Pakistan: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దాయాది దేశం పాకిస్థాన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి-IMF ఊహించని షాకిచ్చింది. దేశంలో పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు గర్భ నిరోధక సాధనాలపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించింది. దీన్ని ఐఎంఎఫ్ తిరస్కరించింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు పాక్ పాలకులు.
పాకిస్థాన్‌కు కండోమ్స్ సమస్య
పాకిస్థాన్‌కు కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. ఒక సమస్య పోతే మరో సమస్య వారిని వెంటాడుతోంది. వీటి నుంచి గట్టెక్కలేక అక్కడి పాలకులు సతమతమవుతున్నారు. ఓ వైపు జనాభా పెరుగుదల.. ఇంకో వైపు ధరల పెరుగుదలతో సతమతమవుతోంది. దీన్ని నుంచి గట్టెక్కేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు మరో ఝలక్ తగిలింది. తమ దేశంలో జనాభా పెరుగుదలను అరికట్టేందుకు కండోమ్స్, దానికి సంబంధించిన గర్భ నిరోధక సాధనాలపై పన్ను మినహాయించాలని ఐఎంఎఫ్‌ను అభ్యర్థించింది. ఆ అభ్యర్థనను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తోసిపుచ్చింది.
నో చెప్పిన ఐఎంఎఫ్.. గింజుకుంటున్న పాలకులు
పన్ను వసూళ్లలో రాజీ పడకూడదనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కండోమ్‌లపై విధిస్తున్న 18 శాతం జీఎస్‌టీని తొలగించేది లేదని తేల్చి చెప్పేసింది. ఈ వ్యవహారాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక పాక్ పాలకులు కింద మీదా పడుతున్నారు.
ఆర్థికంగా దివాలా అంచున ఉంది దాయాది దేశం. అంతర్జాతీయ ద్రవ్య నిధి-ప్రపంచబ్యాంకు ఇచ్చిన సహాయంతో నెట్టుకుంటూ వచ్చేస్తోంది. 7 బిలియన్ డాలర్ల నిధుల మంజూరుకు ఐఎమ్ఎఫ్ అనుమతించింది. అందుకు కొన్ని షరతులు పెట్టింది. తాము చెప్పినట్టు సంస్కరణలు అమలు చేయాలని తేల్చి చెప్పింది. వీటిల్లో కొన్నింటిని వెంటనే అమలు చేయాలన్నది తొలి షరతు.
ALSO READ: బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస.. భారత్ హైకమిషనర్, పత్రికా ఆఫీసుల ముట్టడి, ఆపై దాడి
ఆర్థిక సంవత్సరం మధ్యలో పన్ను ఉపశమనం సాధ్యం కాదని తేల్చేసింది ఐఎంఎఫ్. ఇప్పటికే సవరించిన ఆదాయ లక్ష్యాలను చేరుకోవడానికి ఇబ్బందిపడుతోంది. ఇలాంటి సమయంలో IMF ఆ డిమాండ్‌ను తిరస్కరించింది. కండోమ్స్, శానిటరీ ప్యాడ్‌లు, బేబీ డైపర్‌లపై జీఎస్టీని తగ్గించాలనే పాకిస్తాన్ ప్రతిపాదనను తిరస్కరించింది. రాబోయే బడ్జెట్‌లో వీటిపై చర్చిస్తామని పేర్కొంది.
పాకిస్తాన్ ప్రస్తుతం ఆదేశ జనాభా పెరుగుదల రేటు 2.55 శాతంగా ఉంది. ప్రపంచంలోనే ఇదే అత్యధికం కూడా. ప్రతి ఏటా దాదాపు ఆరు మిలియన్ల మంది జనాభా పెరుగుతోంది. ఇదే క్రమంలో అక్కడ ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. కనీసం ధరల మాట ఏమోగానీ, జనాభా నియంత్రణకు ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే చెక్ పెట్టింది.