు చూపిస్తున్న పసిడి ధరలు..

బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, దేశీయంగా పెరిగిన డిమాండ్. 2026 ప్రారంభంలో బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. అమెరికా-వెనిజులా వంటి దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా, పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ కంటే బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దీనికి తోడు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండటంతో డాలర్ విలువ తగ్గి, ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా సామాన్యులకు ఇది భారం అయినప్పటికీ, సురక్షితమైన ఆస్తిగా ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉండటం వల్ల డిమాండ్ తగ్గడం లేదు.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..

హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,42,150 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,300 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..

వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,150 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,300 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,150 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,300 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..

ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,300 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,30,450 వద్ద కొనసాగుతోంది.

Also Read: బోరబండలో ఘోరం.. మాట్లాడటం లేదన్న కోపంతో యువతి దారుణ హత్య!

నేటి సిల్వర్ ధరలు ఇలా..

అసలు ఏంట్రా ఇది.. సామాన్య ప్రజలను ఊపిరి పీల్చుకోకుండా చేస్తున్న పసిడి, సిల్వర్ ధరలు.. తగ్గినట్టే తగ్గి రికార్డు స్థాయిలో పెరిగిన సిల్వర్ ధరలు.. నిన్న శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 2,75,000 కాగా.. నేడు సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,87,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.12,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,70,000 వద్ద పలుకుతోంది. సిల్వర్ ధరలు రెండు లక్షలకు పెరిగినప్పుడు అమ్మో రెండు లక్షలా.. అని షాక్ అయ్యారు.. కానీ, ఇప్పుడు మూడు లక్షలు కూడా దాటే అవకాశాలు ఉన్నాయి. కావున ఎవరైనా కొనాలనుకుంటే వెంటనే కొనేయండి.. లేదంటే తర్వాత మీరే నష్టపోతారు.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×