Rowdy Janardhan: ఇటీవల కాలంలో ఒక సినిమా చేయాలి అంటే సినిమాకు అయ్యే ఖర్చు కంటే కూడా హీరో హీరోయిన్లకు ఇస్తున్న రెమ్యూనరేషన్లు భారీగా ఉంటున్న సంగతి తెలిసిందే. హీరోల రెమ్యూనరేషన్లకే వందల కోట్లు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో తమిళ హీరోలు కూడా పూర్తిస్థాయి తెలుగు సినిమాలలో నటిస్తున్నారు. అలాగే కొంతమంది తెలుగు సినిమాలలో క్యామియో పాత్రలు చేస్తున్నారు. ఇలా తమిళ హీరోలకు టాలీవుడ్ నిర్మాతలు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ను అందిస్తున్న నేపథ్యంలో పలు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ప్రస్తుతం ఇతర భాషలలో కూడా సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈయన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుక రాబోతున్న రౌడీ జనార్ధన్(Rowdy Janardhan) సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్ కి సంబంధించిన వార్తలు బయటకు రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడం కోసం విజయ్ సేతుపతి 20 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారని తెలుస్తోంది.
ఇలా 20 రోజుల కాల్ షీట్స్ గాను ఈయన 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రకారం రోజుకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారనే విషయం తెలియడంతో ఒకసారిగా అందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా తమిళ హీరోలకు అత్యధిక రెమ్యూనరేషన్ లను ఇస్తూ మన తెలుగు నిర్మాతలే భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారనీ తమిళంలో ఈ హీరోలకు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్లు అందడం లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.. ఇక రౌడీ జనార్దన్ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
డిసెంబర్ 22న టీజర్..
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా నటీ కీర్తి సురేష్(Keerthy Suresh) హీరోయిన్ గా నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.. ఈ సినిమాని 2026 సమ్మర్లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దిల్ రాజు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయాలని చిత్ర బృందం భావించారు కానీ, టీజర్ కి సంబంధించిన పనులు పూర్తికాని నేపథ్యంలో ఈ టీజర్ డిసెంబర్ 22వ తేదీ సాయంత్రం విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు. ఇక విజయ్ దేవరకొండ ఇటీవల కింగ్డమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మరి రౌడీ జనార్దన్ గా ఈయన ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
Also Read: Big tv kissik Talks Promo: బాడీ షేమింగ్ కామెంట్స్… బయటకు రాలేకపోయాను టేస్టీ తేజ ఎమోషనల్!