E-Paper
Advertisement

Gold Rates: పసిడి పంజా.. సామాన్యులకు గుండె గుభేల్.. లక్షా యాభై వేల దిశగా బంగారం ధరలు!

Gold Rates: పసిడి పంజా.. సామాన్యులకు గుండె గుభేల్.. లక్షా యాభై వేల దిశగా బంగారం ధరలు!
Advertisement

Gold Rates: అమ్మో.. పసిడి ధరలు చూస్తుంటే గుండె గుభేల్ మంటున్నది.. ఈ మధ్యన బంగారం రేట్లు ఆకాశాన్ని అంటుతున్నయ్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయ్.. ఇలా ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే.. ఇతర దేశాల్లో జరుగుతున్న గొడవలు, యుద్ధాల వల్ల పైసల మీద నమ్మకం తగ్గి అందరూ బంగారం కొని పెట్టుకుంటున్నరట. దానికి తోడు అమెరికా వాళ్లు వడ్డీ రేట్లు తగ్గించొచ్చని వార్తలు రావడం, మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ మస్తు పెరిగింది. ఇదే జోరు కొనసాగితే ఈ నెల ఆఖరి వరకు తులం బంగారం లక్షా యాభై వేల మార్కును దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,240 కాగా.. నేడు మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,47,280 వద్ద ఉంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,050 ఉండగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,000 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,040 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,47,280 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,000 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,280 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,000 వద్ద కొనసాగుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,280 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,000 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,430 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,35,150 వద్ద కొనసాగుతోంది.

Also Read: వేట మొదలైంది.. రంగంలోకి దిగిన తెలంగాణ జాగృతి

నేటి సిల్వర్ ధరలు ఇలా..
అయ్యబాబోయ్.. షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న బులియన్ మార్కెట్.. రోజు రోజుకు ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. నిన్న సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,18,000 కాగా.. నేడు మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,30,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.12,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 3,15,000 వద్ద పలుకుతోంది.

Related News

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

Big Stories

Advertisement
×