
Ananya Pandey (Source: Instagram)
బాలీవుడ్ బ్యూటీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అనన్య పాండే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అక్కడే పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Ananya Pandey (Source: Instagram)
బాలీవుడ్ లో భారీ పాపులారిటీ అందుకున్న అనన్య పాండే తెలుగులో తొలిసారి రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

Ananya Pandey (Source: Instagram)
అయితే ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక మళ్లీ తెలుగులో ఈమెకు అవకాశాలు రాలేదు. కానీ అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు సమాచారం.

Ananya Pandey (Source: Instagram)
ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు అనన్య పాండే భక్తి పారవశ్యంలో మునిగితేలుతోంది. ఈరోజు సోమవారం సందర్భంగా శివుడి పూజలో నిమగ్నం అయింది ఈ ముద్దుగుమ్మ.

Ananya Pandey (Source: Instagram)
తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను అనన్య పాండే తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Ananya Pandey (Source: Instagram)
ఈ ఫోటోలు చూసిన అభిమానులు నిత్యం గ్లామర్ తో హీట్ పెంచే ఈమె సడన్గా ఇలా భక్తి మార్గంలో వెళ్తోంది ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.