BCCI Central Contract: భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్లేయర్లకు చెల్లించే జీతాల విషయంలో భారీ కోత విధించేందుకు అడుగులు వేస్తోందట. ఇప్పటి వరకు ఉన్న A ప్లస్ ( A+ Grade) కేటగిరిని తొలగించి, మూడు కేటగిరీలను మాత్రమే కొనసాగించేందుకు సిద్ధమైందట. అంటే ఇకపై A ప్లస్ తొలగిపోయి…A, B, C కేటగిరీలు మాత్రమే ఉంటాయన్నమాట. ఈ మూడు కేటగిరిల్లో మాత్రమే టీమిండియా ప్లేయర్లు ఉంటారని సమాచారం. అటు A ప్లస్ లో ఉన్న విరాట్ కోహ్లీ ( Virat Kohli) అలాగే రోహిత్ శర్మకు ( Rohit Sharma ) ఊహించని షాక్ తగలనుంది. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లను B కేటగిరీలోకి తీసుకువచ్చేందుకు సన్నద్ధమైందట బీసీసీఐ. ఈ నెల చివరలో ఈ మార్పులపై అధికారిక ప్రకటన కూడా చేయనుందట. అదే సమయంలో ఏ ప్లేయర్లకు ఏ కేటగిరి ఇస్తున్నామనే వివరాలు కూడా వెల్లడించనుంది బీసీసీఐ. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Also Read: Virat Kohli: న్యూజిలాండ్ ప్లేయర్ మెడ పట్టుకుని తోసేసిన కోహ్లీ..బంతిని తన్ని మరీ రెచ్చిపోయాడుగా
2026 కొత్త సంవత్సరం వచ్చిన నేపథ్యంలో ప్లేయర్ల జీతాల విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి సంచలన నిర్ణయం తీసుకుందట. ఇప్పటి వరకు ఉన్న నాలుగు కేటగిరీలను మూడు కేటగిరీలుగా విభజించేందుకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మకు ఊహించని షాక్ తగిలే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇన్ని రోజులపాటు A ప్లస్ కేటగిరిలో విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఉన్నారు.
ఈ కేటగిరిలో ఉండాలంటే మూడు ఫార్మాట్స్ ఆడాలి. టి20 లు టెస్టులు వన్డేలు ఇలా అన్నిటిలో రాణించాలి. అలాంటి ప్లేయర్లకు A ప్లస్ కేటగిరి ఇస్తారు. అయితే ఇప్పటికే T20 లతో పాటు టెస్టులకు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం వన్డేలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో వాళ్ళ కేటగిరీని మార్చేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేసింది. ఇన్ని రోజులు A ప్లస్ లో ఉన్న వాళ్లను B కేటగిరిలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ వేసింది. అంటే వాళ్ళ వార్షిక ఆదాయం పూర్తిగా తగ్గిపోనుంది. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు కూడా వెల్లడించనుంది.
నాలుగు కేటగిరీలను మూడు కేటగిరీలుగా విభజిస్తే కొత్త జీతాలు బిసిసిఐ ప్రకటించే ఛాన్స్ ఉంది. దాని ప్రకారం చూసుకున్నట్లయితే… కేటగిరి A ప్లేయర్లు కచ్చితంగా మూడు ఫార్మాట్స్ ఆడాలి. ఈ ప్లేయర్లకు ఏడాదికి ఏడు కోట నుంచి 10 కోట్ల రూపాయలు దక్కే ఛాన్స్ ఉంది. ఇందులో కెప్టెన్ గిల్ , బుమ్రా ఉండే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కేటగిరి B లో ఉన్న ప్లేయర్లు కచ్చితంగా రెండు ఫార్మాట్స్ ఆడాలి. లేదా టెస్ట్ స్పెషలిస్టు అయి ఉండాలి. వాళ్లకు మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు దక్కే ఛాన్స్ ఉంది. ఇక కేటగిరి C లో ఉన్న వారికి ఏడాదికి కోటి రూపాయలు ఇస్తారు. ఏదైనా ఒక ఫార్మాట్ లో కచ్చితంగా ఆడాలి. జట్టులో కొత్తగా వచ్చిన స్టార్ ఆటగాళ్లకు కూడా అవకాశం ఉంటుంది.
🚨 NO A+ CATEGORY IN BCCI CENTRAL CONTRACT 🚨
– BCCI is likely to remove A+ Category in the Players' Central contract. Only three category A, B & C will remain. (Sports Tak). pic.twitter.com/PE2mNezzAq
— Tanuj (@ImTanujSingh) January 20, 2026
🚨 KOHLI & ROHIT AT "B" CATEGORY 🚨
– Virat Kohli and Rohit Sharma are likely to shift in Grade B Category in BCCI's Central contract. (Vipul Kashyap/ANI). pic.twitter.com/K9eWEEPYaY
— Tanuj (@ImTanujSingh) January 20, 2026