E-Paper
Advertisement

 Gold Rates Dropped: ఆకాశం నుంచి నేలకు.. భారీగా పతనమైన బంగారం ధర.. నేడు తులం ఎంతంటే?

 Gold Rates Dropped: ఆకాశం నుంచి నేలకు.. భారీగా పతనమైన బంగారం ధర.. నేడు తులం ఎంతంటే?
Advertisement

Gold Rates Dropped: అబ్బా.. చల్లని కబురు.. బంగారం ధరల జోరుకు కాస్త బ్రేక్ పడింది! గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు, నేడు ఒక్కసారిగా కిందకు దిగిరావడంతో జనాలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సడన్ షాక్ చూస్తుంటే, కొనేటోళ్లకు పండగే అనిపిస్తోంది!

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,840 ఉండగా.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,180 వద్ద కొనసాగుతోంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,600 కాగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,000 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ. 660 తగ్గింది.

Advertisement

నిన్నమొన్నటి దాకా రేట్లు చూసి బెంబేలెత్తిపోయిన ఆడబిడ్డలు, ఇప్పుడు ధరలు తగ్గడంతో మళ్లీ నగల షాపుల వైపు కన్నేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కాకపోయినా, ఈ మాదిరిగా రేట్లు తగ్గితే మాత్రం జనాలు మళ్లీ బంగారం మీద మొగ్గు చూపేలా ఉన్నారు. డాలర్ విలువ తగ్గడం, అంతర్జాతీయంగా జరిగిన కొన్ని మార్పుల వల్లే ఈ ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే ఊపులో రేట్లు ఇంకాస్త తగ్గితే, సామాన్యుల ఇంటికి కూడా సిరుల లక్ష్మి నడుచుకుంటూ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా, ఈరోజు పసిడి ప్రియుల ముఖాల్లో చిరునవ్వు మాత్రం వెలిగిపోతోంది!

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,34,180 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,000 వద్ద ఉంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,180 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,000 వద్ద పలుకుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,180 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,000 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,330 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,23,150 వద్ద పలుకుతోంది.

Also Read: నెల్లూరులో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య.. ప్రేమిస్తున్నానంటూ విద్యార్థి వేధింపులే కారణమా?

నేటి సిల్వర్ ధరలు ఇలా..
హమ్మయ్య.. నేడు సిల్వర్ ధరలు కూడా భారీగా తగ్గాయి.. గత రెండు రోజులుగా రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు నేడు కాస్తా తగ్గుతున్నాయి. గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 2,24,000 కాగా.. నేడు శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,21,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ ధరపై రూ.3,000 తగ్గింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,09,000 వద్ద కొనసాగుతోంది.

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×